Anant Ambani Luxury Watch : మొబైల్స్ వచ్చినా వాచ్‌లకు తగ్గని క్రేజ్.. అనంత్ మాత్రమే కాదు.. గాంధీ టు టామ్ క్రూయిస్ వరకు.. ప్రతి గడియారానికో చరిత్ర ఉంది!

Anant Ambani Luxury Watch : అనంత్ అంబానీ చేతి గడియారం చూసి మెటా బాస్ మార్క్ జుకర్‌బర్గ్, ఆయన సతీమణి ప్రిసిల్లా చాన్ ఆశ్చర్యపోయారు. ఎన్ని మొబైల్స్ వచ్చినా వాచ్‌లపై కొంచెం కూడా ఆకర్షణ తగ్గలేదనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ..

Anant Ambani Luxury Watch

Anant Ambani Luxury Watch : ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. వచ్చే జూలైలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ జంట పెళ్లిపీటలెక్కనున్నారు. గుజరాత్ లోని జామ్‌నగర్ వేదికగా ఈ నెల ఒకటో తేదీ నుంచి మూడు వరకు అత్యంత వైభవంగా అతిరథ మహారథుల సమక్షంలో ప్రీ-వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రపంచ దేశాల నుంచి ఎందరో పారిశ్రామికవేత్తలు, సినీతారలు, క్రీడా ప్రముఖులు విచ్చేశారు. జామ్‌నగర్‌ వేదికగా వేలాది మంది సెలబ్రిటీలతో అనంతుడి ప్రీ-వెడ్డింగ్ వేడుకులు అత్యంత ఆహ్లాదరకరంగా జరిగాయి. అంబానీ ఎన్నో కోట్లు ఖర్చు చేసి మరి ఈ వేడుకలను నిర్వహించగా.. సోషల్ మీడియాలో అంబానీ ఇంట పెళ్లి గురించే తెగ చర్చ నడుస్తోంది.

అనంత్ వాచ్‌ చూసి ముచ్చటపడిన మార్క్ జుకర్‌బర్గ్ దంపతులు.. :
ఇందులో ప్రధానంగా మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ దంపతులకు సంబంధించిన వీడియో ఒక సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అనంత్ అంబానీతో వీరిద్దరి సంభాషణ హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ, జుకర్‌బర్గ్, ఆయన సతీమణి ప్రిసిల్లా చాన్ ఏం మాట్లాడారంటే.. అనంత్ ధరించిన చేతి గడియారం గురించి అనమాట.. ముగ్గురి మధ్య సంభాషణ ఇలా సాగింది.. ఎప్పుడైతే ప్రిసిల్లా అనంత్ లగ్జరీవాచ్ చూశారో ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కొంటే ఇలాంటి వాచ్ కొనాల్సిందేనని మార్క్‌ను పట్టుబట్టేసింది.

Read Also : Anant Ambani Pre-Wedding : చిన్నకొడుకు అనంత్ ఎమోషనల్ స్పీచ్.. ముఖేష్ అంబానీ తీవ్ర భావోద్వేగం.. వీడియో వైరల్!

‘వావ్.. అనంత్ నీ వాచ్ చాలా అద్భుతంగా ఉంది. అనగానే.. జుకర్ బర్గ్ సైతం అవును.. నేను అదే అనంత్ తో చెప్పాను అన్నాడు.. ఎవరు తయారు చేశారు అని అడగ్గానే.. రిచర్డ్ మిల్లే అని అనంత్ చెప్పాడు. నాకు అసలు వాచ్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. కానీ, అనంత్ వాచ్ చూసిన తర్వాత నా నిర్ణయాన్ని మార్చుకోవాలని ఉందని జుకర్ బర్గ్ సమాధానమిచ్చాడు. ఆ వెంటనే ప్రిసిల్లా కూడా నాకు కూడా ఈ వాచ్ కావాలని అడిగింది.

