8th Pay Commission: జీతాలు భారీగా పెరగనున్నాయ్.. విశ్లేషకులు ఏమంటున్నారంటే?

కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఎక్విటీస్ జూలై 21 నివేదికలో ఫిట్‌మెంట్ ఫాక్టర్‌ను 1.8గా భావించి, 13% వేతన పెరుగుదలగా అంచనా వేసింది.

8th Pay Commission

దేశంలోని కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 2025 జనవరిలో ప్రకటించిన 7వ వేతన కమిషన్ అమలు కోసం ఎదురుచూస్తున్నారు. కమిషన్ అధికారికంగా ఏర్పాటుకానప్పటికీ, బ్రోకరేజ్ సంస్థలు వేతనాలపై భారీ ప్రభావం ఉంటుందని అంచనా వేశాయి.

అంబిట్ క్యాపిటల్, కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఎక్విటీస్ జూలైలో విడుదల చేసిన రెండు నివేదికలు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంచనాలు, వాటి ప్రభావాన్ని వివరించాయి.

అంబిట్ క్యాపిటల్ జూలై 9 నివేదికలో 1.83 నుంచి 2.46 మధ్య ఫిట్‌మెంట్ ఫాక్టర్ శ్రేణిని అంచనా వేసింది. 1.82 బేస్ కేసులో వేతనాలు 14% పెరుగుతాయని, 2.15 మిడియాన్ కేసులో 34% పెరుగుతాయని, 2.46 అప్పర్ ఎండ్‌ కేసులో 54% పెరుగుతాయని తెలిపింది.

Also Read: తెల్ల టీషర్టులతో నిరసన.. ప్రియాంకా గాంధీ, ఇతరుల టీ షర్టులపై రాసిన మింటా దేవి ఎవరు? ఆ ఫొటో ఎందుకు వేశారు?

కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఎక్విటీస్ జూలై 21 నివేదికలో ఫిట్‌మెంట్ ఫాక్టర్‌ను 1.8గా భావించి, 13% వేతన పెరుగుదలగా అంచనా వేసింది.

8వ వేతన కమిషన్ అంచనాల ప్రకారం, ప్రస్తుతం రూ.97,160 (భత్యాలతో కలిపి) పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఫిట్‌మెంట్ ఫాక్టర్ ఆధారంగా ఈ కింది విధంగా వేతన పెరుగుదల పొందవచ్చు.

  • 1.82 (అంబిట్ బేస్ కేస్): రూ.1,15,297 – 14% పెరుగుదల
  • 2.15 (అంబిట్ మిడియాన్ కేస్): రూ.1,36,203 – 34% పెరుగుదల
  • 2.46 (అంబిట్ అప్పర్ కేస్): రూ.1,51,166 – 54% పెరుగుదల
  • 1.8 (కోటక్ అంచనా): సుమారు రూ.1,09,785 – 13% పెరుగుదల

ఈ అంచనాలు కొత్త వేతన కమిషన్ అమలు సమయంలో ప్రస్తుత డీఏను జీరోకి రీసెట్ చేస్తారని పరిగణనలోకి తీసుకున్నాయి.  ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రస్తుత బేసిక్‌ పేకి వర్తించినా, డీఏ రీసెట్ కారణంగా వాస్తవ పెరుగుదల తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, 2016లో 7వ వేతన కమిషన్ 2.57 ఫాక్టర్ సిఫారసు చేసి, కనీస బేసిక్‌ పేను రూ.7,000 నుంచి రూ.18,000కు పెంచింది. కానీ, డీఏ రీసెట్ చేసిన తరువాత, వాస్తవ పెరుగుదల 14.3% మాత్రమే వచ్చింది.