రెపో రేటు తగ్గింది : 5 రోజుల్లో 5 లక్షల కోట్ల సంపద ఆవిరి

  • Publish Date - October 4, 2019 / 01:14 PM IST

స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. అక్టోబర్ 04వ తేదీ శుక్రవారం సెన్సెక్స్ భారీగా పతనమైంది. రిజర్వ్ బ్యాంకు రెపో రేటు ప్రకటించిన అనంతరం మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తాయని అనుకున్నారు. 434 పాయింట్లు నష్టపోయి 37 వేల 673 వద్ద క్లోజ్ అయ్యింది సెన్సెక్స్.

గత ఐదు రోజుల నుంచి నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 1.23 శాతంతో 139.25 పాయింట్లతో 11 వేల 174.75 వద్ద నష్టంతో క్లోజ్ అయ్యింది. దీంతో 5 రోజుల వ్యవధిలో పెట్టుబడు దారుల రూ. 5 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. శుక్రవారం ప్రారంభంలోనే మార్కెట్ బాగానే కొనసాగినా..ఆర్బీఐ పాలసీ ప్రకటించిన అనంతరం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయని మార్కెట్ నిపుణులు వెల్లడించారు.

25 బేసిస్ పాయింట్లపై రెపో రేటును తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. 5.40 శాతం ఉన్న రెపో రేటును 5.15 శాతానికి తగ్గించింది. జూన్ 08 నుంచి 12 వరకు 5 మార్కెట్ సెషన్లలో దాదాపు రూ. 3.27 లక్షల కోట్ల ముదుపర్ల సంపద ఆవిరైన సంగతి తెలిసిందే.