How to check if your phone supports 5G network?
5G Launch In India : భారత మార్కెట్లో 5G నెట్‌వర్క్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే దేశీయ మూడు టెలికం దిగ్గజాలు Reliance Jio, Airtel, Vi త్వరలో తమ 5G సేవలను ప్రారంభించేందుకు రెడీగా ఉన్నాయి. జియో, ఎయిర్‌టెల్ తమ 5G సేవలను ఆగస్టు చివరిలో లాంచ్ చేస్తాయని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఏడాది చివరిలో దేశంలో 5G నెట్ వర్క్ అందుబాటులోకి రావోచ్చునని సూచిస్తున్నాయి. 5G నెట్‌వర్క్ ఊహించిన దానికంటే త్వరగా వస్తోందని, 4G సేవలతో పోలిస్తే.. 5G స్పీడ్ 10X ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే ఒక ప్రకటనలో వెల్లడించారు.
భారతదేశంలో 5G ఎప్పుడైనా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మీ స్మార్ట్ ఫోన్లో హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందాలంటే తప్పనిసరిగా 5G-సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ అయి ఉండాలి. మీ ఫోన్ 5G నెట్‌వర్క్‌కు సపోర్టు ఇస్తుందో లేదో ఇలా చెక్ చేయవచ్చు. మీ ఫోన్ 5G నెట్‌వర్క్‌కు సపోర్టు చేయకపోతే.. మీరు 10X స్పీడ్ పొందాలంటే తప్పనిసరిగా కొత్త 5G సపోర్టెడ్ ఫోన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
How to check if your phone supports 5G network
మీ ఫోన్ 5G నెట్‌వర్క్‌ని సపోర్ట్ చేస్తుందో లేదో చెక్ చేయడం ఎలా? :
– మీ Android ఫోన్‌లో, Settings యాప్ ఓపెన్ చేయండి.
– ‘Wi-Fi & Network’ ఆప్షన్‌పై Click చేయండి
– ఇప్పుడు ‘SIM & Network’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
– మీరు ‘Preferred Network Type’ ఆప్షన్ కింద అన్ని టెక్నికల్ లిస్టును మీరు చూడొచ్చు.
మీ ఫోన్ 5G నెట్‌వర్క్‌కు సపోర్టు ఇవ్వకుంటే.. మీరు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందాలంటే 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాల్సిందే. Realme, Xiaomi వంటి అనేక స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఇప్పటికే సరసమైన ధరల్లో 5G స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి. వాస్తవానికి, ఓ నివేదిక ప్రకారం, భవిష్యత్తులో రూ. 10,000 లోపు 5G ఫోన్‌లు ఉంటాయని Qualcomm తెలిపింది.
ఇప్పుడు, మీరు 5G ఫోన్ కొనే ముందు మీరు వాడే SIM నెట్‌వర్క్ 5Gకి సపోర్టు చేస్తుందో లేదో నిర్ధారించుకోండి. ఉదాహరణకు, మీరు Vi నెట్‌వర్క్‌లో ఉన్నట్లయితే.. Vi అధికారికంగా భారత్‌లో 5G సేవలను ప్రారంభించిన తర్వాత మాత్రమే 5G ఫోన్‌ను తీసుకోవడం మంచిది. లేదంటే 5G సర్వీసులను పొందలేరని గుర్తించుకోండి.
Read Also : Jio Phone 5G : రిలయన్స్ జియో ఫోన్ 5G వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?