Akshaya Tritiya 2024 : నేడు అక్షయ తృతీయ.. బంగారం కొనాల్సిందేనా? ఎందుకంటే..

మంచి పనులు చేయడానికి, మంచి కార్యక్రమాలు ప్రారంభించడానికి అక్షయ తృతీయ రోజు ముహూర్తాలు చూసుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే.. ఈరోజు మొత్తం అమృత ఘడియలతో సమానమే

భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి అత్యంత విశిష్ఠత ఉంది. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ తిథినాడు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ పండుగను శుక్రవారం జరుపుకుంటున్నారు. అక్షయ తృతీయ సంవత్సరంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు. ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదుములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యాన్ని బ్రాహ్మణులకు దానమివ్వగా.. మిగిలిన వాటిని దైవోచ్చిష్ఠంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుందని పురాణంలో ఈశ్వర వాక్కుగా పూర్వికులు చెబుతుంటారు.

Also Read : అంగరంగ వైభవంగా ప్రారంభమైన సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. స్వామివారి నిజరూప దర్శనం

మంచి పనులు చేయడానికి, మంచి కార్యక్రమాలు ప్రారంభించడానికి అక్షయ తృతీయ రోజు ముహూర్తాలు చూసుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే.. ఈరోజు మొత్తం అమృత ఘడియలతో సమానమే. ఈ పవిత్రమైన రోజు బంగారం కొని తీరాలని అంటుంటారు. కొద్దిగైనా బంగారం కొనుగోలుకు ప్రాధాన్యతనిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో బంగారం అనేక గ్రహాలతో సంబంధం కలిగి ఉంటుంది. కానీ, ప్రధానంగా ఇది దేవగురు బృహస్పతికి సంబంధించినది. బంగారం లాభదాయకంగా ఉంటే అది వ్యక్తిని ధనవంతుడిని చేస్తుంది. అందుకే, అక్షయ తృతీయ రోజున ప్రజలు బంగారు ఆభరణాలు, బంగారంతో చేసిన వస్తువులను ఇంటికి తీసుకువస్తారు.

Also Read : Allu Arjun : అల్లు అర్జున్ మంచి మ‌న‌సు.. వాళ్ళ కోసం రూ.10ల‌క్ష‌లు..

బంగారం కొనుగోలుకు ఈరోజు నాలుగు మంచి ముహూర్తాలను పండితులు సూచించారు. ఉదయం 5.33 నుంచి 10.37 వరకు. అదేవిధంగా మధ్యాహ్నం 12.18 నుంచి 1.59వరకు. సాయంత్రం 5.21 నుంచి రాత్రి 7.02 వరకు అదేవిధంగా రాత్రి 9.40 నుంచి 10.59 గంటల సమయాల్లో బంగారం కొనుగోలుకు మంచి సమయం అని పండితులు సూచిస్తున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు