Apple Delhi Store : ఏప్రిల్ 20న ఆపిల్ రెండో రిటైల్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. ఢిల్లీ స్టోర్ ప్రత్యేకతలివే..!

Apple Delhi Store : టెక్ దిగ్గజం ఆపిల్ రెండో రిటైల్ స్టోర్ ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఏప్రిల్ 20న (గురువారం) ఉదయం 10 గంటలకు కంపెనీ సీఈఓ టిమ్ కుక్ చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరుగనుంది. ఢిల్లీ స్టోర్ ప్రత్యేకతలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Apple Delhi Store : ఏప్రిల్ 20న ఆపిల్ రెండో రిటైల్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. ఢిల్లీ స్టోర్ ప్రత్యేకతలివే..!

Apple Delhi Store _ Key things to know about Apple's second retail store in Delhi

Apple Delhi Store : ప్రముఖ కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) భారత మార్కెట్లో మార్కెట్‌ను విస్తరిస్తోంది. ఇప్పటికే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తన మొదటి రిటైల్ స్టోర్‌ (Apple BKC Store)ను ప్రారంభించిన తర్వాత.. ఇప్పుడు దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆపిల్ రెండో రిటైల్ స్టోర్‌ను ప్రారంభించేందుకు రెడీగా ఉంది. ఏప్రిల్ 20న గురువారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని సాకేత్‌లోని సెలెక్ట్ సిటీవాక్‌లో ఆపిల్ రెండో రిటైల్ స్టోర్ ప్రారంభించనుంది. ముంబై స్టోర్ (Apple BKC) మాదిరిగానే కంపెనీ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) అక్కడికి వచ్చే కస్టమర్‌లకు స్వాగతం పలకనున్నారు.

ఆపిల్ ఢిల్లీ స్టోర్ ప్రారంభానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ‘హలో న్యూఢిల్లీ’.. అంటూ ఢిల్లీలో ఫస్ట్ ఆపిల్ స్టోర్‌కు ఓపెన్ చేస్తున్నామని ప్రకటించింది. ఆపిల్ సాకేత్‌కు ఎలాంటి కలర్‌ఫుల్ క్రియేటివిటీని తీసుకువస్తారో చూసేందుకు ఆసక్తిగా ఉన్నామని ఆపిల్ వెబ్‌సైట్‌లో పేర్కొంది. (Apple Saket) స్టోర్ చుట్టూ ప్రత్యేకంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఆపిల్ ద్వారా ప్రత్యేకమైన వాల్‌పేపర్ రూపొందించింది. అదనంగా, న్యూఢిల్లీలోని ఆపిల్ కస్టమర్ల కోసం ప్రత్యేక ప్లేలిస్ట్ కూడా అందిస్తోంది. (Apple Music)లో యాక్సెస్ చేయవచ్చు.

Apple Delhi Store _ Key things to know about Apple's second retail store in Delhi

Apple Delhi Store _ Key things to know about Apple’s second retail store in Delhi

స్టోర్ల నిర్మాణం జరిగిందిలా..
దాదాపు మూడు ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. ఆపిల్ కంపెనీ యాజమాన్యంలోని ఆపిల్ స్టోర్ భారత మార్కెట్లో ప్రారంభమైంది. దేశంలో ఆపిల్ స్టోర్లను ఏర్పాటు చేయడం ద్వారా కంపెనీ మార్కెట్ మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్‌ను 2020లో భారత మార్కెట్లో ప్రారంభించినప్పటికీ.. అప్పటి నుంచి సడలించిన ముందస్తు పెట్టుబడి నిబంధనలు, మహమ్మారి సంబంధిత ఆలస్యం కారణంగా ఇంకా ఎలాంటి ఫిజికల్ స్టోర్లను ఆపిల్ ఓపెన్ చేయలేదు. ముంబైలోని ఆపిల్ స్టోర్ జియో వరల్డ్ డ్రైవ్ మాల్‌ (Jio World Drive Mall)లో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత పర్యావరణపరంగా స్థిరమైన ఆపిల్ స్టోర్ స్థానాల్లో Apple BKC స్టోర్ ఒకటిగా నిలిచింది.

Read Also : Apple Retail Stores : భారత్‌లో ఫస్ట్ ఆపిల్ రిటైల్ స్టోర్లు.. ముంబై కన్నా ఢిల్లీ స్టోర్ చాలా చిన్నదట.. నెలకు ఎంత అద్దె కడుతుందో తెలిస్తే షాకవుతారు..!

