Paw Fect Farewell : ప్రాణ స్నేహితుడు రతన్ టాటాకు పెంపుడు కుక్క గోవా అంతిమ నివాళులు.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Paw Fect Farewell to Ratan Tata : రతన్ టాటాకు ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్కలలో గోవా కుక్క ఒకటి. గోవాలో జరిగిన ఒక సంఘటనతో ఆ కుక్క రతన్ టాటాకు బాగా దగ్గరైంది.

A Pet Dog Goa emotional Farewell to Ratan Tata ( Image Source : Google )

Paw Fect Farewell to Ratan Tata : ప్రముఖ టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా ఇక లేరు.. ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోవడం కష్టమే. ముఖ్యంగా ఆయనెంతో ఇష్టపడే పెంపుడు కుక్కలకు తీరని లోటు. రతన్ టాటా ఉన్నంతకాలం ముంబైలోని వీధికుక్కల సంరక్షణ కోసం ఎంతో కృషిచేశారు. అలాంటి అత్యున్నత ప్రాణస్నేహితుడైన రతన్ టాటాను పెంపుడు కుక్కలు కోల్పోవడం ఎంతో విచారకరం. ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో రతన్ టాటా తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

86 ఏళ్ల టాటా గ్రూప్‌ అతిపెద్ద అధినేతగా ఎదిగిన టాటాకు వీధికుక్కలంటే ఎంతో ఇష్టపడేవారు. ప్రత్యేకించి కుక్కల కోసం కోట్ల విలువైన పెద్ద భవనాన్ని నిర్మించారు. వాటికి వీఐపీ హోదా కూడా కల్పించారు. ఆ పెంపుడు కుక్కల్లో ఒకటైన కుక్క గోవా అంటే.. రతన్ టాటాకు ఎంతో ఇష్టం. ఇప్పుడు కుక్క గోవా తన బాస్‌కు అంతిమ నివాళులర్పించింది. రతన్ టాటా అంత్యక్రియల్లో పాల్గొన్న ఈ కుక్కు గోవా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కడసారిగా తన ప్రాణ స్నేహితుడిని చూసుకుని కుక్కు మౌనంగా ఉండిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also : Ratan Tata Successor : రతన్ టాటా వారసుడు ఇతడేనా? ఎవరీ నోయల్ టాటా..? ముందున్న అతిపెద్ద సవాళ్లు ఏంటి?

ఆ కుక్కకు గోవా పేరు ఎలా వచ్చిందంటే? :
రతన్ టాటాకు ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్కలలో గోవా కుక్క ఒకటి. గోవాలో జరిగిన ఒక సంఘటనతో ఆ కుక్క రతన్ టాటాకు బాగా దగ్గరైంది. వీధుల్లో తిరిగే ఆ కుక్కను టాటా అన్నం పెట్టారు. అప్పటినుంచి రతన్ టాటా వెంటే రావడం చేసింది. దాంతో ఆ కుక్కను రతన్ టాటా దత్తత తీసుకున్నారు. అలా పెంచుకునే క్రమంలో గోవాలో కలిసిందని గోవా కుక్క అని పేరు పెట్టారట. రతన్ టాటా పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ముంబైలోని ఎన్సీపీఏలో ఉంచారు. టాటాకు ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్క గోవా ఆయనకు నివాళులర్పించింది. జాతీయ జెండాతో కప్పిన ఆయన భౌతిక కాయాన్ని గుర్తించి అలానే మౌనంగా చూస్తూ ఉండిపోయింది.

బాంబే హౌస్ వీధికుక్కలకు పుట్టినిల్లు :
ముంబైలోని వర్లీ ప్రాంతానికి టాటా భౌతికకాయాన్ని తీసుకెళ్లే క్రమంలో పెంపుడు కుక్కలను కూడా కాన్వాయ్‌లో తీసుకెళ్లారు. అంటే.. ఆ పెంపుడు కుక్కలు రతన్ టాటా జీవితంలో అంతగా ముఖ్యమైన పాత్ర పోషించాయో అర్థమవుతుంది. అంతేకాకుండా, దక్షిణ ముంబైలోని టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయం, బాంబే హౌస్ ఆ ప్రాంతంలోని వీధికుక్కలకు పుట్టినిల్లు.. ఇందులోకి వచ్చివెళ్లే సందర్శకులను తనిఖీలు చేయకుండా అనుమతించారు. సిబ్బందికి భద్రతా బ్యాడ్జ్‌లు లేకుండా లోపలికి ప్రవేశం ఉండదంటే రతన్ టాటా ఎంత భద్రతను కల్పించారో తెలుస్తోంది.

వీధి కుక్కలకు వీఐపీ హోదా :
తాజ్, బాంబే హౌస్ వద్ద భారీ సంఖ్యలో కుక్కలు దర్శనమిస్తుంటాయి. ఈ కుక్కలను దత్తత తీసుకున్న రతన్ టాటా వీఐపీ హోదా కల్పించారు. ముంబైలోని తాజ్ మహల్ హోటల్ దేశంలోనే అత్యంత విలాసవంతమైన హోటళ్లలో ఒకటి. టాటాల ఆధ్వర్యంలో నడిచే ఈ హోటల్ వీధి కుక్కల కోసం కేటాయించారు. రతన్ టాటా ఆ ప్రాంగణంలోని వెళ్తే.. కుక్కలను బాగా చూసుకోవాలని సిబ్బందికి అనేక సూచనలు చేసేవారు. టాటాకు కుక్కల పట్ల ఉన్న ప్రేమ కేవలం తాజ్‌కే పరిమితం కాలేదు. కంపెనీ ప్రధాన కార్యాలయమైన బాంబే హౌస్‌లో కుక్కలకు భవనంలోకి ఉచిత ప్రవేశం కల్పించారు.

పెంపుడు జంతువుల ఆస్పత్రికి రూ. 165 కోట్లతో నిధులు :
రతన్ టాటాకు కుక్కల పట్ల ఉన్న ప్రేమకు అతిపెద్ద సాక్ష్యాలలో ఇదొకటి. ముంబైలో ఆయన ఈ ఏడాదిలో ఏర్పాటు చేసిన స్మాల్ యానిమల్ హాస్పిటల్ ఇది. రూ. 165 కోట్ల నిధులతో ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో 98వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఆసుపత్రిని స్థాపించారు. ఈ ఆస్పత్రి 24×7 అత్యవసర సేవలను అందిస్తుంది.

పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకించి సీటీ స్కాన్‌లు, ఎంఆర్ఐ, ఎక్స్-రే, అల్ట్రాసౌండ్‌తో సహా అధునాతన డయాగ్నొస్టిక్ ఇమేజింగ్ సర్వీసులు అందుబాటులో ఉంచారు. శస్త్రచికిత్స యూనిట్లు, ప్రత్యేక చికిత్స (డెర్మటాలజీ, డెంటల్, ఆప్తాల్మాలజీ, మొదలైనవి)తో పాటు ఇంటర్నల్ పాథాలజీ ల్యాబ్, కుక్కలు, పిల్లుల కోసం ప్రత్యేక వెయింటింగ్ రూమ్స్, ఇన్‌పేషెంట్ వార్డులు వంటివి మరెన్నో సౌకర్యాలను కల్పించారు రతన్ టాటా.

Read Also : Ratan Tata Funeral : ఇండస్ట్రీ లెజెండ్‌కు భారత్ వీడ్కోలు.. అధికార లాంఛనాలతో ముగిసిన రతన్ టాటా అంత్యక్రియలు!