Google Pixel 9a (Image Credit To Original Source)
Google Pixel 9a : పిక్సెల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 సందర్భంగా అనేక బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లు లభిస్తున్నాయి. కొనుగోలుదారులు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో అద్భుతమైన డీల్స్ పొందవచ్చు.
మీరు ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ అందించే మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఈ డీల్ మీకోసమే.. అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 9ఎ రూ. 11వేల కన్నా ఎక్కువ తగ్గింపుతో లభిస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు బ్యాంక్, కార్డ్ ఆఫర్లతో ఫోన్ ధర కూడా ఇంకా తగ్గుతుంది.
స్పెషిఫికేషన్ల పరంగా పరిశీలిస్తే.. ఈ పిక్సెల్ ఫోన్ అద్భుతమైన సాఫ్ట్‌వేర్, పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. మీరు ఈ పిక్సెల్ ఫోన్ కొనాలనుకుంటే కొనేసుకోవచ్చు. అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 9ఎ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
గూగుల్ పిక్సెల్ 9a అమెజాన్ డీల్ :
ప్రస్తుతం అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 9ఎ ఫోన్ రూ.38,889కి లిస్ట్ అయింది. లాంచ్ ధర కన్నా రూ.11,110 తగ్గింపుతో లభిస్తుంది. ఈ కొనుగోలు కోసం ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌తో అదనంగా రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. తద్వారా ధర మరింత తగ్గుతుంది.
Read Also : Apple iPhone 17 : అద్భుతమైన డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 17 మీ బడ్జెట్ ధరలోనే.. ఎంత తగ్గిందంటే?
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ నెలకు రూ.1,367 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందిస్తోంది. పాత ఫోన్ నుంచి అప్‌గ్రేడ్ చేసే యూజర్లు అమెజాన్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కూడా తీసుకోవచ్చు. మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్, వర్కింగ్ కండిషన్ బట్టి కొనుగోలుదారులు రూ. 36,500 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.
Google Pixel 9a (Image Credit To Original Source)
గూగుల్ పిక్సెల్ 9a స్పెసిఫికేషన్లు :
గూగుల్ పిక్సెల్ 9ఎ హుడ్ కింద గూగుల్ టెన్సర్ G4 చిప్ ద్వారా పవర్ పొందుతుంది. అంతేకాదు.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,100mAh బ్యాటరీ ప్యాక్ అందిస్తుంది. 6.3-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ కూడా అందిస్తుంది.
ఈ స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ HDR కంటెంట్ కోసం 1800 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. 2700 నిట్‌ల వరకు చేరుకోగలదు.
కెమెరా విషయానికి వస్తే.. పిక్సెల్ 9a ఫోన్ డ్యూయల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ సెటప్‌లో 48MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. అయితే, సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం సింగిల్ 13MP కెమెరాతో వస్తుంది.