Apple iPhone 16 Pro
Apple iPhone 16 Pro : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 16 ప్రో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్. ఆపిల్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 16 ప్రో విజయ్ సేల్స్‌లో భారీ తగ్గింపుతో లభిస్తుంది. అదనపు బ్యాంక్ ఆఫర్‌లతో మీరు రూ. 13వేల కన్నా ఎక్కువ ఆదా చేయవచ్చు. మీరు ఐఫోన్ తగ్గింపు ధరలో కావాలంటే ఈ డీల్‌ను అసలు మిస్ చేసుకోవద్దు. ఇంతకీ ఈ ఐఫోన్ 16 ప్రో డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో డిస్కౌంట్ :
గత ఏడాదిలో విజయ్ సేల్స్‌పై ఐఫోన్ 16 ప్రో రూ.1,19,900 ధరతో లాంచ్ అయింది. కానీ, విజయ్ సేల్స్‌లో లిమిటెడ్ కాల ఆఫర్‌తో ఈ ఐఫోన్ ఇప్పుడు రూ.1,09,500కి అమ్ముడవుతోంది. అంటే.. రూ.10,400 డిస్కౌంట్ పొందవచ్చు.
అంతేకాకుండా, మీరు ఐసీఐసీఐ, HDFC, Axis లేదా Kotak బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అదనంగా రూ.3వేలు తగ్గింపు పొందవచ్చు. దాంతో ఐఫోన్ 16 ప్రో ధర రూ.1,06,500 తగ్గుతుంది. మొత్తంగా రూ.13,400 తగ్గింపు లభిస్తుంది.
ఐఫోన్ 16 ప్రో స్పెషల్ ఎందుకంటే? :
ఐఫోన్ 16 ప్రో స్పీడ్ పరంగా ఆపిల్ A18 ప్రో చిప్ ద్వారా ఆధారితమైనది. మీరు గేమింగ్, మల్టీ టాస్కింగ్ లేదా కంటెంట్ క్రియేషన్ కోసం ఈ ఐఫోన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. 6.3-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే మృదువైన స్క్రోలింగ్, క్రిస్టల్-క్లియర్ విజువల్స్ కోసం 120Hz ప్రోమోషన్‌తో వస్తుంది.
కెమెరా ప్రియుల కోసం 48MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్ వరకు అందించే 12MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఆపిల్ కొత్త కెమెరా కంట్రోల్ బటన్‌ను కూడా అందిస్తోంది.
ఐఫోన్ 16 ప్రో ఇప్పుడే కొనేసుకోండి :
కొత్త ఐఫోన్ కొనాలంటే ఇదే సరైన సమయం. మంచి డిస్కౌంట్‌తో ఐఫోన్ 16 ప్రో కొనేసుకోవచ్చు. ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్ మోడళ్లపై ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. మీరు అప్‌గ్రేడ్ ప్లాన్ చేస్తుంటే.. స్టాక్స్ అయిపోకముందే కొనేసుకోవడం బెటర్.