Apple iPhone 17e : ఆపిల్ లవర్స్ కోసం కొత్త ఐఫోన్ రాబోతుంది. 2026 కొత్త ఏడాదిలో ఆపిల్ ఐఫోన్ 17e సరసమైన వేరియంట్ లాంచ్ కానుంది. తక్కువ ధరకే పవర్‌ఫుల్ ఫీచర్లతో రానుంది. ఇందులో 48MP బ్యాక్ కెమెరా, 18MP ఫ్రంట్ కెమెరా, 6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండవచ్చు.
2/6
వచ్చే ఏడాదిలో ఆపిల్ నుంచి రాబోయే ఫస్ట్ ఐఫోన్ ఇదే కానుంది. ఆపిల్ ఇ వేరియంట్ అనేది సరసమైన ఫోన్. గత కొన్ని రోజులుగా రాబోయే ఐఫోన్ 17e మోడల్ గురించి అనేక లీక్‌లు బయటకు వస్తున్నాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి..
3/6
భారత్, దుబాయ్, అమెరికాలో ఐఫోన్ 17e ధర, లాంచ్ తేదీ : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 17e దాదాపు రూ. 65వేల ధరతో లాంచ్ కావచ్చు. అమెరికాలో దాదాపు 599 డాలర్లు లేదా 649 డాలర్ల ధరకు ఈ ఐఫోన్ 17e లాంచ్ అవుతుంది. దుబాయ్ విషయానికొస్తే.. ఈ ఐఫోన్ 17e మోడల్ AED 2,379 ధరకు లాంచ్ కావచ్చు. లాంచ్ విండో విషయానికి వస్తే.. ఈ ఐఫోన్ 2026 ఫిబ్రవరి చివరి నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని ఊహాగానాలు వస్తున్నాయి.
4/6
ఐఫోన్ 17e కెమెరా, స్పెసిఫికేషన్లు : ఆపిల్ ఐఫోన్ 17e మోడల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 48MP సెంటర్ స్టేజ్ బ్యాక్ కెమెరాతో రానుంది. సింగిల్ కెమెరా డ్యూయల్, ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో రానుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 18MP స్నాపర్‌ను తీసుకురావొచ్చు.
5/6
ఆపిల్ ఐఫోన్ 17e మోడల్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లే కలిగి ఉంది. 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఆపిల్ A19 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.
6/6
ఈ ఐఫోన్ 4005mAh బ్యాటరీతో వస్తుందని పుకార్లు సూచిస్తున్నాయి. ఈ ఐఫోన్‌కు సంబంధించిన లేటెస్ట్ లీక్‌లపై మ్యాగ్‌సేఫ్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుందని సూచిస్తున్నాయి. ఐఫోన్ 16e మోడల్‌లో ఈ ఫీచర్ లేదు.