G-20 Meet: ఢిల్లీలో జరిగే జీ-20 మీట్‭కు చైనా హాజరు, జపాన్ దూరం

చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ మాత్రం ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మార్చి 1న సమావేశాలు ప్రారంభం అవుతాయి. అయితే కిన్ గాంగ్ మార్చి 2న హాజరు కానున్నట్లు చైనా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గాంగ్ హాజరు గురించి చైనాకు చెందిన ఒక అధికార ప్రతినిధిని ప్రశ్నించగా ‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ సవాళ్లపై జీ-20 దృష్టి పెట్టాలి

G-20 Meet: ఢిల్లీలో జరిగే జీ-20 మీట్‭కు చైనా హాజరు, జపాన్ దూరం

japan minister skips and china minister attends for G-20 meet

G-20 Meet: మన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగే జీ-20 సమావేశానికి చైనా విదేశాంగ మంత్రి యోషిమాస హయాషి హాజరుకాకపోవచ్చని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. స్వదేశంలో ఉన్న పార్లమెంటరీ వ్యవహరాల కారణంగా బుధవారం నుంచి ఢిల్లీ జరిగే జీ-20 సమావేశానికి హాజరుకాకపోవచ్చని వారు పేర్కొన్నారు. ఇదే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియాలతో శుక్రవారం జరగనున్న క్వాడ్ దేశాల సమావేశానికి కూడా హాజరు అవుతారా లేదా అనేది స్పష్టత లేదు. అయితే ఆయన రాకపోయినప్పటికీ, ఆయన ఉప మంత్రిని ఇండియాకు పంపనున్నట్లు తెలుస్తోంది.

Minister Errabelli Dayakar Rao : ప్రీతి కుటుంబానికి న్యాయం చేయకపోతే నేను మంత్రిగా ఉండి కూడా వేస్ట్ : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఇకపోతే, చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ మాత్రం ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మార్చి 1న సమావేశాలు ప్రారంభం అవుతాయి. అయితే కిన్ గాంగ్ మార్చి 2న హాజరు కానున్నట్లు చైనా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గాంగ్ హాజరు గురించి చైనాకు చెందిన ఒక అధికార ప్రతినిధిని ప్రశ్నించగా ‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ సవాళ్లపై జీ-20 దృష్టి పెట్టాలి. జి-20 విదేశాంగ మంత్రుల సమావేశం బహుపాక్షికతపై సానుకూల సంకేతం పంపేలా అన్ని పార్టీలతో కలిసి పని చేసేందుకు చైనా సిద్ధంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు.

ఇక కిన్ గాంగ్ ఇండియాకు రానున్నట్లు మంగళవారమే భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ ఆయనకు ఆహ్వానం పంపారని, దానికి చైనా విదేశాంగ మంత్రి నుంచి సానుకూల స్పందన వచ్చిందని కేంద్ర విదేశాంగ శాఖ పేర్కొంది.

Strange Incident In Bihar: రివేంజ్ తీర్చుకున్న భర్త..! ముఖేశ్ భార్యతో పరారైన నీరజ్.. అతని భార్యను పెళ్లాడిన ముఖేశ్.. బీహార్‌లో వింత ఘటన ..