అయితే, అనంత్ ధరించిన ఈ రిచర్డ్ మిల్లే వాచ్ ధర దాదాపు రూ. 14 కోట్లు ఉంటుందని అంచనా.. ఈ లగ్జరీ వాచ్ తయారీలో టైటానియం వంటి సెరమిక్స్ మెటీరియల్స్ వాడుతారు. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. అందుకే ఈ లగ్జరీ వాచ్‌లకు అంత క్రేజ్ అనమాట.. అనంత్ అంబానీ వాచ్ ధరించడం ఇదేం మొదటిసారి కాదు. వాస్తవానికి అంబానీ వారసుడి దగ్గర ఇప్పటికే అనేక మోడల్ లగ్జరీ వాచ్‌లు ఉన్నాయి. పటేక్ ఫిలిప్, ఆడెమర్స్ పిగెట్, రోలెక్స్, రిచర్డ్ మిల్లే వంటి బ్రాండ్‌లు ఉన్నాయి.

గాంధీ నుంచి హిట్లర్ వరకు.. ప్రతి గడియారానికో చరిత్ర.. :
గడియారాల చరిత్ర గురించి మాట్లాడుకుంటే.. వీటికో పెద్ద చరిత్రే ఉందని చెప్పాలి. ఎందరో మహానుభావులు ఈ తరహా వాచ్‌లను వినియోగించారు. అప్పటి మాజీ ప్రధాని జైలుకెళ్లడం నుంచి జాతి పితామహుడిగా గుర్తింపు పొందడం వరకు ఈ గడియారాల గురించి ఎక్కువ చరిత్రలో చర్చకు దారితీశాయి. అప్పట్లో మహాత్మాగాంధీ పాకెట్ (జెనిత్ పాకెట్ వాచ్) వాచ్ అత్యంత ప్రాచుర్యం పొందింది. టామ్ క్రూయిస్ చేతి గడియారం కూడా అంతే స్థాయిలో పాపులర్ అయింది. అనంత్ అంబానీతో పాటు అనంత్ అంబానీ, బరాక్ ఒబామా, మహాత్మా గాంధీ, అడాల్ఫ్ హిట్లర్, టామ్ క్రూజ్, ఫారెల్ విలియమ్స్, జే-జెడ్, డెంజెల్ వాషింగ్టన్, జైర్ బోల్సోనారో వంటి ప్రపంచంలోని ధనవంతులు, ప్రసిద్ధులెందరో మహానుబావులు ఇలాంటి వాచ్‌లనే ధరించి ఖ్యాతిని పొందారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ధరించిన జార్గ్ గ్రే 6500 క్రోనోమీటర్, ఫిట్‌బిట్ సర్జ్, ట్యాగ్ హ్యూయర్ సిరీస్ 1500 వాచ్ గురించి అప్పట్లో తెగ చర్చ నడిచింది. నటుడు టామ్ క్రూజ్ కూడా అత్యాధునిక గడియారాలతో ఐకానిక్ రోలెక్స్ డే-డేట్ ఖ్యాతిని పొందాడు. అదనంగా, టామ్ క్రూజ్ రెడ్ కార్పెట్ ఈవెంట్‌లు లేదా ఫిల్మ్ ప్రమోషన్‌లలో ప్రతిష్టాత్మక బ్రాండ్‌ల నుంచి స్పోర్టింగ్ వాచ్‌లను ఎక్కువగా ధరించాడు.

స్విస్ జెనిత్ వాచెస్ వెబ్‌సైట్ ప్రకారం.. మహాత్మా గాంధీ జెనిత్ పాకెట్ వాచ్‌ను భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ బహుమతిగా ఇచ్చారు. దండి మార్చ్‌లో గాంధీ వేలాది మందితో నడుస్తున్న సమయంలో ఆయన తన నడుముకు ధరించిన ఈ గడియారం అప్పట్లో మరపురాని చిత్రంగా నిలిచింది. అడాల్ఫ్ హిట్లర్ కూడా స్వదేశీ జర్మన్ వాచ్‌మేకర్ ఎ లాంగే అండ్ సోహ్నే గోల్డ్ పాకెట్ గడియారాన్ని ధరించాడు. అయితే, హిట్లర్ సమయం చూసేందుకు తన పాకెట్ గడియారాన్ని వెంట తెచ్చునేవాడట..

