Best Mini Air Coolers : సమ్మర్‌లో కొత్త కూలర్ కావాలా? రూ. 3వేల లోపు బెస్ట్ మినీ ఎయిర్ కూలర్లు ఇవే.. ఇక మీ ఇల్లంతా కూల్ కూల్..!

Best Mini Air Coolers : కొత్త ఎయిర్ కూలర్ కోసం చూస్తున్నారా? అయితే, మీకోసం అతి తక్కువ ధరలో కేవలం రూ.3వేల లోపు బెస్ట్ రూమ్ కూలర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఎయిర్ కూలర్ కొని ఇంటికి తెచ్చుకోండి.

Best Mini Air Coolers : సమ్మర్‌లో కొత్త కూలర్ కావాలా? రూ. 3వేల లోపు బెస్ట్ మినీ ఎయిర్ కూలర్లు ఇవే.. ఇక మీ ఇల్లంతా కూల్ కూల్..!

Best Air Coolers

Updated On : April 1, 2025 / 4:23 PM IST

Best Mini Air Coolers : ఎండాకాలం వచ్చేసింది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎండ వేడిని తట్టుకునేందుకు ఇంట్లో ఏసీలు, కూలర్లు తప్పనిసరిగా మారాయి. ఈ వేసవి సీజన్‌లో కొత్త ఎయిర్ కూలర్లు కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. సాధారణంగా ప్రతి ఒక్కరూ వేసవిలో తమ ఇల్లు కూల్‌గా ఉండాలని కోరుకుంటారు. అందుకు మంచి కూలర్ ఏదైనా ఉంటే బాగుండు అని ఆలోచిస్తుంటారు.

మీరు కూడా కొత్త ఎయిర్ కూలర్ కావాలంటే.. ప్రస్తుతం మార్కెట్లో అతి తక్కువ ధరకే అద్భుతమైన కూలింగ్‌ ఆప్షన్లతో ఎయిర్ కూలర్లు అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్‌లో మంచి రూమ్ కూలర్‌ను ఎంచుకోవడం కష్టం కావచ్చు.

Read Also : iPhone 16 : బిగ్ డిస్కౌంట్.. రూ.80వేల ఐఫోన్ 16 కేవలం రూ.44వేలకే.. ఇంత తక్కువలో మళ్లీ దొరకదు!

చిన్న, మధ్య తరహా స్థలాలకు తగిన కూలర్లు అనేక సైజుల్లో లభ్యమవుతున్నాయి. ఈ కూలర్లు త్వరగా గదిని కూలింగ్ చేయడంతో పాటు ఇంటి మొత్తాన్ని కవర్ చేస్తాయి. రూ.3వేల లోపు ధరలో టాప్ 6 రూమ్ కూలర్‌ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. మీకు నచ్చిన ఎయిర్ కూలర్ ఎంచుకుని ఇంటికి తెచ్చుకోవచ్చు.

రూమ్ మోహితం ఫర్ మిని కూలర్ :
మీ ఇంట్లో కూలింగ్ మాత్రమే కాదు.. మంచి సువాసన కూడా అందించే మిని కూలర్ ఒకటి ఉంది. ఇంట్లో గాలిని తేమగా ఉంచే చల్లటి గాలిని అందిస్తుంది. రాత్రిపూట లైటింగ్ ఉండే చిన్న కూలర్‌ను ఊహించుకోండి. మెడ్‌ప్రైడ్ మినీ కూలర్ అంటే అదే. గాలిని సువాసనగా ఫ్రెష్‌గా ఉంచుతుంది.

హ్యూమిడిఫైయర్, ప్యూరిఫైయర్‌గా కూడా పనిచేస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఎంత వాడినా తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. సాధారణ ఎయిర్ కండిషనర్ కన్నా 90శాతం తక్కువ. మీకు సౌకర్యంతో పాటు ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. కూలర్ కంటే ఎక్కువ అని చెప్పవచ్చు.

NTMY USB డెస్క్ ఫ్యాన్ (మినీ ఎయిర్ కూలర్) :
NTMY మినీ ఎయిర్ కూలర్ అనేది వేడి నుంచి వెంటనే రిలీఫ్ అందిస్తుంది. ఈ చిన్న ఎయిర్ కూలర్ మీ ఇంట్లో పూర్తిగా కూలింగ్ ఉండేలా చేస్తుంది. డెస్క్‌లు, ఆఫీసులు, ఇళ్లు, హాస్టళ్లు, వెకేషన్ సహా ఏ సెట్టింగ్‌కైనా ఇది బెస్ట్ కూలర్.

