Adani Group: మార్చిలో 6.5 వేల కోట్ల రుణాలు చెల్లించేందుకు సిద్ధమైన అదానీ గ్రూప్

మంగళవారం హాంకాంగ్‌లోని గ్రూప్ బాండ్ హోల్డర్‌లకు అదానీ మేనేజ్‌మెంట్ ఆ ప్లాన్‌లను అందించింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ జనవరి 24 నాటి నివేదిక నుంచి ఏడు లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీలు 140 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయాయి. అయితే హిండెన్‌బర్గ్ ఆరోపణల్ని అదానీ గ్రూప్ తిరస్కరించినప్పటికీ పతనం మాత్రం ఆగలేదు

Adani Group: అదానీ గ్రూప్ ఈ ఏడాది మార్చి చివరి నాటికి 790 మిలియన్ డాలర్ల (6.5 వేల కోట్లు) షేర్-బ్యాక్డ్ లోన్‌లను ముందస్తుగా చెల్లించాలని యోచిస్తోందట. అదానీ గ్రూపుకు చెందిన వ్యక్తులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఓ వ్యాపార దినపత్రిక పేర్కొంది. అదానీ గ్రీన్ ఎనర్జీ తన 2024 బాండ్లను 800 మిలియన్ రీఫైనాన్స్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మూడేళ్ల క్రెడిట్ లైన్ ద్వారా రీఫైనాన్స్ చేయనున్నట్లు సమాచారం. గత నెలలో కూడా విదేశీ బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తన్ని అదానీ గ్రూపు ముందస్తుగానే చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. అయితే మళ్లీ రుణమిచ్చే ప్రాతిపదికన ఆ చెల్లింపులు జరిగాయి.

Elon Musk: ప్రపంచ కుబేరుల జాబితాలో మరోసారి నెం.1 స్థానానికి ఎగబాకిన ఎలాన్ మస్క్

మంగళవారం హాంకాంగ్‌లోని గ్రూప్ బాండ్ హోల్డర్‌లకు అదానీ మేనేజ్‌మెంట్ ఆ ప్లాన్‌లను అందించింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ జనవరి 24 నాటి నివేదిక నుంచి ఏడు లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీలు 140 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయాయి. అయితే హిండెన్‌బర్గ్ ఆరోపణల్ని అదానీ గ్రూప్ తిరస్కరించినప్పటికీ పతనం మాత్రం ఆగలేదు. పెట్టుబడిదారుల ఆందోళనలను తగ్గించే ప్రయత్నాల్లో అదానీ గ్రూప్ ఇప్పటికే ఈ నెల ప్రారంభంలో బాండ్‌హోల్డర్‌లతో కాల్‌లు నిర్వహించింది. గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌లు దాని కొన్ని యూనిట్లలో రీఫైనాన్సింగ్ ప్లాన్‌లను వెల్లడించారు. షేర్లపై అన్ని రుణాలను పూర్తిగా ముందస్తుగా చెల్లించాలని యోచిస్తున్నారు.

Manish Sisodia: సీబీఐ అరెస్టుపై సుప్రీంకోర్టుకు సిసోడియా.. అత్యవసర విచారణకు కోర్టు అంగీకారం

ట్రెండింగ్ వార్తలు