Post Office NSC : పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఈ స్కీమ్‌లో 5 ఏళ్లు పెట్టుబడితో రూ. 5 లక్షలకు పైగా రాబడి.. టాక్స్ బెనిఫిట్స్ కూడా..!
Post Office NSC : పోస్టాఫీస్ NSC పథకంలో పెట్టుబడి పెడితే 7శాతం కన్నా వడ్డీ రేటును పొందవచ్చు. సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.

Post office scheme
Post Office NSC : పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? అయితే మీకోసం అద్భుతమైన ప్రభుత్వం పథకం ఒకటి ఉంది. అదే.. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) స్కీమ్. ఈ పథకం (Post Office NSC)లో పెట్టుబడి పెడితే అద్భుతమైన రాబడితో పాటు పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు. చాలామంది తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని ఆదా చేసి సురక్షితమైన పథకంలో పెట్టుబడి పెట్టాలని భావిస్తుంటారు.
మీరు కూడా పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే.. ఇదే బెస్ట్ టైమ్.. పోస్టాఫీస్ పొదుపు పథకాలు చాలా సురక్షితమైనవి. ప్రతి వయసు వారికి పోస్టాఫీసు ద్వారా సేవింగ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. NSC పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా కేవలం 5 సంవత్సరాలలో రూ. 5 లక్షల రాబడిని ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
7.7శాతం వడ్డీ రేటు :
పోస్టాఫీసు నేషనల్ సేవింగ్స్ స్కీమ్ లేదా (NSC) పథకం ద్వారా రాబడి, ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయి. చిన్న పొదుపు పథకాలలో ఇదొకటి. దేశంలోని ఏ పోస్టాఫీసులోనైనా కనీసం రూ. 1,000 పెట్టుబడితో NSC అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పెట్టుబడిపై వార్షికంగా 7.7 శాతం వడ్డీ రేటుతో వడ్డీ పొందవచ్చు.
ఈ పథకం కింద వడ్డీ రేటు కాంపౌండింగ్ ఆధారంగా అందిస్తారు. వడ్డీ మొత్తాన్ని 5 ఏళ్ల పెట్టుబడి తర్వాత మాత్రమే ఖాతాకు బదిలీ అవుతుంది. NSCతో సహా ఇతర పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు ప్రతి 3 నెలలకు ఒకసారి సవరిస్తారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ పథకాలలో పెట్టుబడి భద్రతకు ప్రభుత్వం హామీ ఉంటుంది.
పన్ను ప్రయోజనాలివే :
NSC ఖాతాదారులకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద వడ్డీతో పాటు అనేక పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పోస్టాఫీస్ పథకంలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరుగుతోంది. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇందులో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. మీకు కావలసినంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టవచ్చు.
5 ఏళ్ల లాక్-ఇన్ టైమ్ :
ఈ ప్రభుత్వ పథకంలో అందించే వడ్డీని మీరు పూర్తిగా వాడుకోవచ్చు. అయితే, మీ పెట్టుబడిని లాక్-ఇన్-పీరియడ్ వరకు కొనసాగించాలి. అప్పుడే మీకు పూర్తి వడ్డీ వస్తుంది. NSC పథకంలో 5 ఏళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంది. ఈ సేవింగ్స్ అకౌంటులో ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఒక ఏడాది పాటు కొనసాగించిన తర్వాత క్లోజ్ చేస్తే.. పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని మాత్రమే తిరిగి పొందుతారు.
ఒక్క పైసా వడ్డీ కూడా రాదని గమనించాలి. అందుకే పూర్తిగా 5 సంవత్సరాలు అకౌంట్ కొనసాగించాలి. మీ పిల్లల పేరుతో అకౌంట్లను ఓపెన్ చేసే సౌకర్యం కూడా NSC పథకంలో అందుబాటులో ఉంది. నిబంధనల ప్రకారం.. 10 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లల పేరుతో ఓపెన్ చేసిన అకౌంట్‌ను వారి తల్లిదండ్రులు మానేజ్ చేయొచ్చు. మీ సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
5 ఏళ్లలో 5 లక్షల సంపాదన :
మీరు కేవలం 5 సంవత్సరాలలో 5 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. NSC పథకం వడ్డీ రేటు 7.7శాతంతో ఒకేసారి 5 సంవత్సరాల పాటు రూ. 11లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఇలాంటి సందర్భాల్లో కాంపౌండింగ్ వడ్డీతో మెచ్యూరిటీపై రూ. 15,93,937 పొందుతారు. వడ్డీ రేటు ప్రకారం.. ఈ 5 ఏళ్లలో మీకు మొత్తం రూ. 4,93,937 వడ్డీ లభిస్తుంది. అదే సమయంలో, పెట్టుబడిని పెంచడం ద్వారా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.