Today Horoscope
Horoscope Today : చాలాకాలం పాటు స్తంభించి మిథునంలో ఉన్న కుజుడు.. కర్కాటకంలోకి అడుగుపెట్టాడు. అంగారకుడు నీచలోకి ప్రవేశించడంతో ఒకట్రెండు రాశులకు మినహా మిగతా రాశులవారికి చుక్కలు చూపిస్తాడు. ప్రపంచవ్యాప్తంగా వాహన ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. వ్యక్తిగత జాతకాల విషయానికి వస్తే.. మేషం, కర్కాటకం, ధనుస్సు, మకర రాశులవారిని పరీక్షిస్తాడు.
Aries
మేషం: వ్యయంలో ఐదు గ్రహాలు, చతుర్థంలో కుజుడు ప్రతికూల పరిస్థితులను కల్పిస్తాయి. ఎదుటివారిని నొప్పించేలా మాట్లాడకండి. ఆవేశం అనర్థానికి దారితీస్తుందని గుర్తించండి. దగ్గరివారిని దూరం చేసుకోకండి. గణపతి అష్టోత్తరం చదువుకోండి.
Taurus
వృషభం: రాశిలో గురు, చంద్రుల కలయిక విశేష యోగాన్ని ఇస్తున్నది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. డబ్బుకు లోటుండదు. కీర్తి పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఊహించని లాభాలు అందుకుంటారు. సోదరులతో వైరం ఏర్పడవచ్చు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
Gemini
మిథునం: కుటుంబంలో కలహ వాతావరణం ఉంటుంది. ఇంట ఎలా ఉన్నా.. బయట మాత్రం పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా విజయం అందుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులపై మనసు నిలుపుతారు. శివారాధన శుభప్రదం.
Cancer
కర్కాటకం: ఆరోగ్యపరంగా చికాకులు తలెత్తుతాయి. ఆందోళనలు అధికమవుతాయి. ఎదుటివారు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సంయమనం పాటించండి. రోజు చివరిలో కొంత ప్రశాంతత నెలకొంటుంది. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.
Leo
సింహం: పరిస్థితులు ప్రతికూలంగా పరిణమిస్తాయి. మీరొకటి తలిస్తే.. దైవం మరొకటి తలుస్తుంది. పట్టువిడుపులు అవసరం. చిన్న చిన్న విషయాలకు అతిగా ఆలోచించకండి. సాయంత్రానికి పరిస్థితులు సద్దుమణుగుతాయి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
Virgo
కన్య: దైవ బలం పెరుగుతుంది. ఆస్తి ద్వారా రాబడి పొందుతారు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం దక్కుతుంది. బంధువులు, స్నేహితులను కలుసుకుంటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. శివాలయాన్ని సందర్శించండి.
Libra
తుల: ఉద్యోగంలో చికాకులు ఉంటాయి. ఆరోగ్య పరంగా స్వల్ప ఇబ్బందులు తలెత్తుతాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. ఆకస్మిక ధనలాభం ఉంది. పరిస్థితులను అనుకలంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
Scorpio
వృశ్చికం: రక్తపోటు అధికమవుతుంది. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా కంగారుపడతారు. గురువు చల్లని చూపుతో.. పరిస్థితి అదుపులోకి వస్తుంది. ఆందోళనకు గురవ్వకండి. సాయంత్రానికి అన్నీ సర్దుకుంటాయి. గణపతి స్తోత్రాలు పఠించండి.
Sagittarius
ధనుస్సు: ఆత్మీయులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. రోజంతా కంగారుగా గడిచిపోతుంది. స్థిరత్వం ఉండదు. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించడం అవసరం. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. దైవ బలం అవసరం. నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి.
Capricorn
మకరం: పదిమంది నుంచి ప్రశంసలు అందుకుంటారు. అదే సమయంలో అధికారుల ఆగ్రహానికీ గురవుతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో జాప్యం జరగదు. ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తే ఏ ఇబ్బందీ రాదు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
Aquarius
కుంభం: మీ జోలికి ఈ రోజు ఎవరైనా వస్తే వాడికి మూడినట్టే! అలాగని మొండిగా వ్యవహరించొద్దు. తెలివిగా సమాధానం ఇవ్వండి. ఆర్థికంగా మంచి ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యంలో మంచి మార్పు వస్తుంది. శివాలయాన్ని సందర్శించండి.
Pisces
మీనం: పనులతో తీరిక లేకుండా గడుపుతారు. అందుకు తగ్గ ప్రతిఫలం పొందుతారు. పిల్లల విషయంలో ఆందోళన చెందుతారు. ఆలోచనలు స్థిమితంగా ఉండవు. సంయమనం పాటించడం అవసరం. అంగారక స్తోత్రాలు పఠించండి.
(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)
టి. భుజంగరామ శర్మ
77022 86008
Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.