Apple Jobs in India : భారత్‌లో లక్షకు పైగా ఆపిల్ ఉద్యోగాలు.. 72 శాతం మంది మహిళలే.. ఎందుకో తెలుసా?

Apple Jobs in India : ఆపిల్ గత రెండేళ్లలో భారత మార్కెట్లో ఐఫోన్ల తయారీ (Apple iphones) ని 7 శాతం పెంచింది. భారత్‌లో లక్షకు పైగా ఉద్యోగాలను సృష్టించింది. అందులో 72శాతం మంది మహిళలే ఉన్నారు. మహిళలకే ఎక్కువ శాతం ఉద్యోగాలు ఎందుకు ఇచ్చిందంటే?

Apple Jobs in India : ప్రముఖ కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) భారత మార్కెట్లో తమ మార్కెట్‌ను క్రమంగా విస్తరిస్తోంది. ఆపిల్‌కు అతిపెద్ద మార్కెట్ అయిన భారత్‌లో ఇప్పటికే అనేక సొంత ప్రొడక్టులతో పాటు సర్వీసులను అందిస్తున్న ఐకానిక్ కంపెనీ పెద్ద సంఖ్యలోనే ఉపాధి కూడా కల్పిస్తోంది. ఇప్పటివరకూ భారత్‌లో ఆపిల్ లక్షకు పైగా ఉద్యోగాలను సృష్టించింది. అయితే, వారిలో 72 శాతం మంది మహిళలే ఉన్నారు. ఆపిల్ మార్కెట్ విస్తరణలో భాగంగా ఎక్కువగా కొత్త ప్రాంతాలపైనే కంపెనీ ఫోకస్ పెడుతుంది. అందులో భాగంగానే భారత్‌ను ఆపిల్ ప్రొడక్టులకు సరైన మార్కెట్‌గా ఎంచుకుంది.

టెక్ దిగ్గజం ఈ ఏడాది చివరిలో అనేక ఐఫోన్ 15 మోడళ్లను అందించాలని యోచిస్తోందని ఇటీవల నివేదిక తెలిపింది. గత రెండేళ్లలో కంపెనీ తన ఐఫోన్‌ల తయారీని భారత మార్కెట్లో 7 శాతం పెంచేసింది. తద్వారా లక్షకు పైగా ఉద్యోగాలను ఆపిల్ క్రియేట్ చేసిందని రాష్ట్ర, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆపిల్ ఉద్యోగాలు ఇచ్చిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని మంత్రి రాజీవ్ చెప్పారు. ఆపిల్ ఉద్యోగుల్లో 19ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల్లో 72 శాతం మంది కంపెనీలో పనిచేస్తున్నారు.

తమ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడానికి ఇలాంటి ఉద్యోగాలు చేస్తూ ఇప్పుడిప్పుడే కెరీర్ ప్రారంభించి నైపుణ్యాలను మహిళలు మెరుగుపరుచుకుంటున్నారని తెలిపారు. గత రెండు ఏళ్లలో భారత్‌లోని ఆపిల్‌ ఉద్యోగుల్లో ప్రతి వంద మందిలో 72 మంది మహిళలే ఉన్నారు. ఆపిల్ ఇచ్చిన ఉద్యోగాలు ఎక్కువగా తయారీ విభాగంలోనే ఉన్నాయి. మహిళల్లో యువతులకే ఆపిల్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. తద్వారా భారత్‌లోని మహిళలకు ఉపాధి కల్పించిన అతిపెద్ద బ్రాండ్‌గా ఆపిల్ కంపెనీ అవతరించింది.

Read Also : Old Apple Computer : ఆపిల్ అభిమాని అంటే.. ఇట్లుంటది మరి.. ముంబై స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్‌కు 1984 ఆపిల్ కంప్యూటర్‌ను తీసుకొచ్చాడు..!

ఫస్ట్ టైం ఉద్యోగంలో చేరినవారే ఎక్కువ..  :

ఆపిల్ భారత మార్కెట్లో తన ఐఫోన్‌ల మార్కెట్‌పై ఫాక్స్‌కాన్ (Foxconn), పెగాట్రాన్ (Pegatron), విస్ట్రాన్ (Wistron) అనే ముగ్గురు డీలర్లను కలిగి ఉంది. ఈ మూడింటిలో, ఫాక్స్‌కాన్ దాదాపు 30వేల మంది మహిళలను ఉద్యోగులుగా నియమించింది. Tata, Jabil, Avery, Salcomp వంటి Apple పర్యావరణ వ్యవస్థకు సంబంధించిన కాంపోనెంట్ సరఫరాదారులు కూడా అనేక మంది మహిళలకు ఉద్యోగాలు కల్పించారు. మరో 7వేల మంది కార్మికులలో జాబిల్ 4,200 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు.

Apple Jobs in India _ Apple created 1 lakh jobs in India, 72 percent are women workers

చాలా మంది మహిళల సగటు వయస్సు 21 ఏళ్లు ఉండగా, ఎక్కువ మంది ఫస్ట్ టైం ఉద్యోగంలో చేరినవారే ఉన్నారు. అంటే.. ఇప్పటివరకూ ఎలాంటి ఉద్యోగ అనుభవం లేని మహిళల్లో ప్రెషర్లకే ఆపిల్ అవకాశం ఇచ్చింది. ఆపిల్ ఇచ్చిన లక్ష ఉద్యోగాల్లో ఎక్కువ మంది ఇంటర్ చదివిన వారే ఉన్నారు. డిప్లొమా పూర్తి చేసినవాళ్లు కొందరు ఉండగా.. వీరిలో ఎక్కువ మందిని ఐఫోన్ అసెంబ్లింగ్ చేయడానికి నియమించింది.

2025 నాటికి భారత్‌లో 25 శాతం ఐఫోన్ తయారీని ప్రారంభించాలని ఆపిల్ యోచిస్తోందని బ్లూమ్‌బెర్గ్ ఇటీవల నివేదించింది. 2021లో 1 శాతం ఉండగా.. ప్రస్తుత సంఖ్య 7 శాతానికి పెరిగింది. ఎందుకంటే.. ఆపిల్ తమ ప్రొడక్టు రేటును మూడు రెట్లు పెంచింది. గత కొన్నిఏళ్లలో భారత్, చైనా మోడల్స్‌తో సమానంగా 2023 ఐఫోన్‌లు భారత్ నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆపిల్ విక్రయదారులు సైతం.. ఇప్పటివరకు భారత మార్కెట్లో దాదాపు 60వేల మంది కార్మికులను కలిగి ఉన్నారని ఓ నివేదిక తెలిపింది.

ఐఫోన్ 11, ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఎయిర్‌పాడ్‌లతో సహా అనేక డివైజ్‌లను ఆపిల్ భారత‌లోనే తయారు చేస్తోంది. అంతేకాకుండా, టాటా సన్స్ బెంగళూరుకు సమీపంలో ఉన్న తైవానీస్ సంస్థ విస్ట్రాన్ ప్రస్తుత ప్లాంట్‌ను కొనుగోలు చేయనుంది. భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా ఆపిల్ డివైజ్‌లకు మొదటి స్వదేశీ ఉత్పత్తి సంస్థగా మారుతుంది. ఈ క్రమంలోనే ఆపిల్ దాదాపు రూ.5వేల కోట్లకు టాటా సన్స్‌తో డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం.

Read Also : Apple Delhi Store : ఏప్రిల్ 20న ఆపిల్ రెండో రిటైల్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. ఢిల్లీ స్టోర్ ప్రత్యేకతలివే..!

ట్రెండింగ్ వార్తలు