AC Safety Tips : వేసవిలో ఏసీలు పేలుతున్నాయి.. తస్మాత్ జాగ్రత్త.. మీ ఏసీని వాడే ముందు ఈ మిస్టేక్స్ అసలు చేయొద్దు.. సేఫ్టీ టిప్స్ మీకోసం..!
AC Safety Tips : ఏసీలు వాడుతున్నారా? పాత లేదా కొత్త ఎయిర్ కండిషనర్లు వాడే ముందు తస్మాత్ జాగ్రత్త. ఏసీల నిర్వహణ పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి. తద్వారా పేలుడు వంటి ఘటనలను నివారించవచ్చు. ముందుగా ఈ జాగ్రత్తలను పాటించండి.

AC Safety Tips
AC Safety Tips : సమ్మర్ వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఇళ్లలో ఏసీలు, కూలర్లు లేకుండా ఉండటం కష్టమే. అందుకే చాలామంది కొత్త ఏసీలు కొనేందుకు షాపులకు పరుగులు పెడుతుంటారు. మరికొంతమంది పాత ఏసీలను మళ్లీ వాడేస్తుంటారు.
కొత్త ఏసీలు మళ్లీ కొంటాంలేని పాత ఏసీలను మళ్లీ ఆన్ చేస్తుంటారు. ఇలా నెలల తరబడి పనిచేయని ఎయిర్ కండిషనర్లు (AC) దాదాపు ప్రతి ఇంట్లోనూ ఆన్ చేస్తుంటారు. ఇలా పాత ఏసీలను ఆన్ చేసే ముందు తస్మాత్ జాగ్రత్త.. ఎందుకంటే.. వేసవిలో పాత ఏసీలు పేలే ప్రమాదం ఉంది.
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏసీ పేలుడు సంఘటన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. దేశ రాజధానిలోని కృష్ణ నగర్ ప్రాంతంలో ఏసీ రిపేరింగ్ షాపులో పాత ఏసీ ఆన్ చేసిన వెంటనే పేలిపోయింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఏసీలు పేలుడు కారణం.. సరైన నిర్వహణ లేకపోవడం, విద్యుత్ లోపాలు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు మీ ఏసీని ఆన్ చేసే ముందు ఏసీ బ్లాస్ట్‌లు ఎందుకు జరుగుతాయో తెలుసుకోవాలి? ఆ తర్వాత నివారణ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఢిల్లీలో ఏసీ పేలుడు.. ఏం జరిగిందంటే? :
ఢిల్లీలోని కృష్ణ నగర్‌లోని ఏసీ రిపేరింగ్ షాపులో ఏసీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో మోహన్ లాల్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇదంతా అక్కడి సీసీటీవీలో రికార్డు అయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో వేసవిలో చాలా ఏసీ పేలుళ్లు సంభవించాయి. అసలు ఏసీ పేలుళ్లు ఎందుకు జరుగుతాయి. అసలు కారణాలు? నివారణ చర్యలేంటి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఏసీ పేలుళ్లు ఎందుకు జరుగుతాయి? సాధారణ కారణాలివే :
కంప్రెసర్ వేడెక్కడం :
- ఏదైనా ఏసీ (స్ప్లిట్ లేదా విండో)కి కంప్రెసర్ గుండె లాంటిందని గమనించాలి.
- సరైన మెయింట్‌నెన్స్ లేకపోతే కంప్రెసర్ వేడెక్కుతుంది. తద్వారా పేలుడు సంభవించవచ్చు.
షార్ట్ సర్క్యూట్లు :
- విద్యుత్ లోపాలు, దెబ్బతిన్న వైరింగ్ కూడా పేలుడుకు కారణమవుతాయి.
- మీ ఏసీ వాడే ముందు విద్యుత్ ప్రసారమయ్యే వైర్లు, ఇతర పార్టులను చెక్ చేయండి.
అధిక వోల్టేజ్, పవర్ హెచ్చుతగ్గులు :
- వోల్టేజ్ స్పైక్‌ల కారణంగా ఏసీలోని ఇంటర్నల్ పార్ట్స్ దెబ్బతింటాయి.
- పేలుడు ప్రమాదాలను నివారించేందుకు ఎల్లప్పుడూ వోల్టేజ్ స్టెబిలైజర్‌ను వాడండి.
కంప్రెసర్‌లో గ్యాస్ లీకేజీ :
- రిఫ్రిజెరాంట్ గ్యాస్ లీక్ అయి పేరుకుపోతే పేలుడుకు దారితీస్తుంది.
- ఏసీ వాడే ముందు గ్యాస్ లెవల్స్ ప్రొఫెషనల్ మెకానిక్‌తో చెక్ చేయించుకోండి.
ఎయిర్ ఫిల్టర్లు మూసుకుపోవడం :
- దుమ్ము పేరుకుపోవడం వల్ల కంప్రెసర్‌పై తీవ్ర ఒత్తిడి పడుతుంది.
- రెగ్యులర్ ఏసీ సర్వీసింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలి.
- ఏసీలోని యూనిట్ అప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా రన్ అవుతుంది.
వేసవిలో ఏసీ వాడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే :
- గత ఏడాది వాడిన ఏసీని ఈ ఏడాదిలో ఆన్ చేసే ముందు ప్రొఫెషనల్ సర్వీస్ చెక్ చేయించుకోండి.
- ఏసీలో యూనిట్ వేడెక్కకుండా ఉండేందుు చుట్టూ సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి.
- ఏసీని వాడే ముందు గ్యాస్ లీక్ చెక్ చేయండి
- ఏసీలో ఇతర కూలింగ్ సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదో చెక్ చేసి ఫిక్స్ చేయండి.
- పవర్ కొన్నిసార్లు హైఓల్టేజ్ వచ్చిపోతుంటుంది. ఏసీ పేలకుండా వోల్టేజ్ స్టెబిలైజర్‌ను ఉపయోగించండి.
- గాలి సరిగా లోపలికి వచ్చేలా ఏసీలోని ఎయిర్ ఫిల్టర్‌లను రెగ్యులర్‌గా క్లీన్ చేయండి.