తెలంగాణలో భూముల ధరల పెంపునకు రంగం సిద్ధం..!

మరోవైపు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Land Values Hike : భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై రేవంత్ సర్కార్ చేస్తున్న కసరత్తు తుదిదశకు చేరింది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ల్యాండ్స్ వ్యాల్యూ పెంపుపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించబోతోంది. హెచ్ఎండీఏతో పాటు సమీప జిల్లాల్లో భూమల రిజిస్ట్రేషన్ విలువ పెరగనుండగా.. మరికొన్ని జిల్లాల్లో మార్కెట్ రేట్లు తగ్గనున్నాయని తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారిగా క్షేత్రస్థాయి నుంచి స్టాంపులు, రిజిస్ట్రేషన్స్ శాఖతో పాటు రెవెన్యూ అధికారులు పర్యటించి సర్వే నెంబర్ల ఆధారంగా మార్కెట్ విలువను పరిశీలించారు. ఈ మేరకు ఏయే ప్రాంతాల్లో ఎంత మేర భూముల విలువల పెంచాలి అన్నదానిపై ఒక అంచనాకు వచ్చిన ప్రభుత్వం.. శాస్త్రీయ బద్ధంగా మార్కెట్ విలువలు పెంచాలని నిర్ణయించింది. కమర్షియల్ ప్రాంతంగా గుర్తించేందుకు ముందే నిర్దేశించిన వివిధ పారామీటర్లు అక్కడ కనిపిస్తే కమర్షియల్ గా పరిగణిస్తారు. గతంలో నాన్ కమర్షియల్ ప్రాంతంగా ఉండి.. ఇప్పుడా ప్రాంతంలో కమర్షియల్ గా అభివృద్ధి చెంది ఉంటే.. అక్కడ ఎంత వీలైతే అంత మార్కెట్ విలువ పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పూర్తి వివరాలు..