AC Buying Guide
AC Buying Guide : సమ్మర్ వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవి కాలంలో మార్కెట్లో ఏసీలకు ఫుల్ డిమాండ్ పెరుగుతుంది. అయితే, చాలామందికి ఎలాంటి ఏసీలు కొనాలో పెద్దగా అవగాహన ఉండదు. ఆఫీసులో ఏసీనా? ఇంట్లో ఏసీనా? అనేది ముందు నిర్ణయించుకోవాలి. మీరు ఎంచుకునే ఏసీ మీరు ఉండే గదికి సరిపోయేలా ఉండాలి.
అప్పుడే ఆ ఏసీ కెపాసిటీ రూంకు తగినట్టుగా కూలింగ్ అందించగలదు. సాధారణంగా ఎయిర్ కండిషనర్ల (AC)లను కొనే ముందు వినియోగదారులు చాలా మంది 1-టన్ ఏసీ కొనాలా లేదా 1.5-టన్ ఏసీ కొనాలా అనేది తేల్చుకోలేక ఇబ్బంది పడుతుంటారు.
Read Also : Apple AirPods : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. మన హైదరాబాద్‌లోనే ఎయిర్‌పాడ్స్ తయారీ.. ఎప్పటినుంచంటే?
అనేక మంది ఈ విషయంలో ఎక్కువగా మిస్టేక్స్ చేస్తుంటారు. ఏదో ఒక ఏసీని తప్పుగా ఎంచుకుంటుంటారు. సరైన కూలింగ్, పవర్ కెపాసిటీ కోసం సరైన కెపాసిటీ కలిగిన ఏసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీరు ఏసీని కొనుగోలు చేసే ముందు ఎలాంటి కెపాసిటీ కలిగిన ఏసీలను ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఏసీ కెపాసిటీ ఎందుకు ముఖ్యం? :
ఏసీ కొనుగోలు చేసేటప్పుడు తప్పుగా టన్ ఏసీ ఎంచుకోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి.
పెద్ద గదులలో తగినంత కూలింగ్ ఉండదు
అధిక వినియోగం వల్ల విద్యుత్ బిల్లులు పెరుగుతాయి.
ఓవర్‌లోడింగ్ వల్ల ఏసీ లైఫ్ టైమ్ తగ్గుతుంది.
1-టన్, 1.5-టన్ ఏసీ మధ్య తేడాను మీకు ఏది సరైనదో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
1-టన్, 1.5-టన్ ఏసీల మధ్య తేడా ఏంటి? :
1 టన్ ఏసీ : చిన్న రూంలకు బెస్ట్ ఏసీ మోడల్ ఇదే :
కూలింగ్ సిస్టమ్ : గంటకు 12,000 BTU (బ్రిటిష్ థర్మల్ యూనిట్లు).
పవర్ కెపాసిటీ : తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. ఖర్చుతో కూడుకున్నది
సైజు, పోర్టబిలిటీ: కాంపాక్ట్, ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయడం సులభం.
ఏ రూంలకు బెస్ట్ : 120 చదరపు అడుగుల వరకు గదులు (ఉదా. చిన్న బెడ్‌రూమ్స్ లేదా స్టడీ రూమ్స్)
విద్యుత్ వినియోగం : తక్కువ విద్యుత్ వినియోగం, విద్యుత్ బిల్లులు తగ్గుతాయి.
చిన్న అపార్ట్‌మెంట్‌లు, ఆఫీస్ క్యాబిన్‌లు, చిన్న బెడ్‌రూమ్‌లకు సరైన ఏసీ
1.5 టన్ ఏసీలు.. పెద్ద రూంలకు బెస్ట్ ఏసీలు :
కూలింగ్ కెపాసిటీ : గంటకు 18,000 BTU
బిగ్ కవరేజ్ : 150 నుంచి 200 చదరపు అడుగుల గదులు తొందరగా కూల్ అవుతాయి.
పవర్ వినియోగం : 1-టన్ ఏసీ కన్నా ఎక్కువ. కానీ. ఇన్వర్టర్ టెక్నాలజీ విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది.
ఫాస్ట్ కూలింగ్ : ఫాస్ట్ కూలింగ్ సామర్థ్యంతో గదిని త్వరగా చల్లబరుస్తుంది.
లివింగ్ రూమ్స్, పెద్ద బెడ్ రూమ్స్, ఆఫీసులు, హాల్ వంటివి ఈ ఏసీలకు సరైనవిగా చెప్పవచ్చు.
ఏసీ కొనేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలివే :
రూమ్ సైజు : మీ గది పరిమాణం బట్టి ఏసీ కెపాసిటీని ఎంచుకోండి.
స్టార్ రేటింగ్ చెక్ : హై రేటింగ్ ఉన్న ఏసీలు (5-స్టార్ మోడల్స్) తక్కువ విద్యుత్తును వినియోగిస్తాయి. విద్యుత్ బిల్లులను ఆదా చేయొచ్చు.
ఇన్వర్టర్ టెక్నాలజీ : ఇన్వర్టర్ ఏసీలు విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తాయి. సాధారణ మోడళ్ల కన్నా తక్కువ పవర్‌తో సమర్థవంతంగా పనిచేస్తాయి.
వాడకం బట్టి ఎంచుకోండి : మీరు ఎక్కువ గంటలు ఏసీ వాడుతుంటే.. విద్యుత్ బిల్లు తగ్గేందుకు పవర్‌ఫుల్ మోడల్ ఏసీనే కొనండి.
సరైన ఇన్‌స్టాలేషన్ : ప్రాపర్ కూలింగ్, తగ్గిన శక్తి వినియోగానికి సరైన ప్లేస్‌మెంట్‌లో ఏసీని ఇన్‌స్టాల్ చేయండి.
ఏ ఏసీ కొనాలంటే? :
మీరు ఉండే చిన్న గది (120 చదరపు అడుగులు) ఉంటే.. మీ బడ్జెట్‌లో తక్కువ పవర్ వినియోగానికి 1-టన్ ఏసీ కొనండి.
పెద్ద గది (150-200 చదరపు అడుగులు) ఉంటే.. స్పీడ్, పవర్‌ఫుల్ కూలింగ్ సిస్టమ్ అవసరమైతే 1.5-టన్ ఏసీ కొనేసుకోండి.