Vivo T4 Lite Sale : వివో లవర్స్ డోంట్ మిస్.. అతి చౌకైన ధరకే వివో T4 లైట్ 5G ఫోన్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి..!

Vivo T4 Lite Sale : వివో ఫోన్ ఆఫర్ అదిరింది.. అత్యంత సరసమైన ధరకే వివో T4 లైట్ 5G ఫోన్ లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Vivo T4 Lite Sale : వివో లవర్స్ డోంట్ మిస్.. అతి చౌకైన ధరకే వివో T4 లైట్ 5G ఫోన్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి..!

Vivo T4 Lite Sale

Updated On : July 2, 2025 / 4:29 PM IST

Vivo T4 Lite Sale : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? ఇటీవలే భారత మార్కెట్లో బడ్జెట్-ఫ్రెండ్లీ T4 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను వివో ఆవిష్కరించింది. లాంచ్ అయిన వారంలోనే కొనుగోలుకు (Vivo T4 Lite Sale) అందుబాటులోకి వచ్చింది. ఈ వివో స్మార్ట్‌ఫోన్ 256GB వరకు స్టోరేజీ ఆప్షన్లను అందిస్తుంది. 6000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది.

అన్నీ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తుంది. అదనంగా, ఫొటో ఎడిటింగ్, స్క్రీన్ ట్రాన్స్‌లేషన్ కోసం ఏఐ ఫీచర్లను కలిగి ఉంది. ఈ వివో స్మార్ట్‌ఫోన్ ధర, ఆఫర్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

వివో T4 లైట్ ఇండియా ధర, ఆఫర్లు :
వివో T4 లైట్ ఫోన్ మొత్తం 3 స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో వస్తుంది. 4GB ర్యామ్ + 128GB, 6GB ర్యామ్ + 128GB, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ఉన్నాయి. బేస్ మోడల్ ధర రూ.9,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇతర వేరియంట్ల ధర వరుసగా రూ.10,999, రూ.12,999 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ వివో ఫోన్ జూలై 2న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి రానుంది.

వివో అధికారిక ఈ-స్టోర్, వివిధ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా అదనపు కొనుగోలు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కొనుగోలుదారులు ప్రిజం బ్లూ, టైటానియం గోల్డ్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్ల మధ్య ఎంచుకోవచ్చు. అదనంగా, HDFC, SBI, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల లావాదేవీలపై రూ. 500 డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు.

Read Also : Post Office NSC : పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఈ స్కీమ్‌లో 5 ఏళ్లు పెట్టుబడితో రూ. 5 లక్షలకు పైగా రాబడి.. టాక్స్ బెనిఫిట్స్ కూడా..!

వివో T4 లైట్ 5G స్పెసిఫికేషన్లు :
వివో T4 లైట్ 5G ఫోన్ 6.74-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 720×1600 పిక్సెల్‌ HD రిజల్యూషన్‌ను అందిస్తుంది. 1000 నిట్‌ల గరిష్ట ప్రకాశం, మృదువైన 90Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే ఆకర్షణీయంగా ఉంటుంది. మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ 8GB వరకు ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది. ఎక్కువ స్టోరేజీ అవసరమైతే మైక్రో SD కార్డ్‌తో స్టోరేజీని 2TB వరకు విస్తరించవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్OS 15పై రన్ అవుతుంది.

ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. వివో T4 ఎలైట్ పవర్‌ఫుల్ 6000mAh బ్యాటరీతో వస్తుంది. 15W USB టైప్-C ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. రోజంతా ఛార్జింగ్ వస్తుంది.

కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, డ్యూయల్ 5G సపోర్ట్, బ్లూటూత్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ IP64 రేటింగ్‌తో పాటు SGS 5-స్టార్ యాంటీ-ఫాల్ ప్రొటెక్షన్, MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. అదనపు భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ కూడా ఉంది.