Amazon Festive Sale
Amazon Festive Sale : కొత్త స్మార్ట్ టీవీ కొనేవారికి అదిరిపోయే న్యూస్.. అమెజాన్ మెగా ఫెస్టివ్ సేల్ 2025 సందర్భంగా పాపులర్ 43-అంగుళాల ఎల్ఈడీ స్మార్ట్ టీవీలపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. పండుగ సీజన్ కావడంతో ఈ-కామర్స్ దిగ్గజం ఈ డీల్స్ దీపావళి వరకు కొనసాగించనుంది. అయితే సేల్ ఎండ్ డేట్ ఎప్పుడు అనేది అధికారికంగా ప్రకటించలేదు.
శాంసంగ్, ఎల్‌జీ, షావోమీ, వియూ, విజియో వరల్డ్ (VW) వంటి టాప్ బ్రాండ్లు భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. అదేవిధంగా రూ. 4వేల విలువైన అదనపు బ్యాంక్ ఆఫర్‌లతో పాటు ఇతర ఆఫర్లపై 67 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.
1. రెడ్‌మి 4K F సిరీస్‌పై 53 శాతం తగ్గింపు :
రెడ్‌మి 43-అంగుళాల 4K స్మార్ట్ టీవీ F సిరీస్ 53 శాతం (Amazon Festive Sale) తగ్గింపుతో లభిస్తుంది. అసలు ధర రూ.37,999 నుంచి ఈ టీవీని ఇప్పుడు అదనపు బ్యాంక్ డిస్కౌంట్లతో కేవలం రూ.13,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ మోడల్‌లో 4K అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్, బెజెల్-లెస్ డిస్‌ప్లే, 2GB ర్యామ్, 8GB స్టోరేజ్ ఉన్నాయి. అద్భుతమైన పర్ఫార్మెన్స్, క్రిస్టల్-క్లియర్ విజువల్స్ అందిస్తుంది.
2. వియూ క్యూఎల్ఈడీ టీవీలపై 67 శాతం వరకు ధర తగ్గింపు :
విజియో వరల్డ్ వియూ క్యూఎల్ఈడీ 43-అంగుళాల స్మార్ట్ టీవీ అత్యంత సరసమైనది. బ్యాంక్ డిస్కౌంట్లు తర్వాత ప్రస్తుతం రూ. 16,499 నుంచి రూ. 12,499కు అందుబాటులో ఉంది. ఈ టీవీ 4K అల్ట్రా HD రిజల్యూషన్, 2GB ర్యామ్, 16GB స్టోరేజ్, QLED పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది. తక్కువ ధరలో అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
3. వియూ (GloQLED) ప్రీమియం ఫొటో క్వాలిటీ :
వియూ గ్లోక్యూఎల్ఈడీ 43-అంగుళాల స్మార్ట్ టీవీ రూ.16,990కి లభిస్తుంది. రూ.35వేల నుంచి 40 శాతం తగ్గింపుతో పాటు రూ.4వేలు బ్యాంక్ ఆఫర్ పొందవచ్చు. క్లియర్ డిస్‌ప్లే, సౌండ్ క్వాలిటీకి బెస్ట్ మోడల్. మిడ్ రేంజ్ ధరకు ప్రీమియం సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే కొనుగోలుదారులకు అద్భుతంగా ఉంటుంది.
అమెజాన్‌లో శాంసంగ్ క్రిస్టల్ 4K విస్టా స్మార్ట్‌టీవీ రూ.25,490కి లిస్ట్ అయింది. రూ.39,500 నుంచి రూ.21,490కి తగ్గింది. అదనపు బ్యాంక్ డిస్కౌంట్లతో ధర రూ.21,490కి తగ్గుతుంది. ఇందులో 2GB ర్యామ్, 8GB స్టోరేజ్, శాంసంగ్ సిగ్నేచర్ క్రిస్టల్ 4K ప్రాసెసర్ ఉన్నాయి. షార్ప్ విజువల్స్, స్మూత్ స్ట్రీమింగ్‌ను అందిస్తుంది.
5. ఎల్‌జీ UA82 సిరీస్ (స్మార్ట్, స్టైలిష్) :
ఎల్‌జీ 43-అంగుళాల UA82 స్మార్ట్ టీవీ డిజైన్, పర్ఫార్మెన్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది. రూ. 28,990 (అసలు ధర రూ. 46,090)కు లభిస్తుంది, బ్యాంక్ ఆఫర్ల తర్వాత రూ. 24,990 ధరతో లభిస్తుంది. ఈ మోడల్‌లో 3 HDMI పోర్ట్‌లు, 2GB ర్యామ్, 8GB స్టోరేజీ, ఎల్‌జీ WebOS ఇంటర్‌ఫేస్ ఉన్నాయి.
పండుగ టీవీ డీల్స్ ముగిసేలోపు కొనేసుకోండి :
దీపావళికి సమయం ఆసన్నమవుతోంది. అమెజాన్ ఫెస్టివ్ సేల్ 2025 సందర్భంగా దాదాపు సగం ధరకే ప్రీమియం స్మార్ట్ టీవీ కొనేసుకోవచ్చు. మీరు రెడ్‌మి సరసమైన 4K సిరీస్ లేదా ఎల్‌జీ ఫీచర్-ప్యాక్డ్ మోడళ్ల కోసం చూస్తుంటే ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్ అసలు వదులుకోవద్దు.