మూడు స్ప్రే సెట్టింగ్‌లు, మూడు ఎయిర్ స్పీడ్‌తో మీకు నచ్చిన కూలింగ్ లెవల్ ఎంచుకోండి. 600ml వాటర్ ట్యాంక్ 2.5 నుంచి 12 గంటల కంటిన్యూ స్ప్రేయింగ్‌కు అనుమతిస్తుంది. అవసరమైన కూలింగ్ అందించడంతో పాటు ఎయిర్ స్పీడ్, ఆటో టైమర్ కూడా 7 కలర్స్ ఎల్ఈడీ లైట్లతో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

పోర్టబుల్ ఏసీ మినీ కూలర్ ఫ్యాన్ :
పోర్టబుల్ మినీ AC (MOHITAM) కూలర్ ఫ్యాన్‌ అద్భుతమైనది. కూలింగ్ కోసం రీఛార్జ్ చేయగలదు. ఇంటి లోపల లేదా ఆరుబయట ఉపయోగించవచ్చు. చాలా తేలికైనది. తక్కువ పవర్ మాత్రమే ఉపయోగిస్తుంది. మీరు ఎక్కడికైనా తీసుకెళ్లడానికి సౌకర్యంగా ఉంటుంది. హ్యూమిడిఫైయర్‌గా పనిచేస్తుంది. ఈ కూలర్ వ్యక్తిగత వినియోగానికి బెస్ట్ ఆప్షన్. షెల్ఫ్ లేదా క్యాబినెట్‌లో స్టోర్ చేయవచ్చు.

మినీ కూలర్ :
ఎన్ఎల్ ట్రేడర్స్ నుంచి మినీ కూలర్ మీ ఇంట్లో లేదా ఆఫీసులో సరైన కూలింగ్ ఆప్షన్. ఈ 3-ఇన్-1 కూలర్ వేసవిలో ఇంటిని చల్లగా ఉంచుతుంది. వైట్ స్టయిల్ ఆప్షన్లతో ఏ స్థలాన్ని అయినా కనిపించేలా చేస్తుంది. ఎలక్ట్రిక్ కేబుల్‌పై రన్ అవుతుంది. 220 వోల్ట్‌ల వద్ద పనిచేస్తుంది. స్టేబుల్ కూలింగ్ అందిస్తుంది. మీరు రిమోట్ కంట్రోల్‌తో దూరం నుంచి కూడా చాలా సులభంగా ఆపరేట్ చేయవచ్చు.

హిండ్‌వేర్ స్మార్ట్ అప్లియన్సెస్ :
హింద్వేర్ స్నోక్రెస్ట్ 12-లీటర్ ఎయిర్ చిల్లర్ వ్యక్తిగత వినియోగానికి చాలా బెస్ట్. ఈ పర్పుల్ కూలర్ స్టైలిష్, ఫంక్షనల్ రెండూ కలిగి ఉంది. అదనంగా, ఫోన్‌ వంటి అప్లియన్సెస్ ఛార్జ్ చేసేందుకు USB కనెక్టర్‌ను కలిగి ఉంటుంది. యాంటీ-మైక్రోబయల్ ఫిల్టర్ ఎయిర్ కూడా ఫ్రెష్‌గా ఉంచుతుంది. ప్లాస్టిక్‌తో ఉండే ఇది చాలా తేలికైనది. ఎక్కువకాలం మన్నికైనది. పోర్టబుల్‌గా కూడా పనిచేస్తుంది.

Read Also : Upcoming Smartphones : కొత్త ఫోన్ కావాలా? ఈ ఏప్రిల్‌లో రాబోయే సరికొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్లు మాత్రం కెవ్వుకేక.. ఫుల్ డిటెయిల్స్..!

ఎక్విరా హైస్పీడ్ ఫ్యాన్ కూలర్ :
ఎక్విరా హై స్పీడ్ ఫ్యాన్ కూలర్ మంచి కూలింగ్ అందిస్తుంది. చూసేందుకు చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ కాంపాక్ట్ డిజైన్ కారణంగా ఫ్యాషన్ డిజైన్ కలిగి ఉంది. లివింగ్ రూమ్, కిచెన్, బెడ్ రూమ్, వర్క్ ప్లేస్ వంటి ప్రాంతాలకు బెస్ట్ అని చెప్పవచ్చు. 1.2 అడుగుల పొడవైన ఈ ఫ్యాన్ ఆపరేట్ చేయడం చాలా సులభం. ఎందుకంటే ఈ ఫ్యాన్స్‌కు వాటర్ అవసరం లేదు. అంతేకాదు.. USB మొబైల్ ఛార్జర్ కూడా వినియోగించవచ్చు.