Amazon Prime Day 2025
Amazon Prime Day 2025 Sale : అమెజాన్ ఇండియా ప్రైమ్ డే ఈవెంట్ తేదీలు, ప్రీ-సేల్ డీల్‌లను అధికారికంగా ప్రకటించింది. అమెజాన్ మెగా సేల్ జూలై 12న (Amazon Prime Day 2025 Sale) తెల్లవారుజామున 12:00 గంటల నుంచి జూలై 14న రాత్రి 11:59 గంటల వరకు ప్రారంభమవుతుంది. ఈ 72 గంటల సేల్‌లో కస్టమర్‌లు, ప్రైమ్ మెంబర్స్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, అప్లియన్సెస్, టీవీలు, అప్లియన్సెస్, అమెజాన్ ఎకో ప్రొడక్టులతో సహా వైడ్ రేంజ్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.
అమెజాన్ ప్రకారం.. ఈ ఏడాదిలో ఈవెంట్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లైన శాంసంగ్, వన్‌ప్లస్, ఐక్యూ, ఒప్పో, లావా, హానర్ నుంచి కొత్త ప్రొడక్టులు లాంచ్ అవుతున్నాయి. లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చు.
అమెజాన్ ప్రైమ్ డే 2025 స్మార్ట్‌ఫోన్ డీల్స్ :
అమెజాన్ కస్టమర్లు శాంసంగ్ గెలాక్సీ M36 5G, వన్‌ప్లస్ నార్డ్ 5, రియల్‌మి నార్జో 80 లైట్ 5G, ఐక్యూ 13 వంటి స్మార్ట్‌ఫోన్‌లపై బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ, రూ. 60వేల వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్‌తో పాటు భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, ఐఫోన్ 15, శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్, ఐఫోన్ 16 సిరీస్ వంటి ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై కూడా డిస్కౌంట్లు పొందవచ్చు.
కంపెనీ కచ్చితమైన డీల్స్‌ను ప్రకటించలేదు. ఆపిల్, లెనోవా, హెచ్‌పీ, శాంసంగ్, వన్‌ప్లస్ నుంచి ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లపై 40 శాతం నుంచి 60శాతం వరకు తగ్గింపు ఉంటుంది. సోనీ, నాయిస్, బోస్ నుంచి వేరబుల్స్, హెడ్‌ఫోన్‌లు కూడా డిస్కౌంట్‌లో లభిస్తాయి.
స్మార్ట్‌టీవీలు, అప్లియన్సెస్, గృహోపకరణాలు :
ప్రస్తుతం అమెజాన్ హోమ్ ఎంటర్టైన్మెంట్ సెగ్మంట్‌లో 600కి పైగా టెలివిజన్ మోడళ్లపై 65శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. 3 ఏళ్లు ఎక్స్‌టెండెడ్ వారంటీలు, నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వంటి అదనపు బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ సేల్‌లో LG, Samsung, Haier, Carrier వంటి మెయిన్ అప్లియన్సెస్ బ్రాండ్లు ఉన్నాయి. వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, కిచెన్ అప్లియన్సెస్ 65 శాతం వరకు తక్కువ ధరలకు డిస్కౌంట్ అందిస్తోంది.
అమెజాన్ ప్రొడక్టులు, స్మార్ట్ డివైజ్‌లు :
అమెజాన్ సొంత ఎకో, ఫైర్ టీవీ, కిండిల్ డివైజ్‌లపై 56శాతం వరకు తగ్గింపు, స్మార్ట్ బల్బులు లేదా ఇతర అప్లియన్సెస్‌తో కూడిన కాంబో ఆఫర్లు ఉంటాయి. ఇటీవల లాంచ్ అయిన కిండిల్ పేపర్‌వైట్‌పై రూ.3 వేలు డిస్కౌంట్ పొందవచ్చు.
ఇతర బెనిఫిట్స్ :
అమెజాన్ బిజినెస్ కస్టమర్లు ప్రత్యేకమైన ధరలకు ఆఫీస్ ఫర్నిచర్, ఇండస్ట్రీ అప్లియన్సెస్, ల్యాప్‌టాప్ బల్క్ కొనుగోళ్లపై 70శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అదనంగా, ఈ సేల్ సహేలి, అమెజాన్ కరిగర్, కొత్త బిజినెస్ కోసం లాంచ్‌ప్యాడ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రాంతీయ డీలర్ల నుంచి వస్తువులను అందిస్తుంది.
బ్యాంక్ డిస్కౌంట్లు :
SBI, ICICI బ్యాంక్ కార్డ్ వినియోగదారులు అదనపు క్యాష్‌బ్యాక్, ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు. అమెజాన్ పే, అమెజాన్ పే లేటర్ సేల్ సమయంలో అదనపు క్రెడిట్ లైన్లు, ట్రావెల్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ బెనిఫిట్స్ పొందవచ్చు.