Vrushabha Rasi Phalalu 2026 : వృషభ వారికి అలర్ట్.. అప్పు చేసైనా సరే ఆ పని చేస్తే ఇక మీకు తిరుగుండదు..!
Vrushabha Rasi Phalalu 2026 : 2026 సంవత్సరంలో వృషభ రాశి వారికి డబ్బు నీళ్లలా ఖర్చవుతుందని.. కాకపోతే ఒక్క పని చేస్తే ప్రయోజనం కలుగుతుంది అంటున్నారు.
- Dharani Pilli
- Published On : March 15, 2026 / 04:20 PM IST
Parabhava nama samvatsara ugadi panchangam 2026 vrushabha rasi phalalu Taurus horoscope
ఈ సంవత్సరం వృషభ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని అనుభవించే సమయం. టూర్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తారని చెబుతున్నారు. అయితే ఈ సంవత్సరం వృషభ రాశి వారు ఎంత ప్రయత్నించినా చేతిలో డబ్బు నిలవదని.. ఎంత ఆదాయం వస్తే అంత ఖర్చు అవుతుందంటున్నారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారి జేబుకు చిల్లు పడే పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరిస్తున్నారు. టూర్లకు వెళ్లండి, కుటుంబంతో గడపండి. డబ్బు ఎలాగో ఖర్చవుతుంది కాబట్టి దానిని ఎంటర్టైన్మెంట్ కోసం వాడుకోవడం ఉత్తమం.
ఆదాయం: 8, వ్యయం: 11, రాజపూజ్యం: 3, అవమానం: 1
ఈ సంవత్సరం వృషభ రాశి వారు డబ్బును బాగా ఖర్చు చేస్తారు కనుక ఆ మొత్తాన్ని భూములు, ఆస్తుల కొనుగోలుపై ఖర్చు చేస్తే నిలకడగా ఉంటుందని.. లేదంటే దొంగల పాలు, వృధా అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ ఏడాది వృషభ రాశి వారు అప్పు చేసి అయినా సరే ఇల్లు లేదా భూమి కొనడం మంచిదంటున్నారు.
వృషభ రాశి వారికి జూన్ 1వ తేదీ వరకు: గురు గ్రహం అనుకూలంగా ఉంటాడని అప్పుల విషయాలను అప్పుడే సెటిల్ చేసుకోమంటున్నారు. పెట్టుబడులు పెట్టకుండా అప్పులు తీర్చడం ఉత్తమం అంటున్నారు.
జూన్ నుండి అక్టోబర్ వరకు: గురుడు కర్కాటకంలోకి రావడం వల్ల కుటుంబ సభ్యులు, అన్నదమ్ములతో ఆస్తి తగాదాలు, కోర్టు కేసులు వచ్చే అవకాశం ఉంది. స్నేహితులతో విరోధాలు కలగవచ్చు. మానసిక ప్రశాంతత తగ్గుతుందని.. అలానే అతిగా ప్రేమించిన వారే మోసం చేయడం, ఇబ్బంది పెట్టడం జరుగుతుందంటున్నారు. అలానే బంగారం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ముఖ్యమైన పరిహారాలు:
- గురు గ్రహ మాల ధరించాలి.
- అక్షయ తృతీయ నాడు తప్పక శ్రీ మహాలక్ష్మి యాగం చేయించుకోవాలి.
- ఆలయ దర్శనం: కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకోవాలి. అమ్మవారికి బంగారు వర్ణం (పసుపు) చీరను, కుంకుమ లేదా గ్రీన్ కలర్ బోర్డర్ ఉన్నదానిని సమర్పించాలి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. దీన్ని 10tv.in నిర్ధారించడం లేదు.
