Apple iPhone 17 Pro Max : ఆపిల్ లవర్స్‌కు పండగే.. ఐఫోన్ 17ప్రో మ్యాక్స్ వచ్చేస్తోంది.. కెమెరా ఫీచర్లు కేక.. ధర ఎంతో తెలిసిందోచ్..!

Apple iPhone 17 Pro Max : కొత్త ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ వచ్చేస్తోంది. కెమెరా ఫీచర్లు, లాంచ్ టైమ్‌లైన్ వంటి కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Apple iPhone 17 Pro Max : ఆపిల్ లవర్స్‌కు పండగే.. ఐఫోన్ 17ప్రో మ్యాక్స్ వచ్చేస్తోంది.. కెమెరా ఫీచర్లు కేక.. ధర ఎంతో తెలిసిందోచ్..!

Apple iPhone 17 Pro Max

Updated On : April 16, 2025 / 10:44 AM IST

Apple iPhone 17 Pro Max : ఆపిల్ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఐఫోన్ 17ప్రో మ్యాక్స్ అతి త్వరలో వచ్చేస్తోంది. లేటెస్ట్ లీకుల ప్రకారం.. ఆపిల్ కొత్త ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది.

లాంచ్‌కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, లేటెస్ట్ ఐఫోన్ల గురించి అనేక పుకార్లు, లీక్‌లు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు అన్ని పుకార్లలో ఐఫోన్ 17 ప్రో మాక్స్ అత్యంత ప్రీమియం ఐఫోన్‌లలో ఒకటిగా వస్తోంది. అధికారిక లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కాలేదు. లీక్‌లు, నివేదికలను పరిశీలిస్తే.. కెమెరా అప్‌గ్రేడ్‌లు, పర్ఫార్మెన్స్, భారత్‌ అంచనా ధర గురించి కీలక వివరాలను వెల్లడించాయి.

Read Also : Airtel SIM Cards : ఎయిర్‌టెల్ బ్లింకిట్ బిగ్ డీల్.. కూరగాయలు, స్మార్ట్‌ఫోన్లే కాదు.. 10 నిమిషాల్లో ఇంటికే సిమ్ కార్డులు డెలివరీ!

ఆపిల్ ఐఫోన్ లాంచ్ విషయాన్ని పరిశీలిస్తే.. ఐఫోన్ 17 సిరీస్, ఐఫోన్ 17 ప్రో మాక్స్ సెప్టెంబర్ 2025లో లాంచ్ కావచ్చు. ఈ నెలలో మొదటి లేదా రెండవ వారంలో లాంచ్ అవుతాయని పుకార్లు సూచిస్తున్నాయి. ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఆపిల్ అత్యంత ప్రీమియం ఆఫర్‌గా లైనప్‌లో ముందుంది.

ఐఫోన్ 17 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు (అంచనా) :
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ 6.9-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. ఇప్పుడు ప్రోమోషన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్‌తో వస్తుంది. ఈసారి బ్యాక్ సైడ్ కొత్త రెక్టాంగ్యులర్ కెమెరా బార్ ఉంటుందని భావిస్తున్నారు.

పర్ఫార్మెన్స్ పరంగా, ఐఫోన్ 17 ప్రో మాక్స్ A19 ప్రో చిప్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB వరకు ర్యామ్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఇందులో కొత్త వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా ఉండవచ్చు. 35W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రావచ్చు. ఆపిల్ అభిమానులు చాలా కాలంగా ఈ అప్‌గ్రేడ్ కోసమే ఎదురుచూస్తున్నారు.

కెమెరాల విషయానికొస్తే.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ ట్రిపుల్ 48MP కెమెరా సెటప్‌తో రానున్న ఫస్ట్ ఐఫోన్ కావచ్చు. ఇందులో వైడ్, అల్ట్రా-వైడ్, 5x ఆప్టికల్ జూమ్‌తో టెట్రాప్రిజం టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. 8K వీడియో రికార్డింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుందని పుకారు ఉంది. ఆపిల్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో మొదటిది. ఫ్రంట్ సైడ్ 24MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుందని భావిస్తున్నారు.

Read Also : Vivo T4 5G Launch : వివో లవర్స్ కోసం కొత్త 5G ఫోన్.. ఈ నెల 22నే వచ్చేస్తోంది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంత ఉండొచ్చుంటే?

భారత్‌లో ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర (అంచనా) :
అధికారిక ధరపై ఇంకా ఎలాంటి ప్రకటన లేదు. కానీ, నివేదికల ప్రకారం.. భారత మార్కెట్లో ఐఫోన్ 17 ప్రో మాక్స్ బేస్ వేరియంట్ ధర దాదాపు రూ.1,49,900 నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. డిస్‌ప్లే, కెమెరా పర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్‌లతో ఐఫోన్ ప్రో మాక్స్ ప్రీమియం ధరకు వస్తుందని భావిస్తున్నారు.