×
Ad

Amazon Diwali Sale : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? అమెజాన్‌లో రూ. 15వేల లోపు ధరలో టాప్ 5 ల్యాప్‌టాప్స్ ఇవే.. ఏది కొంటారో కొనేసుకోండి!

Amazon Diwali Sale : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? అమెజాన్ దీపావళి సేల్ సమయంలో రూ. 15వేల లోపు ధరలో టాప్ 5 ల్యాప్‌టాప్స్ కొనేసుకోండి.

Amazon Diwali Sale

Amazon Diwali Sale : కొత్త ల్యాప్‌టాప్ కొనేవారికి గుడ్ న్యూస్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా అతి చౌకైన ధరకే కొత్త ల్యాప్‌టాప్స్ లభ్యమవుతున్నాయి. రూ.15వేల కన్నా తక్కువ ధరలో హై-ఎండ్ ల్యాప్‌టాప్‌లను కొనేసుకోవచ్చు.

ఇందులో ఎక్కువగా డీల్స్, బ్యాంక్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లతో (Amazon Diwali Sale) ఈ హై-ఎండ్ ల్యాప్‌టాప్స్ ధరలు భారీగా తగ్గాయి. ఈ ల్యాప్‌టాప్స్ ఆకర్షణీయమైన ఫీచర్లలో లేటెస్ట్ టెక్నాలజీ, స్పెషిఫికేషన్లు, ర్యామ్, స్టోరేజ్ వంటి ఏఐ ఫీచర్లు ఉన్నాయి. ఇంకేమీ ఆలస్యం చేయకుండా.. తక్కువ ధరకే మీకు నచ్చిన ల్యాప్‌టాప్ కొనేసుకోండి.

వాకర్స్ టాప్ స్టూడెంట్ :
రూ. 15వేల కన్నా తక్కువ ధరతో ఈ ల్యాప్‌టాప్ ఆఫీసు వర్క్ బెస్ట్ ఆప్షన్ కావచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో దీనిపై 60శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ అద్భుతమైన స్టూడెంట్ ల్యాప్‌టాప్ 128GB స్టోరేజ్, 4GB ర్యామ్ కలిగి ఉంది. విండోస్ 11 హోమ్‌ రన్ అవుతుంది. సెలెరాన్ ప్రాసెసర్‌ కలిగి ఉంది. ఈ సిల్వర్ ల్యాప్‌టాప్‌ను రోజువారీ టాస్కుల కోసం ఉపయోగించవచ్చు.

హెచ్‌పీ 15 :
ఈ హెచ్‌పీ ల్యాప్‌టాప్ ఫాస్ట్ ఛార్జింగ్, 16GB ర్యామ్ అద్భుతంగా ఉంటుంది. నిమిషాల వ్యవధిలో ఆఫీస్, కాలేజీ టాస్కులను పూర్తి చేయొచ్చు. ఈ ల్యాప్‌టాప్ ఫుల్ హెచ్‌డీ ఫొటోలు, యాంటీ-గ్లేర్ డిస్‌ప్లేను అందిస్తుంది. 1080p ఫుల్ HD కెమెరా, ఎంఎండీ రాడియన్ జీపీయూతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ లైట్ కీబోర్డ్ కలిగి ఉంది.

Read Also : OnePlus 15 Launch : వన్‌ప్లస్ ఫ్యాన్స్ మీకోసమే.. కొత్త వన్‌ప్లస్ 15 వచ్చేస్తోందోచ్.. కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

లెనోవా V14 (ఇంటెల్ కోర్ i3) :
దీపావళి సేల్ సమయంలో ఈ లెనోవా ల్యాప్‌టాప్ చౌకైన ధరకే వస్తుంది. మీరు ఈ ప్రత్యేకమైన ఆఫర్‌ను మిస్ కాకుండా ఇప్పుడే 45శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ల్యాప్‌టాప్ 250-నిట్ యాంటీ-గ్లేర్ ఫుల్ HD డిస్‌ప్లే, విండోస్ 11 ఆఫీస్ హోమ్, 512GB స్టోరేజ్, 8GB ర్యామ్ కలిగి ఉంది. కేవలం ఒక గంటలో బ్యాటరీని 80శాతం ఛార్జ్ చేయవచ్చు. 18వేల కన్నా ఎక్కువ పిన్ కోడ్‌లకు కంపెనీ అదనంగా ఏడాది ఆన్‌సైట్ వారంటీని అందిస్తుంది.

ఏసర్ ఆస్పైర్ లైట్ :

ఈ ల్యాప్‌టాప్‌లో 512GB స్టోరేజ్, 16GB ర్యామ్, ఎంఎండీ రైజెన్ 3 ప్రాసెసర్ ఉన్నాయి. అప్‌గ్రేడబుల్ ర్యామ్, స్టోరేజ్, 180-డిగ్రీల హింజ్ స్క్రీన్ రొటేషన్, హై-ఎండ్, ఫ్యాషనబుల్ మెటల్ అల్లాయ్ కవర్ అన్నీ ఈ ఏసర్ ల్యాప్‌టాప్ కీలక ఫీచర్లు. లాంగ్ బ్యాటరీ లైఫ్, ట్విన్ మైక్రోఫోన్ నాయిస్ సప్రెషన్ ఈ ఫుల్ హెచ్‌డీ ల్యాప్‌టాప్ రెండు ఫీచర్లు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి.

అసూస్ వివోబుక్ గో 14 :
ఈ ల్యాప్‌టాప్‌లో ఎఎండీ రైజెన్ 3 ప్రాసెసర్ ఉంది. లాంచ్ తర్వాత ఈ మోడల్ ఫుల్ HD డిస్‌ప్లేతో బాగా పాపులర్ పొందింది. ఆఫీస్ వర్క్ నుంచి ఫ్రీలాన్సింగ్ కాలేజీ టాస్కులు, బిజినెస్ వ్యవహారాల వరకు ప్రతిదీ ఈ అసూస్ ల్యాప్‌టాప్‌తో చేయవచ్చు. 512GB స్టోరేజీ అద్భుతంగా ఉంటుంది. అతిపెద్ద, అత్యంత కీలకమైన డేటాను కూడా ఈజీగా స్టోర్ చేయవచ్చు. 8GB ర్యామ్ ద్వారా లాగ్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.