Telugu » Business » 5 Important Factors To Consider Before Buying Ac For Your Home Sh
Buying AC Home : కొత్త AC కొంటున్నారా? మీ ఇంటికి ఏసీని తెచ్చే ముందు ఈ 5 ముఖ్యమైన విషయాలను తప్పక తెలుసుకోండి!
Buying AC Home : మీ ఇంట్లో ఏసీ కోసం చూస్తున్నారా? వేసవిలో ఇంటిని చల్లగా ఉంచేందుకు తప్పనిసరిగా మంచి ఏసీ ఉండాల్సిందే. అయితే, ఏసీని కొనే ముందు 5 విషయాల పట్ల తప్పక అవగాహన కలిగి ఉండాలి.
Buying AC Home : వేసవి కాలం వచ్చేసింది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండల తీవ్రతతో చాలామంది ఇంట్లో ఏసీలు, కూలర్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మీరు ఒకవేళ కొత్త ఏసీ కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే. ఇంట్లో ఎయిర్ కండిషనర్ (AC) వాడే ముందు కొన్ని విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి.
నేటి కాలంలో ఇళ్లలో ఏసీలు చాలా అత్యవసరంగా మారాయి. అలాగే, మీరు కూడా కొత్త ఏసీ కొనేందుకు చూస్తున్నారా? బెస్ట్ కూలింగ్, పవర్ కెపాసిటీతో పాటు మీ బడ్జెట్‌కు తగిన ఏసీలను కొనే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకోవాలి.
వేసవిలో ఏసీని కొనేముందు మీ గది పరిమాణం, బడ్జెట్ ఎంత అనేది ఎంచుకోవాలి. వివిధ బ్రాండ్‌లతో ఏసీలను కంపేర్ చేయండి. రివ్యూలను చెక్ చేయండి. బడ్జెట్, కూలింగ్ ఆప్షన్లను ఎంచుకోండి. ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ 5 ముఖ్యమైన అంశాలను తప్పక తెలుసుకోండి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
1. సరైన ఏసీ రకాన్ని ఎంచుకోండి :
ప్రస్తుతం మార్కెట్లో 3 ప్రధాన రకాల ఏసీలు అందుబాటులో ఉన్నాయి.
చిన్న గదులకు అనువైనవి, బడ్జెట్ ఫ్రెండ్లీ విండో ఏసీలు
స్పీడ్ కూలింగ్ అందించే స్ప్లిట్ ఏసీ సైలంట్‌గా పనిచేస్తుంది. పెద్ద గదులకు సరైనది.
ప్రస్తుత కాలంలో పోర్టబుల్ ఏసీలు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు.
మీ ఏసీ ఎంపిక అనేది గది సైజు, మీ బడ్జెట్‌పై ఆధారపడి ఉంటుంది.
2. పవర్ కెపాసిటీ రేటింగ్ (BEE స్టార్ రేటింగ్) చెక్ చేయండి :
వేసవిలో విద్యుత్ బిల్లులు భారీగా పెరుగుతాయి. సమర్థవంతమైన ఏసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం.
ఏసీలు BEE (బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ) స్టార్ రేటింగ్‌లతో వస్తాయి.
5-స్టార్ ఏసీ తక్కువ శక్తిని వినియోగిస్తుంది. కానీ, ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.
3-స్టార్ ఏసీ చౌకైనది కానీ కాలక్రమేణా విద్యుత్ బిల్లులు భారీగా పెరగొచ్చు.
మీరు ప్రతిరోజూ ఎక్కువ గంటలు ఏసీని వాడాలని చూస్తే 5-స్టార్ ఏసీని కొనుగోలు చేయడమే బెస్ట్.
భవిష్యత్తులో విద్యుత్ బిల్లులు తగ్గి డబ్బు ఆదా అవుతుంది.
3. కూలింగ్ కెపాసిటీ, రూమ్ సైజు చాలా ముఖ్యం :
ఏసీ కూలింగ్ కెపాసిటీని టన్నులలో కొలుస్తారు. సరైన ఏసీని ఎంచుకోవడం ముఖ్యం
120 చదరపు అడుగుల వరకు ఉన్న గదులకు 1 టన్ ఏసీ బెస్ట్
180 చదరపు అడుగుల గదులకు 1.5 టన్ను ఏసీ బెస్ట్
200 చదరపు అడుగుల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో పెద్ద రూంలకు 2 టన్నుల ఏసీ బెస్ట్
పెద్ద గదిలో చిన్న ఏసీ కూలింగ్ కాదు. చిన్న గదిలో పెద్ద ఏసీ ఎక్కువ విద్యుత్తును వాడేస్తుంది.
4. ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ : ఏది బెటర్? :
ఇన్వర్టర్ AC : గది ఉష్ణోగ్రత ఆధారంగా విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది. కూలింగ్, తక్కువగా విద్యుత్ బిల్లు వస్తుంది.
నాన్-ఇన్వర్టర్ AC : స్థిర వేగంతో రన్ అవుతుంది. ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది.
ఇన్వర్టర్ ఏసీలు ఎక్కువ ఖరీదు ఉన్నా ఎక్కువకాలం పనిచేస్తాయి. అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తాయి.