Realme P3 Ultra 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? రియల్‌మి 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 19నే లాంచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Realme P3 Ultra 5G Launch : కొత్త ఫోన్ కావాలా? రియల్‌మి P3 అల్ట్రా 5జీ ఫోన్ వచ్చేస్తోంది. మార్చి 19న అధికారికంగా భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Realme P3 Ultra 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? రియల్‌మి 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 19నే లాంచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Realme P3 Ultra 5G Launch

Updated On : March 17, 2025 / 12:56 PM IST

Realme P3 Ultra 5G Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి రియల్‌మి నుంచి రియల్‌మి లేటెస్ట్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. రియల్‌మి P3 అల్ట్రా 5G ఈ నెల 19న లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ 5జీ ఫోన్ పర్ఫార్మెన్స్ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది.

ఇతర ఫోన్లకు పోటీ ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. రియల్‌మి ఈ 5జీ అల్ట్రా ఫోన్‌కు సంబంధించి వివరాలను రివీల్ చేయలేదు. కానీ, లీక్‌లను పరిశీలిస్తే.. ఈ రాబోయే 5G ఫోన్ ఏయే ఫీచర్లు, ధరతో లాంచ్ కానుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : Apple AirPods : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. మన హైదరాబాద్‌లోనే ఎయిర్‌‌పాడ్స్ తయారీ.. ఎప్పటినుంచంటే?

రియల్‌మి P3 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు (అంచనా) :
డిస్‌ప్లే : 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.83-అంగుళాల 1.5K అమోల్డ్ మైక్రో-కర్వ్డ్ డిస్‌ప్లే
ప్రాసెసర్ : మీడియాటెక్ డైమన్షిటీ 8350 చిప్‌సెట్, AnTuTuలో 1.4 మిలియన్లు స్కోర్ చేసింది. స్నాప్‌డ్రాగన్ 8s జనరేషన్ 3, స్నాప్‌డ్రాగన్ 7+ జనరేషన్ 3తో పోల్చవచ్చు.
స్టోరేజ్-ర్యామ్ : అల్ట్రా-ఫాస్ట్ పర్ఫార్మెన్స్ కోసం LPDDR5X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ కలిగి ఉంది.

కెమెరా, వీడియో కెపాసిటీ :
రియర్ కెమెరా సెటప్ :
OISతో 50MP సోనీ IMX 896 ప్రైమరీ సెన్సార్
8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్
AI-ఆధారిత 4K 60fps వీడియో రికార్డింగ్‌కు సపోర్టు
ఫ్రంట్ కెమెరా : 16MP సెల్ఫీ షూటర్

బ్యాటరీ, ఛార్జింగ్ :
బ్యాటరీ : ఈ హ్యాండ్‌సెట్ లాంగ్ టైమ్ పర్ఫార్మెన్స్ 6,000mAh బ్యాటరీతో వస్తుంది.
ఫాస్ట్ ఛార్జింగ్ : 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

డ్యూరబిలిటీ :
IP66, IP68, IP69 రేటింగ్‌లతో వస్తుంది.
1.5 మీటర్ల వరకు నీటిలో పడినా తట్టుకోగలదు
వేడి, చల్లటి నీటి జెట్‌ల‌ను కూడా తట్టుకోగలదు
డిజైన్, బిల్డ్

Read Also : WhatsApp Hack : అయ్య బాబోయ్.. మీ వాట్సాప్ అకౌంట్లను హ్యాకర్లు ఇలా హ్యాక్ చేస్తారు జాగ్రత్త.. ఈ స్మార్ట్‌టిప్స్‌తో చెక్ పెట్టేయండి..!

అల్ట్రా థిన్.. లైట్ వెయిట్ :
7.38mm మందంతో రావచ్చు
ఫోన్ బరువు దాదాపు 183 గ్రాములు

భారత్‌లో ధర (అంచనా) :
రియల్‌మి P3 అల్ట్రా 5జీ ధర రూ.25వేలు లోపు ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. ఇందులో లాంచ్ ఆఫర్‌లు ఉన్నాయా లేదో రివీల్ చేయలేదు.