Airtel Free Netflix Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ రీఛార్జ్ ప్లాన్లపై ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ మెంబర్‌షిప్.. ఇదిగో లిస్టు..!

Airtel Free Netflix Plans : ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఓటీటీ సబ్‌స్ర్రిప్షన్ (OTT Subscription) కోరుకునే యూజర్ల కోసం ఎయిర్‌టెల్ ఉచితంగా ప్రత్యేక ప్లాన్లను అందిస్తోంది.

Airtel offering free Netflix membership with select recharge plans check the full list

Airtel Free Netflix Plans : ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఓటీటీ సబ్‌స్ర్రిప్షన్ (OTT Subscription) కోరుకునే యూజర్ల కోసం ఎయిర్‌టెల్ ఉచితంగా ప్రత్యేక ప్లాన్లను అందిస్తోంది. ఇప్పటికే రిలయన్స్ జియో (Reliance Jio), వోడాఫోన్ ఐడియా (Vodafone Idea) ఓటీటీ ఆధారిత రీచార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇప్పుడు ఎయిర్‌టెల్ (Airtel) కూడా నెట్‌ఫ్లిక్స్‌తో సహా ఫ్రీగా OTT సబ్‌స్క్రిప్షన్‌లతో కొన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఉచిత నెట్‌ఫ్లిక్స్ అందించే ఈ ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్, 4G డేటాతో పాటు మరిన్ని బెనిఫిట్స్ అందిస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌కు ఫ్రీగా మెంబర్‌షిప్ అందించే Airtel పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఎయిర్‌టెల్ ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో కొన్ని రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. అందులో రూ. 1199 ప్లాన్ ఒకటి.. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ నెలకు 150GB డేటా అందిస్తుంది. 1 సాధారణ ప్లాన్‌తో పాటు 2 అదనపు ఫ్యామిలీ యాడ్-ఆన్‌లను కూడా పొందవచ్చు. అంతేకాదు.. ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు, డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్‌కు ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది. అదనంగా, Airtel Xtream బెనిఫిట్స్, హ్యాండ్‌సెట్ ప్రొటెక్షన్ ప్లాన్లన అందిస్తుంది.

Airtel offering free Netflix membership with select recharge plans check the full list

రూ. 1599 ప్లాన్.. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ నెలవారీ వ్యాలిడిటీతో 250GB డేటాను పొందవచ్చు. ఒక జనరల్, 3 అదనపు ఫ్యామిలీ యాడ్-ఆన్‌లను కూడా అందిస్తుంది. అలాగే ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్ ప్లాన్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు, డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) మొబైల్‌కు Free Membership కూడా అందిస్తుంది. అదనంగా, Airtel Xtream బెనిఫిట్స్, హ్యాండ్‌సెట్ ప్రొటెక్ట్ ప్లాన్ కూడా అందిస్తుంది. కేవలం Airtel మాత్రమే కాదు, ఇతర పోటీదారులైన Reliance Jio, Vi వంటి టెలికాం ఆపరేటర్లు కూడా తమ కొన్ని ప్లాన్‌లతో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నారు.

రిలయన్స్ జియో రూ. 399, రూ. 599, రూ. 799 ధరతో 3 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లపై అన్‌లిమిటెడ్‌లు కాల్‌లు, మరెన్నో బెనిఫిట్స్ అందిస్తాయి. మరోవైపు, Vodafone కూడా రూ. 1099 ధరతో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో ఒక పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది.

Read Also : Airtel Free Data Offer : ఎయిర్‌టెల్ అదిరే ఆఫర్.. రోజూ అదనంగా ఫ్రీ డేటా పొందొచ్చు!

ట్రెండింగ్ వార్తలు