Best 5G Phones 2025
Best 5G Phones 2025 : కొత్త 5జీ ఫోన్ కావాలా? 2025లో 5G స్మార్ట్‌ఫోన్‌కి అప్‌గ్రేడ్ ప్లాన్ చేస్తున్నారా? మీ బడ్జెట్ ధరలో ఏదైనా ఫోన్ కొనాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌లు బాగా సేల్ అవుతున్నాయి. పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు.. కిర్రాక్ ఫీచర్లతో కెమెరాలు, అడ్వాన్స్ ఫీచర్లను కలిగి ఉన్నాయి.
రోజువారీ వినియోగం, గేమింగ్ కంటెంట్ వినియోగానికి అద్భుతమైన ఫోన్లుగా చెప్పొచ్చు. ఈ 6 5G స్మార్ట్‌ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి. మీరు బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ కోసం చూస్తుంటే ఇందులో ఏదో ఒక ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
వివో V60e (రూ. 29,999) :
వివో V60e ఫోన్ 200MP+8MP కెమెరా 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 1B కలర్లతో 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 7360 టర్బో చిప్‌సెట్ ద్వారా ఈ యూనిట్ 6500mAh బ్యాటరీని కలిగి ఉంది.
రియల్‌మి 15 ప్రో (రూ. 31,999) :
రియల్‌మి 15 ప్రో 1B కలర్స్‌తో 6.8-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. డ్యూయల్ 50MP కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 (4nm) చిప్‌సెట్ ద్వారా ఆధారితమైన ఈ యూనిట్ రియల్‌మి యూఐ 6.0పై రన్ అవుతుంది. ఇంకా, 7000mAh 80W బ్యాటరీని అందిస్తుంది.
రియల్‌మి జీటీ 7T (రూ. 29,699) :
ఈ రియల్‌మి ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 8400 మ్యాక్‌తో రన్ అయ్యే ఈ యూనిట్ రియల్‌మి యూఐ 6.0పై రన్ అవుతుంది. 1B కలర్ ఆప్షన్లలో 6.8-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. కెమెరా విషయానికొస్తే.. 50MP వైడ్ సెన్సార్ 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో పాటు 32MP వైడ్ సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.
ఐక్యూ నియో 10R ఫోన్ 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. 1B కలర్ ఆప్షన్లు, 144Hz రిఫ్రెష్ రేట్‌ను 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైన ఈ స్మార్ట్‌ఫోన్ 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6400mAh బ్యాటరీని కలిగి ఉంది.
నథింగ్ ఫోన్ 3a ప్రో (రూ. 28,999) :
నథింగ్ ఫోన్ 3a ప్రో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 1B కలర్ ఆప్షన్లలో 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. ఇంకా, 50MP + 50MP + 8MP రియర్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో (రూ. 29,529) :
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోలో ట్రిపుల్ కెమెరాలు (50MP + 10MP + 50MP, 50MP) సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్‌తో రన్ అయ్యే ఈ యూనిట్ 90W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. 1B కలర్ ఆప్షన్లు, 120Hz రిఫ్రెష్ రేట్ 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందించే 6.7 అంగుళాల P-OLEDని కలిగి ఉంది.