Yamaha Hybrid Scooters: సరికొత్త సాంకేతికతతో యమహా 125సీసీ హైబ్రిడ్‌ స్కూటర్‌లు.. ధరెంతో తెలుసా?

ఈ మొత్తం 125 సీసీ హైబ్రిడ్‌ స్కూటర్‌ శ్రేణిలో యమహా విప్లవాత్మక బ్లూ టూత్‌ ఆధారిత వై– కనెక్ట్‌ యాప్‌ (ఫ్యాక్టరీ ఫిట్టెడ్‌) ఉంటుందట. ద్విచక్ర వాహనాలకు నూతన ప్రమాణాలను నిర్ధేశిస్తూ, యమహా కనెక్ట్‌ యాప్‌.. పలు సౌకర్యవంతమైన ఫీచర్లను సైతం కలిగి ఉంటుంది. దీనిలో ఇంధన వినియోగట్రాకర్‌, నిర్వహణ సూచనలు, చివరి పార్కింగ్‌ లొకేషన్‌, మాల్‌ఫంక్షన్‌ నోటిఫికేషన్‌, రైడర్‌ ర్యాంకింగ్‌ సహా మరెన్నో ఉంటాయి.

125cc hybrid scooters from Yamaha with latest technology

Yamaha Hybrid Scooters: మరింత ఆహ్లాదకరమైన రైడింగ్ అనుభవాల్ని అందించడం కోసం యమహా మోటర్‌ (ఐవైఎం) ప్రైవేట్‌ లిమిటెడ్‌ సిద్ధమైంది. ఆ కంపెనీ సరికొత్త సాంకేతికతతో 125 సీసీ రేంజులో మూడు హైబ్రీడ్ స్కూటర్లను తాజాగా భారత విపణిలో విడుదల చేసింది. అవి ఫాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌, రే జెడ్‌ఆర్‌ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌, రేజెడ్‌ఆర్‌ స్ట్రీట్‌ ర్యాలీ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌.

Hyderabad Metro Jobs : హైదరాబాద్ మెట్రో రైల్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ

కార్బన్‌ ఉద్గారాలను తగ్గించాలనే భారత ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ 2023 వెర్షన్‌ యయహా 125 సీసీ హైబ్రిడ్‌ స్కూటర్‌ శ్రేణి ఈ20 ఫ్యూయల్‌ ప్రమాణాలతో కూడిన ఇంజిన్‌ను కలిగి ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అంతేకాకుండా, ఈ నూతన ఇంజిన్‌ ఓబీడీ2 ప్రమాణాలను సైతం కలిగి ఉంటుందని పేర్కొన్నారు. ఈ మొత్తం 125 సీసీ హైబ్రిడ్‌ స్కూటర్‌ శ్రేణిలో యమహా విప్లవాత్మక బ్లూ టూత్‌ ఆధారిత వై– కనెక్ట్‌ యాప్‌ (ఫ్యాక్టరీ ఫిట్టెడ్‌) ఉంటుందట. ద్విచక్ర వాహనాలకు నూతన ప్రమాణాలను నిర్ధేశిస్తూ, యమహా కనెక్ట్‌ యాప్‌.. పలు సౌకర్యవంతమైన ఫీచర్లను సైతం కలిగి ఉంటుంది. దీనిలో ఇంధన వినియోగట్రాకర్‌, నిర్వహణ సూచనలు, చివరి పార్కింగ్‌ లొకేషన్‌, మాల్‌ఫంక్షన్‌ నోటిఫికేషన్‌, రైడర్‌ ర్యాంకింగ్‌ సహా మరెన్నో ఉంటాయి.

Drone Delivers Pension : వావ్.. డ్రోన్‌తో ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ, ఆనందంలో లబ్దిదారుడు

వీటితో పాటుగా 2023 శ్రేణి యమహా 125 హైబ్రిడ్‌ స్కూటర్లు అసాధారణ రంగులతో రావడంతో పాటుగా భారతీయ వినియోగదారులకు మరింత ఆసక్తిని రేకిత్తించే శైలిలో ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ విషయమై యమహా మోటర్‌ ఇండియా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ ఐషిన్‌ చిహానా మాట్లాడుతూ ‘‘కాల్‌ ఆఫ్‌ ద బ్లూ బ్రాండ్‌ ప్రచారం కింద మా వినియోగదారులకు అసాధారణ అనుభ వాలను అందించాలన్నది మా ప్రయత్నం. భారతదేశంలో స్కూటర్‌ విభాగంలో పోటీ అధికంగా ఉండటంతో పాటుగా వినియోగదారుల అంచనాలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. భారతదేశంలో సుప్రసిద్ధ ద్విచక్ర వాహన సంస్ధగా మోటర్‌సైకిల్స్‌కు ఆవల 2023 వెర్షన్‌ మా 125సీసీ హైబ్రిడ్‌ స్కూటర్‌శ్రేణితో అత్యున్నత అనుభవాలను అందించనున్నాము. భారతీయ వినియోగదారుల అంచనాలను సరికొత్త ఫీచర్లు, రంగులతో అందుకోగలమని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.

OnePlus 11R Pre-Order : ఫిబ్రవరి 21 నుంచి వన్‌ప్లస్ 11R ఫోన్‌పై ప్రీ-ఆర్డర్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. సేల్ ఎప్పటినుంచంటే?

ధరల వివరాలు
Models Ex-Showroom (Delhi)
Fascino S 125 Fi Hybrid (Disc) Dark Matt Blue Rs. 91,030
Ray ZR 125 Fi Hybrid (Disc) Dark Matt Blue Rs. 89,530
Ray ZR Street Rally 125 Fi Hybrid (Disc) Light Grey Vermillion & Matte Black Rs. 93,530