Amazon Great Indian Festival Sale 2025
Amazon Great Indian Festival Sale 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు సేల్ ప్రారంభానికి 24 గంటల ముందు నుంచే డీల్స్ పొందవచ్చు.
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ సేల్‌కు ముందు స్మార్ట్‌ఫోన్‌లు, హోం అప్లియన్సెస్, ఎలక్ట్రానిక్స్ ఇతర కేటగిరీలో కొన్ని (Amazon Great Indian Festival Sale 2025) ముందస్తు డీల్స్ అందిస్తోంది. ఫ్లాట్ ధర డిస్కౌంట్, సేవింగ్స్ కోసం బ్యాంక్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తోంది.
అమెజాన్ సేల్ తేదీ, సమయం వివరాలివే :
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సేల్ సెప్టెంబర్ 23న అర్ధరాత్రి నుంచి అందుబాటులో ఉంటుంది. అయితే, అమెజాన్ ప్రైమ్ సభ్యులు స్పెషల్ డీల్స్ కోసం 24 గంటల ముందుగానే యాక్సెస్ పొందవచ్చు.
అమెజాన్ సేల్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లు :
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ల్యాప్‌టాప్‌లు, హోం అప్లియన్సెస్ వంటి కేటగిరీలలో 40శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తున్నట్లు ప్రకటించింది.
ఆసక్తిగల కస్టమర్లు ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోళ్లపై ఇన్‌స్టంట్ 10శాతం తగ్గింపుతో సహా బ్యాంక్ ఆఫర్‌లను పొందవచ్చు. ఇంకా, అమెజాన్ ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్‌తో పాటు 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు పొందవచ్చు.
అమెజాన్ డీల్స్ ద్వారా హోం అప్లియన్సెస్, టెలివిజన్‌లు మరిన్నింటితో సహా వైడ్ రేంజ్ ప్రొడక్టులలో మర్చంట్ కొనుగోళ్లపై 28శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.
స్మార్ట్‌ఫోన్‌లపై అమెజాన్ డీల్స్ :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, వన్‌ప్లస్ 13 సిరీస్, ఐక్యూ 13 5జీ వంటి ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై భారీ ధర తగ్గింపు పొందవచ్చు.
ఆపిల్ అభిమానులు ఐఫోన్ 15పై అద్భుతమైన డీల్స్ పొందవచ్చు. అయితే, వన్‌ప్లస్ 13ఆర్, ఐక్యూ నియో 10, వివో V60 వంటి మిడ్-రేంజ్ ఆప్షన్లు కూడా డిస్కౌంట్లతో పొందవచ్చు.