Telugu » Business » Amazon Great Indian Festival 2025 Best Laptop Deals Under Rs 60000 For Work And Study Sh
Best Laptop Deals : కొత్త ల్యాప్‌టాప్ కావాలా భయ్యా.. అమెజాన్‌లో భారీ తగ్గింపుతో టాప్ 5 ల్యాప్‌టాప్స్ ఇవే.. ఏది కొంటారో కొనేసుకోండి!
Best Laptop Deals : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా అనేక ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఏ బ్రాండ్ మోడల్ కొంటారో మీఇష్టం..
Best Laptop Deals : కొత్త ల్యాప్‌టాప్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? పండగ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్లతో పాటు అనేక టాప్ బ్రాండ్ ల్యాప్‌టాప్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సేల్ మరెన్నో ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది. ఈ ఏడాదిలో అనేక ల్యాప్‌టాప్‌లపై మైండ్ బ్లోయింగ్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. గేమింగ్ ల్యాప్‌టాప్‌లతో పాటు బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్లు, డెయిలీ వర్క్ ల్యాప్‌టాప్‌లు కూడా భారీ తగ్గింపు ధరకే లభిస్తున్నాయి.
2/7
మీరు స్టూడెంట్ అయినా లేదా ఆఫీస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నా ప్రొఫెషనల్ అయినా లేదా బ్రౌజింగ్, ఎంటర్ టైన్మెంట్ కోరుకునే వ్యక్తి అయినా అమెజాన్ బెస్ట్ ల్యాప్‌టాప్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లలో చాలా వరకు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. అసలు ధరపై భారీ తగ్గింపులు, బ్యాంక్ కార్డ్ హోల్డర్లకు అదనపు డిస్కౌంట్లు ఉన్నాయి. అమెజాన్ పండగ సేల్ సమయంలో ఆఫీసు వర్క్, స్టడీ కోసం రూ. 60వేల లోపు ధరలో టాప్ 5 ల్యాప్‌టాప్స్ మీకోసం అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన ల్యాప్‌టాప్ కొనేసుకోండి.
3/7
హెచ్‌పీ 15 : కొత్త ల్యాప్‌టాప్‌ను కోరుకునే వారికి HP15 బెస్ట్ ఆప్షన్. ఈ డివైజ్ ఇంటెల్ కోర్ i3-1315U ప్రాసెసర్ కలిగి ఉంది. డాక్యుమెంట్లు, ఆన్‌లైన్ మీటింగ్స్ హాజరు కావడం, స్ట్రీమింగ్ వంటి రోజువారీ వినియోగానికి సరిపోతుంది. 15.6-అంగుళాల యాంటీ-గ్లేర్ మైక్రో-ఎడ్జ్ డిస్‌ప్లే కలిగి ఉంది. విద్యార్థులు, ప్రొఫెషనర్లలో ఎక్కువ గంటలు పనిచేసేవారికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ హెచ్‌పీ 15 ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 52,721 నుంచి తగ్గి కేవలం రూ. రూ. 36,990కే లభ్యమవుతుంది. మరిన్ని ఆఫర్లు ద్వారా రూ. 32,990కి తగ్గించవచ్చు.
4/7
లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 : పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్ కోసం చూస్తుంటే.. ఈ సేల్‌లో లెనోవో ఐడియా ప్యాడ్‌స్లిమ్ 3 తగ్గింపు ధరకే లభిస్తోంది. 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i7-13620H ప్రాసెసర్‌తో వస్తుంది. మల్టీ టాస్కింగ్, లైట్ ఎడిటింగ్ వంటి అన్ని అప్లికేషన్‌లను వేగంగా పూర్తి చేయొచ్చు. స్లిమ్ డిజైన్‌ను కూడా అందిస్తుంది. ఎక్కడికైనా తీసుకెళ్లడం చాలా ఈజీగా ఉంటుంది. అమెజాన్ సేల్‌లో రూ. 57,990 ధర ఉండగా, అదనపు ఆఫర్‌లతో అసలు ధర రూ. 89,390 నుంచి రూ. 51,490కి తగ్గింపుతో అందుబాటులో ఉంది.
5/7
డెల్ వోస్ట్రో : డెల్ వోస్ట్రో లైన్ అద్భుతమైన ల్యాప్‌టాప్. ఈ మోడల్ ఆఫీసులకు వెళ్లేవారికి, చిన్న వ్యాపారులకు అద్భుతంగా ఉంటుంది. ఇంటెల్ కోర్ i3-1305U ప్రాసెసర్ ద్వారా ఆధారితమైనది. ప్రెజెంటేషన్లు, వీడియో కాల్స్, స్ప్రెడ్‌షీట్‌లు వంటి రోజువారీ టాస్కులకు బెస్ట్. 15.6-అంగుళాల డిస్‌ప్లే కూడా లాంగ్ వర్కింగ్ అనుకూలంగా ఉంటుంది. ఈ డెల్ ల్యాప్‌టాప్ సేల్ సమయంలో రూ. 36,699కి అందుబాటులో ఉంది. అసలు ధర రూ. 54,479 నుంచి ఇతర ఆఫర్‌లతో రూ. 32,490కి తగ్గింపుతో కొనేసుకోవచ్చు.
6/7
ఏసర్ ఆస్పైర్ లైట్ : ఈ ఏసర్ ఆస్పైర్ లైట్ ల్యాప్‌టాప్ అత్యంత అద్భుతమైన ఆప్షన్. అమెజాన్ సేల్ సందర్భంగా అసలు ధర రూ. 58,999 నుంచి భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఎంఎండీ రైజెన్ 5 5625U ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. రోజువారీ పర్ఫార్మెన్స్, మల్టీ టాస్కింగ్ కోసం వినియోగించవచ్చు. 15.6-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే, స్లిమ్ బిల్డ్, గుడ్ బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ స్టయిల్, పర్ఫార్మెన్స్ కోరుకునే విద్యార్థులకు బాగా సరిపోతుంది. ఈ ఏసర్ ల్యాప్‌టాప్ డీల్ ధర కేవలం రూ. 30,990కే కొనేసుకోవచ్చు. అదే బ్యాంక్ ఆఫర్‌లతో కేవలం ధర రూ. 27,990కి తగ్గింపు పొందవచ్చు.
7/7
అసూస్ వివోబుక్ 15 : హై పర్ఫార్మెన్స్ ల్యాప్‌టాప్ కావాలంటే అసూస్ వివోబుక్ 15 కొనేసుకోవచ్చు. 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5-13420H ప్రాసెసర్‌తో వస్తుంది. i3 జనరేషన్ రైజన్ ఆప్షన్లతో వస్తుంది. ఈజీ ఎడిటింగ్, మల్టీ టాస్కింగ్ వంటి టాస్కులను స్పీడ్‌గా పూర్తి చేయొచ్చు. డిజైన్ సన్నగా అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. లాంగ్ టైపింగ్ సెషన్‌ల కోసం కీబోర్డ్‌ను కూడా పొందవచ్చు. వివోబుక్ 15 ధర అసలు ఎంఆర్పీ నుంచి రూ. 69,990 నుంచి భారీగా తగ్గి రూ. 46,990కి అందుబాటులో ఉంది. అయితే, మరిన్ని ఆఫర్‌లతో ఈ వివోబుక్ రూ. 39,990కే ఇంటికి తెచ్చుకోవచ్చు.