Elon Musk: ప్రపంచ కుబేరుల జాబితాలో మరోసారి నెం.1 స్థానానికి ఎగబాకిన ఎలాన్ మస్క్

మస్క్ వ్యక్తిగత సంపదలో ఎక్కువ భాగం టెస్లా స్టాక్‌లతో ముడిపడి ఉందన్నది రహస్యమేమీ కాదు. ఈ సంస్థ యొక్క ప్రారంభ పెట్టుబడిదారులలో మస్క్ ఒకరు. అనంతరం కాలంలో టెస్లా కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా అవతరించారు. ఎలక్ట్రిక్ కార్ బ్రాండ్‌ను జూలై 2003లో మార్టిన్ ఎబర్‌హార్డ్, మార్క్ టార్పెనింగ్‌లు టెస్లా మోటార్స్‌గా స్థాపించారు

Elon Musk: ప్రపంచ కుబేరుల జాబితాలో మరోసారి నెం.1 స్థానానికి ఎగబాకిన ఎలాన్ మస్క్

Elon Musk becomes world's richest person

Elon Musk: కొద్ది రోజుల క్రితం పోగొట్టుకున్న ప్రపంచ కుబేరుడు కిరీటాన్ని ఎలాన్ మస్క్ మళ్లీ సాధించుకున్నారు. బ్లూంబర్గ్ తాజా నివేదికలో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో టెస్లా అధినేత మస్క్ మరోసారి మొదటి స్థానంలోకి వచ్చినట్లు వెల్లడించింది. టెస్లా స్టాకులు బాగా పుంజుకోవడంతో మస్క్ సంపాదన ఒక్కసారిగా పెరిగిపోయింది. 2021 సెప్టెంబరులో మొదటిసారి ప్రపంచ కుబేరుడిగా అవతరించిన మస్క్.. గతేడాది డిసెంబరులో తన మొదటి స్థానాన్ని కోల్పోయారు. ఆ స్థానంలో లూయిస్ వ్యుట్టన్ సీఈవో బెర్నార్డ్ అర్నాల్ట్ ఆక్రమించారు. అనంతరం రెండు నెలలకు మళ్లీ తన స్థానాన్ని మస్క్ పదిలపరుచుకున్నారు.

G-20 Meet: ఢిల్లీలో జరిగే జీ-20 మీట్‭కు చైనా హాజరు, జపాన్ దూరం

ప్రస్తుతం మస్క్ నికర సంపద 187 బిలియన్ డాలర్లు. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో ఆయన నికర విలువ కేవలం 137 బిలియన్ డాలర్లు మాత్రమే. కాగా, అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ సంపద కోల్పోయిన వ్యక్తిగా ఈ యేడాది మొదట్లో మస్క్ గిన్నీస్ రికార్డు సాధించారు. అప్పట్లో దీనిపై ఒక బిజినెస్ న్యూస్ లైన్ స్పందిస్తూ ‘‘అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు కోల్పోయి మస్క్ చారిత్రాత్మకమైన రికార్డ్ సృష్టించారు’’ అని పేర్కొంది. గతంలో ఒక జపనీస్ టెక్ ఇన్వెస్టర్ అయిన మసయోషి సన్ మీద ఈ రికార్డు ఉండేదట. ఆయన 2000 ఏడాదిలో 56 బిలియన్ డాలర్లు కోల్పోయారు. అయితే మస్క్ ఆయనను అధిగమించి 58.6 బిలియన్ డాలర్లు కోల్పోయి పాత రికార్డును తిరగరాశారు.

CWC: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎంపికలో రసవత్తరంగా మారుతున్న సమీకరణాలు

మస్క్ వ్యక్తిగత సంపదలో ఎక్కువ భాగం టెస్లా స్టాక్‌లతో ముడిపడి ఉందన్నది రహస్యమేమీ కాదు. ఈ సంస్థ యొక్క ప్రారంభ పెట్టుబడిదారులలో మస్క్ ఒకరు. అనంతరం కాలంలో టెస్లా కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా అవతరించారు. ఎలక్ట్రిక్ కార్ బ్రాండ్‌ను జూలై 2003లో మార్టిన్ ఎబర్‌హార్డ్, మార్క్ టార్పెనింగ్‌లు టెస్లా మోటార్స్‌గా స్థాపించారు. 2004లో మస్క్ 6.5 మిలియన్ల డాలర్ల భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా కంపెనీ అతిపెద్ద వాటాదారుడు అయ్యారు. ఆ తర్వాత అతను 2008లో కంపెనీ సీఈవోతో పాటు ప్రొడక్ట్ ఆర్కిటెక్ట్‌గా తన పాత్రను మార్చుకున్నారు. కాగా, 2002లో ట్విట్టర్ కొనుగోలు కోసం టెస్లాలోని తన షేర్లలో పెద్దమొత్తాన్ని విక్రయించారు.