అదరగొట్టే అఫర్లు… అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ 2019 ఏడాదిలో తొలి డిస్కౌంట్ల సేల్‌ షురూ అవుతోంది. దిగ్గజ ఆన్‌లైన్‌ రీటైలర్స్‌ రిపబ్లిక్‌ డే సందర్భంగా ఆఫర్ల వర్షం కురిపించనున్నాయి.  బ్లాక్‌బస్టర్ డీల్స్‌తో కస్టమర్ల ముందుకు రాబోతోంది. అదిరిపోయే డీల్స్, సూపర్ క్యాష్‌బ్యాక్స్ వంటి వాటితో కస్టమర్లను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది.

  • Publish Date - January 18, 2019 / 08:04 AM IST

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ 2019 ఏడాదిలో తొలి డిస్కౌంట్ల సేల్‌ షురూ అవుతోంది. దిగ్గజ ఆన్‌లైన్‌ రీటైలర్స్‌ రిపబ్లిక్‌ డే సందర్భంగా ఆఫర్ల వర్షం కురిపించనున్నాయి.  బ్లాక్‌బస్టర్ డీల్స్‌తో కస్టమర్ల ముందుకు రాబోతోంది. అదిరిపోయే డీల్స్, సూపర్ క్యాష్‌బ్యాక్స్ వంటి వాటితో కస్టమర్లను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ 2019 ఏడాదిలో తొలి డిస్కౌంట్ల సేల్‌ షురూ అవుతోంది. దిగ్గజ ఆన్‌లైన్‌ రీటైలర్స్‌ రిపబ్లిక్‌ డే సందర్భంగా ఆఫర్ల వర్షం కురిపించనున్నాయి.  బ్లాక్‌బస్టర్ డీల్స్‌తో కస్టమర్ల ముందుకు రాబోతోంది. అదిరిపోయే డీల్స్, సూపర్ క్యాష్‌బ్యాక్స్ వంటి వాటితో కస్టమర్లను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ జనవరి 20 నుంచి నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. జనవరి 23 అర్థరాత్రి వరకు అందుబాటులో ఉంటుంది. 
అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 12 గంటల ముందుగానే సేల్ ప్రారంభమౌతుంది. జనవరి 19 మధ్యాహ్నం 12 గంటలకు మీరు షాపింగ్‌ ప్రారంభించొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు కలిగిన వారు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్న వారికి కూడా ఈ సౌలభ్యం ఉంటుంది. అమెజాన్…టీవీలు, ఏసీలు, శాంసంగ్ గెలాక్సీ, ఐఫోన్స్, హానర్ లాంటి స్మార్ట్‌ఫోన్లతో సహా పలు ప్రొడక్టులపై ఆఫర్లను కూడా అందిస్తోంది. వీటితోపాటు ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ అండ్ కిచెన్, నిత్యావసర వస్తువులపై ఆఫర్లు ఉన్నాయి. ఇక అమెజాన్ ఇకో, ఫైర్ టీవీ స్టిక్, కిండిల్ ఇ-రీడర్స్‌పై రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది.
‘అమెజాన్‌పై కస్టమర్లు నమ్మకాన్ని ఉంచారు. మా లక్షలాది సెల్లర్ల ద్వారా వీరి కోసం బ్లాక్‌బస్టర్ డీల్స్ అందించేందుకు సిద్ధమయ్యాం. నో కాస్ట్ ఈఎంఐ, ప్రొడక్ట్ ఎక్స్చేంజ్, ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, ఫాస్ట్ డెలివరీ, ఇన్‌స్టలేషన్ వంటి వాటిని ఆఫర్ చేస్తున్నాం’ అని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (కేటగిరి మేనేజ్‌మెంట్) మనీశ్ తివారీ తెలిపారు.