Tata Sierra Launch
Tata Sierra SUV Launch : టాటా లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారతీయ మార్కెట్లో టాటా మోటార్స్ సియెర్రా SUV మోడల్ రూ. 11.40 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు అధికారికంగా లాంచ్ చేసింది. ఈ 5-డోర్ల SUV కోసం బుకింగ్‌లు డిసెంబర్ 16, 2025న ప్రారంభమయ్యాయి.
జనవరి 15, 2026న డెలివరీలు ప్రారంభమవుతాయి. టాటా సియెర్రాను SUV మార్కెట్‌లో (Tata Sierra Launch) ప్రత్యేకంగా నిలిపే అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లతో అమర్చింది. ఈ మోడల్ అడ్వాన్స్ డిజైన్, అడ్వాన్స్ టెక్నాలజీని అందిస్తుంది. కొనుగోలుదారులకు అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.
టాటా సియెర్రా అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్లలో ఒకటి థియేటర్‌ప్రో ట్రిపుల్-స్క్రీన్ డాష్‌బోర్డ్ లేఅవుట్. పోటీదారు SUVలలో సాధారణంగా ఇన్ఫోటైన్‌మెంట్ ఇన్స్ట్రుమెంట్ ఫంక్షన్‌లను కలిపే డ్యూయల్ డిస్‌ప్లేలు కలిగి ఉంటాయి. సియెర్రా ఫ్రంట్ ప్రయాణీకుడి కోసం థర్డ్ స్క్రీన్ అందిస్తుంది. ఈ సెటప్‌లో 12.3-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3-అంగుళాల సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ నావిగేషన్ టచ్‌స్క్రీన్ కో-డ్రైవర్ సీటు ముందు మరో 12.3-అంగుళాల డిస్‌ప్లే ఉన్నాయి. ఈ ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్ సియెర్రా లోపల సైడ్ చాలా హైటెక్ లగ్జరీ లుక్ అందిస్తుంది.
సౌండ్ సిస్టమ్ :
టాటా సియెర్రా డాల్బీ అట్మాస్ స్పేషియల్ సౌండ్‌తో 12-స్పీకర్ JBL బ్లాక్ ఆడియో సిస్టమ్ కలిగి ఉంది. ఇందులో ఫీచర్లలో సోనిక్‌షాఫ్ట్ సౌండ్‌బార్, క్లైమేట్ కంట్రోల్స్ పైన డాష్‌బోర్డ్‌లో సౌకర్యవంతంగా మెర్జ్ అయి ఉంటుంది. ప్రీమియం హోమ్-థియేటర్ సెటప్ నుంచి ట్రెడేషనల్ డోర్ లేదా పిల్లర్-మౌంటెడ్ స్పీకర్ల కన్నా భారీ సౌండ్‌స్టేజ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
అతిపెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ :
టాటా సియెర్రా సెగ్మెంట్లో అతిపెద్ద పనోరమిక్ సన్‌రూఫ్‌ను (1525mm x 925mm) కలిగి ఉంది. దీన్నే పనోరమాక్స్ పిలుస్తారు. రెండో వరుస దాటి విస్తరించి ఉంది. ముందు సీట్ల నుంచి C-పిల్లర్ వరకు విస్తరించిన సన్‌రూఫ్ క్యాబిన్ నేచురల్ లైటింగ్‌తో నిండి ఉంటుంది. స్పేస్ ఎక్స్‌పీరియన్స్ పెంచుతుంది. అసలు సియెర్రా ఆల్పైన్ విండో డిజైన్ మాదిరిగా ఈ అడ్వాన్స్ గ్లాస్ విస్తరణ 1991 మోడల్ ఫోల్డబుల్ బ్యాక్ గ్లాస్‌తో పోలిస్తే మెరుగైన హెడ్‌రూమ్, వెదర్ సీలింగ్ మన్నికను అందిస్తుంది.
ఏఆర్ హెడ్స్ :
టాటా సియెర్రా భారత మార్కెట్లో AR హెడ్స్-అప్ డిస్‌ప్లే కలిగిన ఫస్ట్ దేశీయ ICE వెహికల్‌గా మారింది. ఈ అడ్వాన్స్ సిస్టమ్ కీలకమైన డ్రైవింగ్ డేటాను నేరుగా విండ్‌షీల్డ్‌పై ప్రొజెక్ట్ చేస్తుంది. రియల్ టైమ్‌లో ఆగ్మెంటెడ్ డైరెక్షన్ యారో డిస్‌ప్లే చేస్తుంది. సెక్యూరిటీ కోసం డ్రైవింగ్ మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సెటప్‌లో స్టాండర్డ్, ఇమ్మర్సివ్, పర్సనల్ స్నో అనే నాలుగు విభిన్న మోడ్స్ ఉన్నాయి. అలాగే ప్రతి ప్రయాణానికి ఆటోమాటిక్ అడ్జెస్ట్ చేసే 19 స్మార్ట్ విజువల్స్ ఉన్నాయి.
టాటా సియెర్రా iRA అనే కనెక్టింగ్ కార్ యాప్‌తో వస్తుంది. ఇందులో 75 స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. 5 ఇండస్ట్రీ ఫస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఈ యాప్ ద్వారా డ్రైవింగ్ మరింత ఈజీగా ఉంటుంది. iRA స్మార్ట్ అలర్ట్స్, ప్రొటెక్షన్, డ్రైవర్‌కు అవసరమైన ఫీచర్లను అందిస్తుంది. సేఫ్టీ, సెక్యూరిటీ నుంచి రోజువారీ సౌకర్యాలు, ప్రత్యేక సందర్భాల వరకు iRA వెహికల్ మీ లైఫ్ స్టయిల్‌కు ఇంటిగ్రేట్ చేస్తుంది.
R19 అల్లాయ్ :
టాటా సియెర్రా సెగ్మెంట్-ఫస్ట్ 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ కలిగి ఉంది. సెల్టోస్, క్రెటా, గ్రాండ్ విటారా వంటి పోటీదారులకు గట్టిపోటీనిస్తుంది. సస్పెన్షన్ ట్యూనింగ్ అసమాన భూభాగాలపై సౌకర్యవంతంగా డ్రైవ్ చేయొచ్చు. ముఖ్యమైన ఫీచర్లతో పాటు టాటా సియెర్రా రెండు కొత్త ఇంజిన్‌లను కూడా కలిగి ఉంది.
160PS, 255Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ హైపెరియన్ టర్బో GDi, 1.5-లీటర్ రెవోట్రాన్ నేచురల్ గ్యాసోలిన్ యూనిట్ కలిగి ఉంది. ముఖ్యంగా, సియెర్రా టాటా సరికొత్త ARGOS ఆర్కిటెక్చర్, ఆల్-టెర్రైన్ రెడీ, ఓమ్ని-ఎనర్జీ జ్యామితి స్కేలబుల్‌పై వచ్చిన మొదటి SUV కారు కూడా ఇదే.