జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..
శ్రీ క్రోధి నామ సంవత్సర ఆశ్వీజ మాస బహుళ షష్ఠి రా 1:28, ఆర్ద్ర రాతె 5:38 మంగళవారం ఈ రోజు ద్వాదశ రాశుల ఫలితములు.
మేషం : అనుకోని ప్రయాణములు, ధనలాభములు, వ్యాపారంలో విభేదములు, కోర్టు సమస్యలు, చికాకులు, ఆరోగ్యము కుదుట పడుతుంది, స్త్రీలతో గొడవలు, విమర్శలు, న్యాయనిపుణులను సంప్రదిస్తారు, వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు కలుగుతాయి, దత్తాత్రేయ పారాయణము చేయటం వల్ల శుభం కలుగుతుంది.
వృషభం : ప్రయాణములలో ప్రమాదములు, ఆకస్మిక ధనలాభము, శుభకార్యనిర్వాహణ, వాగ్దానములు నెరవేరటం, ఆర్ధిక నష్టాన్ని పూడ్చుకుంటారు, అగ్రిమెట్లు ఫలిస్తాయి, స్థిర ఆదాయం తగ్గుతుంది, అవివాహితులకు శుభవార్తలు: విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభం కలుగును.
మిధునం : ధనవ్యయం, కోపము, ఆవేశము పెరగడం, తోందరపాటు నిర్ణయుములు, బంధు మిత్రులతో అనుభంధం పెరగడం, ప్రయాణములలో నష్టము, సంతానము ద్వారా శుభవార్తులు, ఆదాయం పెరగడం, నూతన వస్త్రములు కొనడం, ఇష్ట దైవ ఆరాధన చేయడం వల్ల శుభం కలుగును.
కర్కాటకం : అన్నింటా విజయం, విద్యార్థులకు అనుకూలము, ధనలాభము, ప్రమాదములు, గొడవలు రాకుండా కాపాడుకోవాలి, విలువైన ఆభరణములు కొనుగోలు చేస్తారు, విద్యార్థులకు అనుకూలము, గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు: శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.
సింహం : అనుకోని ప్రయాణములు, ధననష్టము, వృధాభ్రమణం, ప్రయాణములు, ఉద్యోగ ప్రయత్నములు సఫలీకృతం కావడం, నూతన ఉద్యోగములు, నూతన వ్యాపారములు, మంచి ఆలోచనలు: గణపతి ఆరాధన చేయడం వల్ల శుభం కలుగుతుంది.
కన్యా : బంధువిరోధమలు, బుద్ధి చాంచల్యములు కలుగును, శరీర పీడ, నీచ స్త్రీ మూలక కలహాములు, అనవసర కార్యములకు ధన వ్యయము, అపకీర్తి రాకుండా కాపాడుకోవాలి, రుణబాధలు, మెసపోవడం, ఎవరిని నమ్మకూడదు, బంధు వర్గంలో గౌరము పెరుగును: ఇష్ట దైవ ఆరాధన చేసినచో అంతా మేలు జరుగును.
తులా : పిత్రార్జితము రావడం, మంచి ఉద్యోగములు రావడం, ధనలాభములు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు, అన్నదమ్ములతో అనుకూలతలు కల్గును, వివాహ సంబంధములు కుదురును, సంతానము ద్వారా శుభవార్తలు, అన్ని పనులలో విజయము, బంధుమిత్రులతో విందు వినోదములతో కాలము గడుపుదురు: శివారాధన చేయటం వల్ల ఇబ్బందులు తొలగి పోతాయి
వృశ్చికం : ధనవిషయంలో చికాకులు, అకాల భోజనములు, రోగ బాధలు కలుగును, ఉద్యోగంలో ప్రతికూలము, ప్రయాణంలో లాభములు, మానసిక వేదనలు, ప్రతివిషయములో విచారములు కలగడం, నమ్మినవారి వలన మోసపోవడం, బంధు మిత్రులతో విరోధములు కలగడం, అనవసరపు విషయములలో జాగ్రత్త అవసరం, వ్యాపారంలో ఇబ్బందులు: అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ఉత్తమైన ఫలితములు కలుగును
ధనస్సు : ఆకస్మిక ప్రయాణాల వలన లాభములు, విలువైన ఆభరణములు కొనుగోలు చేయడం, జాయింటు దారులతో అనుకూలత, ధనప్రాప్తి, వస్త్రలాభము, ఆరోగ్యము, జయము, ఎంతటి పనినైనను ధైర్యసాహసములతో చేసి విజయమును పొందుతారు, దూర ప్రాంతపు ప్రయాణములు అనుకూలించును: శ్రీ రామనామ జపం చేయండి. శుభ ఫలితములు కలుగుతాయి.
మకరం : కోర్టు వ్యవహారములు వాయిదా పడటం, దూరపు ప్రాంతములకు వెళ్లవలసివచ్చును, శుభ కార్యక్రమములకు ఆటంకములు, విద్యుత్తు పరికరములు, మిషనరీలు వాహనమలు కొనుగోలు, రావలసిన బాకీలు వసూలు చేయుట, నూతన వస్త్రములు, ఆభరణములు కొనుగోలు చేయడం: దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయడం వల్ల సమస్యలు తొలగుతాయి
కుంభం : కుటుంబములోని వారికి ఆరోగ్యము తగ్గుతుంది, చేయు పనులయందు కష్టనష్టములు ఎదురావుతాయి, పనిలేని ప్రయాణములు, పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది, ఉద్యోగ వ్యాపారములయందు దిగువ వారి సహయములు ఉండవు: శ్రీకృష్ణ మంత్ర జపం చేయవలెను మంచి ఫలితములు కలుగుతాయి.
మీనం : ధననష్టం, వృధాప్రయాణములు, చికాకులు, అలసట, వస్తువులు కొనుగోలు, స్త్రీలకు నూతన అవకాశములు, స్థిరాస్తి పెరగడం, ధనధాన్య సమృద్ధికలగడం, విధ్యార్థులకు అనుకూలము: దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితములు పొందుతారు.
— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Contact: 9849280956, 9515900956