Best Mileage Bikes : అధిక మైలేజీ అందించే 5 బెస్ట్ సూపర్ బైక్స్ మీకోసం.. ట్యాంక్ ఫుల్ చేశారంటే.. నెలంతా సిటీ మొత్తం చుట్టేయొచ్చు..!

Best Mileage Bikes : కొత్త బైక్ కొంటున్నారా? అధిక మైలేజీ అందించే 5 బెస్ట్ సూపర్ బైకులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకసారి బైక్ ట్యాంకు ఫుల్ చేశారంటే చాలు.. మంచి మైలేజీతో నెల వరకు సిటీ మొత్తం చుట్టేయొచ్చు.

Best Mileage Bikes

Best Mileage Bikes : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, కాస్తా ఆగండి.. ప్రస్తుతం మార్కెట్లో అద్భుతమైన ఫీచర్లతో సూపర్ బైకులు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లోకి ఏదైనా కొత్త బైక్ వచ్చిందంటే.. అందరూ మైలేజీ ఎంత ఇస్తుందనే ఎక్కువగా చూస్తుంటారు. ఆ తర్వాత కలర్, డిజైన్ వంటి ఫీచర్లను చూస్తారు. ఆపై ధర తక్కువ ఉంటే వెంటనే ఆ బైకులను కొనేస్తుంటారు.

Read Also : Airtel IPL Offer : ఐపీఎల్ ఫ్యాన్స్‌కు పండగే.. ఎయిర్‌టెల్ సూపర్ IPL ఆఫర్లు.. కేవలం రూ. 100కే జియో హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌..!

మీరు కూడా తక్కువ ధరలో మంచి ఫీచర్లు కలిగిన బైకులను కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అధిక మైలేజీని అందించే సూపర్ బైకుల్లో రూ. 70వేల ధర నుంచి రూ. 80వేల ధరలో అందుబాటులో ఉన్నాయి. మిడిల్ క్లాసు వినియోగదారులు కూడా ఈ సూపర్ బైకులను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

టూవీలర్ మార్కెట్లో టీవీఎస్, హీరో, హోండా, బజాజ్ వంటి తయారీదారులు అధిక మైలేజీతో పాటు ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగిన సూపర్ బైకులను తక్కువ ధరలకే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో టాప్ 5 అధిక మైలేజీ అందించే బెస్ట్ బైకులను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన బైకును ఎంచుకుని కొనేసుకోండి.

టీవీఎస్ రేడియన్ :
ఈ కొత్త టీవీఎస్ రేడియన్ (TVS Radeon) బైక్ ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా బేస్ ఎడిషన్, DG డ్రమ్, DG డిస్క్ అనే 3 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రత్యేకించి బేస్ ఎడిషన్ మోడల్ ధర రూ. 59,880కు లభ్యమవుతుంది.

DG డ్రమ్ వేరియంట్ బైక్ ధర రూ. 77,394 ఉండగా, DG డిస్క్ మోడల్ ధర రూ. 81,394 (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది. TVS రేడియన్ బైక్‌ 109.7cc సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి ఉంది. 10 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. అలాగే, లీటరుకు 73కిలోమీటర్ల మైలేజీని కూడా అందిస్తుంది.

టీవీఎస్ స్పోర్ట్ :
ఈ TVS స్పోర్ట్ బైక్ మొత్తం 2 వేరియంట్లలో అందుబాటులో ఉంది. సెల్ఫ్ స్టార్ట్ ELS, సెల్ఫ్ స్టార్ట్ ES మోడల్ వరుసగా ధర రూ. 59,881, రూ. 71,223 (ఎక్స్-షోరూమ్)కు లభ్యమవుతున్నాయి. అంతేకాదు.. ఈ టీవీఎస్ స్పోర్ట్ బైక్ 3 డ్యూయల్ టోన్ కలర్స్‌తో వస్తుంది. BS6 కంప్లైంట్ 109.7cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ కూడా ఉంది. 10-లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీతో పాటు లీటరుకు 70కిలోమీటర్ల మైలేజీని కూడా అందిస్తుంది.

హీరో స్ప్లెండర్ ప్లస్ :
కొత్త హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ భారత మార్కెట్లో రూ. 77,176 ప్రారంభ ధర నుంచి రూ.79,926వరకు అందుబాటులో ఉంది. హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ మొత్తం 4 వేరియంట్లలో లభ్యమవుతుంది. అంతేకాదు.. 97.2cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఓహెచ్సీ ఇంజిన్‌‌తో వస్తుంది. 9.8 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. ఈ హీరో బైక్ లీటరుకు 70కిలోమీటర్ల మైలేజీని కూడా అందిస్తుంది.

హోండా CD 110 డ్రీమ్ :
ఈ హోండా బైక్ సింగిల్ వేరియంట్‌ మాత్రమే. మొత్తం 4 కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. 109.51cc BS-6 ఇంజిన్ కలిగి ఉంది. 9.1 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో పాటు లీటరుకు 65కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ హోండా బైక్ ధర రూ. 76,401 (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది.

Read Also : Best AC Prices : అసలే సమ్మర్.. కొత్త ఏసీ కొంటున్నారా? రూ. 30వేల లోపు ధరలో టాప్ 3 బెస్ట్ ఏసీలు ఇవే.. ఓసారి లుక్కేయండి..!

బజాజ్ CT 110X :
ఈ బజాజ్ బైక్ సింగిల్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ బజాజ్ 110X బైక్ ధర రూ. 69,216 (ఎక్స్-షోరూమ్)కు లభ్యమవుతుంది. అలాగే, మార్కెట్లో ప్రస్తుతం 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అంతేకాదు.. ఎలక్ట్రానిక్ కార్బ్యురేటర్‌తో 115.45cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌‌తో వస్తుంది. 11-లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీతో పాటు లీటరుకు 70కిలోమీటర్ల మైలేజీని కూడా అందిస్తుంది.