2023 Honda City Facelift : హ్యుందాయ్ వెర్నాకు పోటీగా.. కొత్త బేస్ వేరియంట్‌తో 2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది.. ధర ఎంత ఉండొచ్చుంటే?

2023 Honda City Facelift : కొత్త కారు కొంటున్నారా? అయితే కాస్తా ఆగండి.. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా కార్స్ ఇండియా నుంచి సరికొత్త మోడల్ కారు భారత మార్కెట్లోకి వచ్చేస్తోంది.

2023 Honda City facelift to get new base variant, get details about 2023 Hyundai Verna-rival

2023 Honda City Facelift : కొత్త కారు కొంటున్నారా? అయితే కాస్తా ఆగండి.. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) నుంచి సరికొత్త మోడల్ కారు భారత మార్కెట్లోకి వచ్చేస్తోంది. అదే.. 2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ మోడల్.. అయితే ఇందులో బేస్ వేరియంట్ ముందుగా రానుంది. 2023 హోండా సిటీకి 6-స్పీడ్ MT, CVT ఆటోమేటిక్ ఆప్షన్‌లతో కూడిన 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్ మాత్రమే రానుంది.

ప్రస్తుత 1.5-లీటర్ i-DTEC DOHC డీజిల్ యూనిట్ రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ అయింది. కంపెనీ ఆఫర్‌లో డీజిల్ మోటార్ ఉండదని గమనించాలి. హోండా సిటీ మోడల్.. ప్రస్తుతం V, VX, ZX అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. హోండా సిటీ పెట్రోల్‌లో ప్రతి వేరియంట్‌లో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లు ఉన్నాయి. V, VX, ZX 2023 వేరియంట్లు హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌లో ఉన్నాయి.

2023 Honda City facelift to get new base variant, get details about 2023 Hyundai Verna-rival

ఈ హోండా సిటీ కారులో కొత్త ఎంట్రీ-లెవల్ SV వేరియంట్‌ను పొందుతుంది. అయితే, SV వేరియంట్‌లో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. ఇటీవల, అప్‌డేట్స్ గురించి వివరాలను తెలియజేస్తూ కొత్త హోండా సిటీ ఫొటోలు లీక్ అయ్యాయి. కారు కొత్త ఫ్రంట్, రియర్ బంపర్‌లతో సొగసైన క్రోమ్ స్లాట్‌తో కొత్త గ్రిల్‌తో వస్తుంది. క్యాబిన్ లోపల బేస్ అప్‌డేట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అయినప్పటికీ, వైర్‌లెస్ Apple CarPlay, Android Auto ముఖ్యమైన ఫీచర్లు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.

2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ త్వరలో లాంచ్ కానున్న 2023 హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా, వోక్స్‌వ్యాగన్ వర్టస్, మారుతి సుజుకి సియాజ్‌లకు పోటీగా రానుంది. ప్రస్తుతం ఈ కారు ధర రూ. 11.87 లక్షల నుంచి రూ. 15.62 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండనుంది. ఈ కొత్త సిటీ రూ. 11 లక్షల నుంచి రూ. 16 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరల శ్రేణిలో ఉంటుందని అంచనా. కొత్త హోండా సిటీ కారు మార్చి 2 నుంచి హోండా షోరూమ్‌లలో అందుబాటులోకి రానుంది. కొత్త కార్లు ఇప్పటికే డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకున్నాయి.

Read Also : Ather Electric Scooter : అత్యంత సరసమైన ధరలో ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. ఎంతలో ఉండొచ్చు? లీకైన స్పెషిఫికేషన్లు ఇవేనా?