అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ హైలైట్స్

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ఫ్రీ వెడ్డింగ్ అత్యంత ఆడంబరంగా జరిగాయి. సెలబ్రిటీలతో పాటు అంబానీ కుటుంబ సభ్యులు ఆటపాటలతో ఆదరగొట్టారు.

Anant Ambani Pre Wedding: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం త్వరలో జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రీ-వెడ్డింగ్ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఈ వేడుకల్లో సందడి చేశారు. ముఖేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ కూడా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని డాన్సులు, నటనతో ఆకట్టుకున్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ఫ్రీవెడ్డింగ్ సెలబ్రేషన్లలో సెలబ్రిటీలు సందడికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

బాలీవుడ్ అగ్ర హీరోలు ఆమిర్ ఖాన్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఒకే వేదికపై.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నాటు నాటు పాటకు డాన్స్ చేయడం హైలైట్ గా నిలిచింది. ప్రముఖ సింగర్స్ ప్రీతమ్, అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్, షాన్, ఉదిత్ నారాయణ్, సుఖ్విందర్ సింగ్, మోహిత్ చౌహాన్, నీతి మోహన్, మోనాలీ ఠాకూర్ తమ పాటలతో శ్రోతలను అలరించారు. టీమిండియా క్రికెటర్లు, ఇతర క్రీడాకారులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులంతా ఒకచోట చేరి సందడి చేశారు.

 

వధూవరులు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ తమ ఆటపాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఎప్పుడు వ్యాపార కార్యకలాపాల్లో తలమునకలయ్యే ముఖేశ్ అంబానీ కూడా తన సతీమణి నీతాతో కలిసి డాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మా ఇంటికి బాస్ నీతా అంటూ నటనతోనూ అలరించారు. నీతా అంబానీ నృత్య ప్రదర్శన ఆహూతులకు ఆహ్లాదాన్ని పంచింది. వధువు రాధికా మర్చంట్ ఎంట్రీ, అనంత్ అంబానీతో కలిసి ఆమె చేసిన డాన్స్ చూడముచ్చటగా ఉంది. ఇక సోషల్ మీడియాలో అయితే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ విశేషాలు, వీడియోలు విపరీతంగా షేర్ అయ్యాయి.

 

 

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు