Own House : సొంతిల్లు కొనాలనుకుంటున్నారా.. అతి ముఖ్యమైన 10 సూత్రాలు.. అవేంటో తెలుసా?

సొంతిల్లు కొనుగోలు చేసే సమయంలో అతి ముఖ్యమైన 10 సూత్రాలను పాటించాలని సూచిస్తున్నారు రియల్ రంగ నిపుణులు.

Guide to Home Buying

Own House Tips: సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. ఎవరి బడ్జెట్‌కు అనుగుణంగా వారు ఎక్కడో ఓ చోటు ఇల్లు కొనుక్కోవాలనో లేదంటే కట్టుకోవాలనో కోరుకుంటారు. అయితే సొంతింటిని సెలెక్ట్ చేసుకోవడం అంత ఆశామాషి వ్యవహారం మాత్రం కాదు. అందుకే ఇంటి కొనుగోలు (Home Buying) సమయంలో కొన్ని సూత్రాలను పాటించినట్లైతే ఏ సమస్యా రాకుండా సొంతింట్లోకి వెళ్లిపోవచ్చంటున్నారు రియల్ రంగ నిపుణులు. ఇంతకీ సొంతింటి కోసం పాటించాల్సిన 10 సూత్రాలేంటో తెలుసుకుందామా.

సొంతిళ్లు కావాలనేది ప్రతి ఒక్కరి కల. ఆర్థిక పరిస్థితిని బట్టి ఎప్పుడొ ఒకప్పుడు.. ఎక్కడో ఓ చోట.. తమ తమ బడ్జెట్‌కు అనుగుణంగా ఓ ఇళ్లు కొనుక్కోవాలని అందరూ భావిస్తుంటారు. ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుకు తోడు బ్యాంకు రుణం తీసుకుని ఇళ్లు కట్టుకోవడమో, కొనుక్కోవడమో చేస్తుంటారు చాలా మంది. అయితే సొంతింటి కోసం మనం పెట్టే ప్రతి పైసా చాలా ముఖ్యమైనదే. సరైన సమయంలో, సరైన ప్రాంతంలో, సరైన ధరకు ఇళ్లు కొనుక్కోవడం అంత ఆశామాషీ వ్యవహారం కాదు. అందుకే ఇంటి కొనుగోలు సమయంలో ఆర్థిక, రియల్ రంగ నిపుణుల సలహాలు, సూచనలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టి కొనుగోలు చేసే ఇంటి విషయంలో చాలా జాగ్రత్త అవసరం అని ప్రత్యేక్యంగా చెప్పాల్సిన పనిలేదు.

సొంతింటి కొనుగోలుకు 10 సూత్రాలు
సొంతిల్లు కొనుగోలు చేసే సమయంలో అతి ముఖ్యమైన 10 సూత్రాలను పాటించాలని సూచిస్తున్నారు రియల్ రంగ నిపుణులు. అందులో ప్రధానమైనది మనం కొనాలనుకుంటున్న ఇళ్లు ఉండే ప్రాంతం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా భవిష్యత్తులో ఆ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందుతుంది.? రానున్న రోజుల్లో వచ్చే మౌలిక సదుపాయాలేంటీ? విద్య, వైద్య, రవాణా సౌకర్యాలెలా ఉన్నాయన్న దానిపై అవగాహనకు రావాలి. ఇక మనం కొనాలనుకుంటున్న ఇంటికి సంబంధించిన డెవలపర్ గత చరిత్ర, సదరు బిల్డర్ పూర్తి ప్రొఫైల్ తెలుసుకోవాలి. గతంలో ఆ డెవలపర్ పూర్తి చేసిన ప్రాజెక్టులను పరిశీలించి, అవసరమైతే అందులోని కస్టమర్లతో మాట్లాడి ఓ అవగాహనకు రావాలని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. అప్పటికే నిర్మాణం పూర్తైన ప్రాజెక్టుల్లో ఏవైనా న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తాయా అన్నది విచారించాలి.

Also Read: ఇళ్ల అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోన్న హైదరాబాద్.. 26 శాతం పెరిగిన సేల్స్

హెచ్ఎండీఎ, రెరా వివరాల తనిఖీ
మనం కొంటున్న ఇంటికి సంబంధించిన ప్రాజెక్టులో రానున్న రోజుల్లో ధరలు ఎంత వరకు వృద్ధి చెందుతాయన్న దానిపై ఓ అంచనాకు రావాలి. ఒకవేల ఇంటికి సంబంధించిన ప్రాజెక్టు నిర్మాణంలో ఉంటే సదరు బిల్డరు సకాలంలో నిర్మాణాన్ని పూర్తి చేస్తాడా అన్నదానితో పాటు బిల్డర్ ఆర్థిక సామర్ధ్యంపై ఓ అంచనాకు రావాలి. ఇంటి నిర్మాణానికి సంబంధించి బిల్డర్ ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటాడా అన్నది విచారించాలి. ఇక యథావిధిగా నిర్మాణ అనుమతులకు సంబంధించి హెచ్ఎండీఎ, రెరాతో పాటు ఇతర వివరాలు భౌతికంగా తనిఖీ చేయాలి. మనం కొనే ఇంటి ప్రాజెక్టుపై బిల్డరు ఏమైనా రుణాలు తీసుకున్నాడా, లేదంటే పాత లోన్స్‌కు సంబంధించి రీపేమెంట్ వంటి వివరాలపై ఆరా తీయాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: తెలంగాణలో ప్లాట్లు, ఇళ్ల కొనుగోలుదారులకు రెరాతో రక్షణ.. ఎలాగో తెలుసా?

సొంతిల్లు కొనుక్కునే ముందు ఇలా ప్రతి విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఇల్లు జీవితంలో ఒకేసారి కొనుక్కుంటాం. అందుకే ఈ 10 సూత్రాలు పాటించి.. మీకు నచ్చిన ప్రాంతంలో మీ బడ్జెట్‌కు అనుగుణంగా ఇంటిని కొనుగోలు చేయాలని రియాల్టీ నిపుణులు చెబుతున్నారు.