Apple iPhone 16 Plus
Apple iPhone 16 Plus : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ ధర భారీగా తగ్గింది. మీ పాత ఐఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనకుంటే ఇదే బెస్ట్ టైమ్.. గత జనరేషన్ మోడల్ రిలయన్స్ డిజిటల్ అధికారిక వెబ్‌సైట్‌లో భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది. భారత మార్కెట్లో ఫస్ట్ రూ. 89,900కి లాంచ్ అయిన ఐఫోన్ 16 ప్లస్ ప్రీమియం డిజైన్ డ్యూయల్-కెమెరా సిస్టమ్ కలిగి ఉంది.
మీరు ఇప్పుడు రూ. 65వేల కన్నా (Apple iPhone 16 Plus) తక్కువ ధరకు ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. మీరు కూడా ఇలాంటి ఐఫోన్ కొనాలని చూస్తుంటే అసలు మిస్ చేసుకోవద్దు. ఈ డీల్ ముగిసేలోపు వెంటనే కొనేసుకోండి. ఐఫోన్ 16 ప్లస్ ధర తగ్గింపుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..
ఐఫోన్ 16 ప్లస్ డీల్ :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ రూ.89,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. రిలయన్స్ డిజిటల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఐఫోన్ 16 ప్లస్ ధర రూ.68,990కి లిస్ట్ అయింది. రూ.20,910 ఫ్లాట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. మీరు ఐడీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.4వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
Read Also : Lava Agni 4 Launch : అద్భుతమైన ఫీచర్లతో కొత్త లావా అగ్ని 4 ఫోన్ వచ్చేసింది.. ఏఐ ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
ఐఫోన్ 16 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ మోడల్ ఆపిల్ A18 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. అన్ని ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్టు ఇస్తుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఈ ఐఫోన్ 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ స్క్రీన్ కలిగి ఉంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 16 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. అలాగే, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం హ్యాండ్‌సెట్ ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా ఉంది. ఇంకా, ఐఫోన్ 16 ప్లస్ IP68 రేటింగ్‌తో వస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్ కలిగి ఉంది. టెక్ దిగ్గజం ప్రకారం.. ఈ ఐఫోన్ 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.