వ్యక్తిత్వాలనే కాదు.. ఎందరినో చిక్కుల్లో పడేశాయి :
కొన్ని సందర్భాల్లో మరికొంతమంది లెజెండ్స్ ఈ వాచ్‌ల కారణంగా అనేక ఇబ్బందుల్లో పడ్డారు. ఉదాహరణకు.. పీకేఆర్ 3.8 మిలియన్ల విలువైన గ్రాఫ్ వాచ్‌తో సహా ఖరీదైన ప్రభుత్వ బహుమతులను విక్రయించడం ద్వారా లాభపడినందుకు మాజీ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇమ్రాన్‌కి బహుమతిగా ఇచ్చిన కబా డయల్‌తో కూడిన గ్రాఫ్ వాచ్ ఇది. చివరికి ఇమ్రాన్ ఖాన్‌ను చిక్కుల్లో పడేసింది.

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో కూడా ఇలాంటి ఘటనే ఎదుర్కొన్నారు. బహుమతిగా ఇచ్చిన సౌదీ రోలెక్స్ 68వేల డాలర్ల విలువైన పాటెక్ ఫిలిప్ వాచ్‌ను విక్రయించినందుకు వివాదంలో చిక్కుకున్నాడు. గడియారాలను థర్డ్ పార్టీ యునైటెడ్ స్టేట్స్‌కు రవాణా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

స్వదేశానికి తిరిగి వచ్చిన సమీర్ వాంఖడే.. ముంబైలోని మాజీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) చీఫ్, ఆర్యన్ ఖాన్ దోపిడీ కేసుకు సంబంధించి సీబీఐ ద్వారా సమన్లు ​​పొందారు. కస్టడీలో ఉన్న సమయంలో రూ.30 లక్షల విలువైన రోలెక్స్ డేటోనా చేతి గడియారాన్ని దొంగిలించాడని ఆరోపించారు. లగ్జరీ వాచ్ కేసు సమీర్ వాంఖడే ఖ్యాతిని దెబ్బతీసింది.

ఎన్ని మొబైల్స్ వచ్చినా వాచ్‌లకు తగ్గని క్రేజ్ :
మొబైల్ రాకతో అనేక గాడ్జెట్లు కనుమరుగైపోయాయి. అందులో వాక్‌మ్యాన్, స్కానర్ లేదా కెమెరా వంటి ఇతర గాడ్జెట్లు ఒకదాని తర్వాత అదృశ్యమైపోయాయి. కానీ, వాచ్ వాడకాన్ని మాత్రం మొబైల్స్ అధిగమించలేదనే చెప్పాలి. ఇప్పటికీ వాచ్ లకు ఉన్న క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. మల్టీ టాస్కింగ్ మొబైల్ ఫోన్‌లు రావడంతో పాటు స్టాప్‌వాచ్, కెమెరా, మెయిల్, కంపాస్‌లతో సహా పదుల సంఖ్యలో ఫీచర్‌లను మొబైల్ ఫోన్‌లలో ఉన్నప్పటికీ వాచీలు ఇప్పటికీ అలానే కొనసాగుతున్నాయి. ప్రధానంగా చెప్పాలంటే.. స్మార్ట్‌ఫోన్ల కన్నా ఆపిల్ నుంచి ఫిట్‌బిట్ ఇంక్ నుంచి ఫైర్ బోల్ట్ వరకు అనేక స్మార్ట్‌వాచ్‌లు మరింత పాపులారిటీ తీసుకొచ్చాయి.

Read Also : Anant Ambani Pre Wedding : నేను అతనిలో నా తండ్రిని చూస్తున్నాను.. ముఖేశ్ అంబానీ ఎమోషనల్ స్పీచ్

ట్రెండింగ్ వార్తలు