×
Ad

కాల అమృతయోగము అంటే ఏంటి? మీకు ఉందా? రోగం వస్తే డాక్టర్లూ ఏమీ చేయలేరు.. మరి ఎలా? 

ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన వివరాలు..

Kaal Sarp Dosh: జాతక కుండలిలో అగ్రభాగంలో రాహువు, కింది భాగంలో కేతువు ఉండి.. రాహువు, కేతువుల మధ్య సప్తగ్రహములు బంధించి ఉంటే దానిని కాలసర్ప యోగము అని అంటారు. ఇది కాలసర్పయోగము నిర్వచనము. దీనికి వ్యతిరేకంగా ఉన్న యోగమును కాల అమృతయోగము అని అంటారు.

వ్యతిరేకత అంటే.. అగ్రభాగంలో కేతువు, కింది భాగంలో రాహువు ఉండి సప్తగ్రహములు కేతువు, రాహువుల మధ్య బంధించి ఉంటే దానిని కాల అమృతయోగము అని అంటారు. ఇక్కడ కాల అమృత యోగములో జన్మలగ్నాన్ని లెక్కలోకి తీసుకోకూడదు. (Kaal Sarp Dosh)

Also Read: ధూమ్‌ 2 సినిమా సీన్‌ను మించి దోపిడీ.. ప్రఖ్యాత మ్యూజియంలో 7 నిమిషాల్లో చోరీ.. నెపోలియన్‌ కాలంనాటి ఆ ఆభరణాలను ఇక చూడలేం..

ఇక్కడ జన్మలగ్నము అవసరము లేదు. ఈ కాల అమృతయోగము వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులు సంభవిస్తాయి. కండరాల, ఎముకల వ్యాధులు, నరముల వ్యాధులు, పక్షవాతం, సంతాన నష్టం, వీర్యకణముల లోపాలు ఉంటాయి.

ఈ యోగము వల్ల రోగము వస్తే డాక్టర్లకు కూడా అంతుపట్టదు. ఎంతో మంది వైద్యులు దగ్గరకు వెళ్లినా పరిష్కారము కాదు. కాళ్లు నొప్పులు, కీళ్ల వ్యాధులు, ఉదర సంబంధమైన వ్యాధులు, ఎంతకూ పరిష్కారము కాని వ్యాధులు వస్తాయి.

ఇక్కడ శారీరక వ్యాధులను రాహువు కలిగిస్తాడు. మానసిక వ్యాధులను కేతువు కలిగిస్తాడు. వీటికి సరైన శాస్త్రీయపద్ధతిలో తగిన నివారణలు చేసుకోవాలి.

పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ

Ph: 9849280956, 9515900956