OnePlus 11R Pre-Order : ఫిబ్రవరి 21 నుంచి వన్‌ప్లస్ 11R ఫోన్‌పై ప్రీ-ఆర్డర్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. సేల్ ఎప్పటినుంచంటే?

OnePlus 11R Pre-order : వన్‌ప్లస్ (OnePlus) 11 సిరీస్ ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఫిబ్రవరి 21న మొదటిసారిగా OnePlus 11R ఫోన్ ప్రీ-ఆర్డర్, ఫిబ్రవరి 28న సేల్ ఈవెంట్ జరుగనుంది. అప్పటివరకూ వేచి చూడలేకపోతే ముందుగానే ఆర్డర్ చేసుకోవచ్చు.

OnePlus 11R Pre-Order : ఫిబ్రవరి 21 నుంచి వన్‌ప్లస్ 11R ఫోన్‌పై ప్రీ-ఆర్డర్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. సేల్ ఎప్పటినుంచంటే?

OnePlus 11R pre-order starts in India on February 21_ Check out price and other details

OnePlus 11R Pre-order : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) 11 సిరీస్ ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఫిబ్రవరి 21న మొదటిసారిగా OnePlus 11R ఫోన్ ప్రీ-ఆర్డర్, ఫిబ్రవరి 28న సేల్ ఈవెంట్ జరుగనుంది. అప్పటివరకూ వేచి చూడలేకపోతే ముందుగానే ఆర్డర్ చేసుకోవచ్చు. OnePlus 11R కంపెనీ మిడ్-రేంజ్ ప్రీమియం 5G ఫోన్.. ఈ ఫోన్ ఫాస్ట్ పెర్ఫార్మెన్స్, ఛార్జింగ్ స్పీడ్‌తో సరసమైన ధరలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ కావాలనుకునే వారిని లక్ష్యంగా మార్కెట్లోకి వచ్చింది. OnePlus 11R ధర, ఫీచర్ల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. OnePlus 11R ఫోన్ భారత మార్కెట్లో 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌కు ప్రారంభ ధర రూ. 39,999గా ఉంటుంది. 16GB + 256GB కాన్ఫిగరేషన్ ధర రూ. 44,999గా ఉండనుంది. ప్రీమియం 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్ (Amazon), వన్‌ప్లస్ స్టోర్ (OnePlus Store) ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది.

OnePlus 11R స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వన్‌ప్లస్ 11R ఫోన్ మోడల్ Qualcomm Snapdragon 8+ Gen 1 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. వాస్తవానికి, కొత్త Snapdragon 8 Gen 2 చిప్ ఫ్లాగ్‌షిప్ OnePlus 11 ద్వారా పనిచేస్తుంది. ఈ రెండు ఫోన్‌లలో ఎక్కువ లేదా తక్కువ అదే పర్ఫార్మెన్స్ పొందవచ్చు. Snapdragon 8+ Gen 1 2022లో అనేక ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను అందించింది. LPDDR5X RAM, UFS 3.1 స్టోరేజ్ వెర్షన్‌లతో సపోర్టు చేస్తుంది. సరసమైన OnePlus ఫోన్‌లో 2022 ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ ఫీచర్లు ఉండవచ్చు. కొత్త ఫీచర్లు కూడా ఉంటాయి. 2023 ఫ్లాగ్‌షిప్ OnePlus 11 డివైజ్ కూడా మార్కెట్లోకి వచ్చింది.

OnePlus 11R pre-order starts in India on February 21_ Check out price and other details

OnePlus 11R pre-order starts in India on February 21

Read Also : Apple iPhone 13 Discount : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ iPhone 13పై అదిరే డిస్కౌంట్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఇప్పుడే కొనాలా? వద్దా?

పంచ్-హోల్ డిజైన్‌తో 6.7-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డివైజ్ OnePlus 9RT మాదిరిగానే కర్వడ్ ఎడ్జ్ కలిగి ఉంది. స్క్రీన్ 2160Hz PWM డిమ్మింగ్, 1450నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్టును అందిస్తుంది. సున్నితమైన స్క్రోలింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి ప్యానెల్ 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. డిస్‌ప్లే స్పెక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. హుడ్ కింద తగినంత పెద్ద 5,000mAh బ్యాటరీ ఉంది. కంపెనీ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టును అందించింది. OnePlus ఇప్పటికీ ఫోన్‌తో పాటు రిటైల్ బాక్స్‌లో ఫాస్ట్ ఛార్జర్‌ను అందిస్తోంది.

శాంసంగ్, ఆపిల్ చాలా కాలంగా ఛార్జర్ అందించడం ఆపివేశాయి. ఛార్జర్ దాదాపు 25 నిమిషాల్లో బ్యాటరీని 0 నుంచి 100 శాతానికి నింపుతుందని OnePlus పేర్కొంది. డాల్బీ అట్మోస్‌కు సపోర్టుతో స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. ఆప్టిక్స్ పరంగా చూస్తే.. ఈ ఫోన్ వెనుక 3 కెమెరాలు ఉన్నాయి. సెటప్‌లో 50-MP సోనీ IMX890 ప్రధాన కెమెరా ఉంది. 8-MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2-MP మాక్రో సెన్సార్‌తో సపోర్టు ఇస్తుంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 16-MP కెమెరా ఉంది. సెటప్ వన్‌ప్లస్ 10Rతో సమానంగా ఉంటుంది. ఇప్పుడే ప్రైమరీ సోనీ సెన్సార్‌ను మార్చినట్లు కనిపిస్తోంది.

Read Also : Chrome Browser Fix : మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ ఛార్జింగ్ వెంటనే తగ్గిపోతుందా? గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కారణమని తెలుసా? ఇదిగో ఇలా ఫిక్స్ చేసుకోండి!