Amazon Starlink : ఆపిల్‌తో అమెజాన్ బిగ్ డీల్.. స్టార్‌లింక్‌కు పోటీగా శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు..!
Amazon Starlink : భారత మార్కెట్లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులకు సంబంధించి స్టార్ లింక్ కు పోటీగా అమెజాన్, ఆపిల్ చేతులు కలిపాయి.. బిగ్ డీల్ కూడా కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.
Amazon Starlink
- స్టార్ లింక్‌కు పోటీగా అమెజాన్, ఆపిల్ భారీ ఒప్పందం
- 11.57 బిలియన్ డాలర్లతో డీల్ కుదుర్చుకున్న దిగ్గజ కంపెనీలు
- 200 శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన అమెజాన్
- 3200 కన్నా ఎక్కువ శాటిలైట్ల విస్తరణే లక్ష్యంగా ముందుకు
Amazon Starlink : భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు స్టార్ లింక్ రెడీ అవుతోంది. కానీ, అనుమతుల జాప్యం కారణంగా లేటు అవుతోంది. దాదాపు ఎలన్ మస్క్ కంపెనీ భారత్ మారుమూల ప్రాంతాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులను ప్రారంభించేందుకు అడుగుదూరంలో ఉంది. అయితే, ఇంతలోనే స్టార్‌లింక్ పోటీగా అమెజాన్ కూడా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సర్వీసు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది.
ఇందులో భాగంగా గ్లోబల్‌స్టార్ ఆపిల్‌తో అమెజాన్ జత కట్టింది. 11.57 బిలియన్ డాలర్ల డీల్ కూడా కుదుర్చుకుంది. ఇదే విషయాన్ని అమెజాన్ ఇటీవలే ప్రకటించింది. అమెజాన్ లియో ప్రొగ్రామ్ ద్వారా భూమికి సమీప కక్ష్య లక్ష్యాలలో తన వాటాను దక్కించుకునేందుకు అమెజాన్ గట్టి పట్టుదలతో కనిపిస్తోంది. స్టార్ లింక్ కు పోటీగా ఆపిల్, అమెజాన్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులను నెలకొల్పాలని నిర్ణయించుకున్నాయి.. ఈ డీల్ కు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
స్టార్ లింక్‌కు పోటీగా అమెజాన్ :
గ్లోబల్‌స్టార్ ఆపిల్.. వాచీలు, ఐఫోన్లలోని ఎమర్జెన్సీ శాటిలైట్ ఫీచర్లకు బాగా పాపులర్.. ఈ డీల్ ద్వారా ఆపిల్ కస్టమర్లకు ఈ శాటిలైట్ సర్వీసు మరింతగా అందుబాటులోకి వస్తుంది. ఎందుకంటే కొత్త డీల్ సేఫ్టీ ఫీచర్ల కోసం శాటిలైట్ సపోర్టును యాక్టివేట్ చేయనుంది. ప్రస్తుతానికి, స్టార్‌లింక్ ఈ రంగంలో ఏకపక్షంగా ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారుల కోసం ఒక భారీ శాటిలైట్ గ్రూపుతో సన్నద్ధమవుతోంది.
అమెజాన్ విషయానికి వస్తే.. సాంప్రదాయ స్మార్ట్‌ఫోన్ నెట్‌వర్క్‌లకు అతీతంగా కనెక్టివిటీని అందించే లాంగ్ టైమ్ ప్లాన్ భాగంగా ఈ సంస్థ కొత్త శాటిలైట్ ఇంటర్నెట్ సిస్టమ్ నిర్మిస్తోంది. అమెజాన్ లియో ప్రొగ్రామ్ సందర్భంగా ఈ సంస్థ 200 శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
3200 కన్నా ఎక్కువ శాటిలైట్లే టార్గెట్ :
2029 నాటికి ఈ నెట్‌వర్క్‌ను 3200 కన్నా ఎక్కువ శాటిలైట్లను విస్తరించేందుకు మరిన్ని ప్లాన్లను రెడీ చేస్తోంది. నివేదికల ప్రకారం.. జూలై 2026 నాటికి శాటిలైట్ గ్రూపులో భారీ మొత్తంలో శాటిలైట్లను ఏర్పాటు చేయాలని కంపెనీపై ఒత్తిడి పెరుగుతోంది.
ఈ కొనుగోలుతో అమెజాన్‌కు ఇప్పటికే ఉన్న డజనుకు పైగా తక్కువ భూ కక్ష్య శాటిలైట్ల నెట్‌వర్క్‌కు యాక్సస్ లభించింది. భూమిపై నెట్వర్క్ బలహీనంగా ఉన్న లేదా అసలు లేని మరిన్ని ప్రాంతాలను కవర్ చేయడమే దీని వెనుక ఉద్దేశ్యంగా చెప్పవచ్చు.
స్టార్లిన్ విషయానికొస్తే.. అంతరిక్ష రంగంలో దిగ్గజం కాగా 9 మిలియన్లకు పైగా వినియోగదారులకు సర్వీసు అందించనుంది. ప్రపంచవ్యాప్తంగా 10వేల కన్నా ఎక్కువ శాటిలైట్లను అందిస్తోంది. అంతేకాదు, ఈ ఎకోసిస్టమ్‌కు సపోర్టు కోసం శాటిలైట్ సామర్థ్యాలను విస్తరించనుంది. ఆపిల్ కూడా గ్లోబల్స్టార్లో సుమారు 1.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది.
