Gold: ఊహించని విధంగా ఎదురయ్యే ఈ 9 దుస్థితుల నుంచి.. ‘బంగారం’తో ఇలా బయటపడండి..

బంగారంపై లోన్ తీసుకునే ప్రక్రియ ఆరు దశలుగా ఉంటుంది..

Gold

Crucial situations Outlook: బంగారు భవిష్యత్తు కోసం ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం. ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే అవి మళ్లీ తిరగబడకుండా చూసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. భవిష్యత్తులో ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చాలా మంది పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నారు. చాలా మంది బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతారు.

ఆదాయం తగ్గినప్పుడు, ఉన్నట్టుండి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు బంగారం మనల్ని ఆదుకుంటుంది. బంగారం కొంటే భవిష్యత్తులో అదే మనల్ని ఆర్థిక దుస్థితుల నుంచి బయటపడేస్తుంది. ఆ బంగారాన్ని అనేక రకాలుగా వాడుకోవచ్చు. అందులో గోల్డ్ లోన్ తీసుకోవడం ఒకటి. తొమ్మిది రకాల ప్రతికూల పరిస్థితుల నుంచి గోల్డ్ లోన్ ఆదుకుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మనం ఆభరణాల రూపంలో కొనుక్కునే బంగారం మనల్ని ఆర్థిక దుస్థితి నుంచి కాపాడే సంపదగా మారుతుందని చెబుతున్నారు.

బంగారంపై లోన్ ప్రక్రియ ఆరు దశలుగా ఉంటుంది

  • గోల్డ్ లోన్ అప్లికేషన్ తీసుకోవాలి
  • గోల్డ్ లోన్ ఇచ్చే బ్యాంకుల్లో బంగారాన్ని ఇవ్వాలి
  • దాన్ని లెక్కగడతారు
  • డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తి చేయించుకోవాలి
  • నిజమైన బంగారమని నిర్ధారించుకుని లోన్ ఇస్తారు
  • తీసుకున్న లోన్‌ను తిరిగి చెల్లించాలి

ఈ 9 పరిస్థితుల్లో గోల్డ్ లోన్ బాగా ఉపయోగపడుతుంది

  • అత్యవసర వైద్య ఖర్చులకు
  • మీ వ్యాపారాన్ని విస్తరించడానికి
  • విద్య సంబంధిత ఖర్చుల కోసం
  • పెళ్లి సమయంలో..
  • ఇంటి పునర్నిర్మాణ ఖర్చుల కోసం
  • ఆస్తులు కొనే సమయంలో
  • ఆదాయం తగ్గి ఆర్థికంగా బాధ్యతలు నెరవేర్చలేని సమయంలో
  • చాలా కాలంగా వెళ్లాలనుకుంటున్న ప్రదేశాలకు వెళ్లాల్సిన సమయం దొరికినప్పుడు..
  • ఊహించని విధంగా ఖర్చులు పెరిగినప్పుడు..

Gold and silver Price: దీపావళికి ముందు బిగ్‌షాక్‌.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..