ఎందుకంటే.. ఈ ముంబై స్టోర్ ప్రత్యేకమైన సోలార్ శ్రేణిని కలిగి ఉంది. అంతేకాదు.. ఈ స్టోర్ కార్యకలాపాల కోసం శిలాజ ఇంధనాలపై ఆధారపడకుండా పూర్తిగా పునరుత్పాదక శక్తితో పనిచేస్తుంది. ఫలితంగా ఈ స్టోర్ కార్యాచరణ కార్బన్-న్యూట్రల్ ద్వారా జరుగుతుంది. ఈ ముంబై స్టోర్‌ నిర్మాణానికి సంబంధించి వాడిన కలప చేతితో చేసినది. స్టోర్ పైకప్పులు 1,000 టైల్స్‌తో తయారు చేశారు. ఒక్కొక్కటి 31 మాడ్యూల్స్‌తో రూపొందించారు. ఒక్కో మాడ్యూల్‌ను రూపొందించడానికి 408 కలప ముక్కలను ఉపయోగించారు. స్టోర్‌లో ఆకట్టుకునే సీలింగ్‌కు 450,000 కలపను వినియోగించారు. ఇవన్నీ ఢిల్లీలోనే అసెంబుల్ చేసినట్టు నివేదిక తెలిపింది.

ఆపిల్ సాకెత్ ఢిల్లీలోని స్టోర్ మరిన్ని ప్రత్యేకతలివే.. :

బిగ్ ఆపిల్ టీమ్ :
ఆపిల్ సాకెత్‌లో 70 మందికి పైగా అధిక నైపుణ్యం కలిగిన సభ్యులు ఉంటారు. కస్టమర్లు ఆపిల్ ప్రొడక్టులను కొనుగోలు చేసే ముందు వారికి వీరంతా గైడెన్స్ అందిస్తారు. వీరంతా 15 భాషల వరకు మాట్లాడగలరు.

జీనియస్ బార్ : ఆపిల్ సాకెత్‌లో కస్టమర్‌లు టెక్నికల్, హార్డ్‌వేర్ సపోర్టు కోసం నిపుణులతో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. డివైజ్ సెటప్ చేసేందుకు ఆపిల్ IDని రిస్టోర్ చేయడానికి (AppleCare) ప్లాన్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే సబ్‌స్క్రిప్షన్‌లను ఎడిట్ చేయడానికి సంబంధించిన కస్టమర్ కేర్ హెల్ప్ పొందవచ్చు.

Apple Delhi Store _ Key things to know about Apple's second retail store in Delhi

Apple Delhi Store _ Key things to know about Apple’s second retail store in Delhi

ఆపిల్ పికప్ :
BKC స్టోర్‌ మాదిరిగానే ఆపిల్ కస్టమర్‌లు నచ్చిన డివైజ్ ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కొనుగోలు లావాదేవీని పూర్తి చేసిన తర్వాత ఆపిల్ సాకెత్ స్టోర్ నుంచి కస్టమర్లకు అనుకూలమైన సమయంలో కొనుగోలు చేసిన ఆపిల్ ప్రొడక్టు పికప్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఆపిల్ ఢిల్లీ స్టోర్ వద్ద ఆసక్తి గల కస్టమర్‌లు డివైజ్ సామర్థ్యాల గురించి తెలుసుకోవాలంటే.. ‘Today At Apple‘ సెషన్‌కు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే బెస్ట్ డివైజ్ పొందడానికి నిపుణులతో ఇంటరాక్ట్ కావొచ్చు. Apple iPhone, Apple Watch, Mac, iPadలో అనేక సెషన్‌లను షెడ్యూల్ చేసింది.

ఆపిల్ డివైజ్‌తో కస్టమర్లు సొంత ఎమోజీని ఎలా తయారు చేయాలనే దానిపై ప్రత్యేక ‘Art Lab for Kids’ కూడా ఉంది. అయితే తేదీలు ఇంకా ప్రకటించలేదు. ఆసక్తి గల కస్టమర్‌లు టైమ్ వివరాల కోసం ఆపిల్ వెబ్‌సైట్‌ విజిట్ చేయొచ్చు. ఈరోజు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. లొకేషన్ India >> Delhi >> Apple Saketకి సెట్ చేసుకోవాలి.

ముంబై స్టోర్ కన్నా ఢిల్లీ స్టోర్ చాలా చిన్నది.. అద్దె మాత్రం సేమ్ :

ఇదిలా ఉంటే, ముంబైలోని (Apple BKC) స్టోర్, రాబోయే ఢిల్లీ స్టోర్ అద్దె దాదాపు ఒకే విధంగా ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఢిల్లీ స్టోర్‌కు నెలకు రూ. 40 లక్షలు, ముంబై స్టోర్‌కు నెలకు రూ. 42 లక్షల అద్దె ఉంటుందని నివేదిక సూచిస్తుంది. అయితే, ఢిల్లీ స్టోర్ ముంబై స్టోర్ కన్నా చాలా చిన్నది. రెండు స్టోర్ల అద్దె దాదాపు ఒకేలా ఉంటుంది.

CRE మ్యాట్రిక్స్ ద్వారా ఢిల్లీలోని ఒక స్టోర్‌కు లీజు దస్తావేజులోని డాక్యుమెంట్లు లీక్ చేసిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ స్టోర్ పదేళ్ల లీజు వచ్చే ఏడాది రెన్యువల్‌కు సిద్ధంగా ఉందని నివేదిక తెలిపింది. ఆపిల్, సెలెక్ట్ ఇన్‌ఫ్రా జూలై 18న లీజు డీడ్‌పై సంతకం చేశాయని నివేదిక పేర్కొంది.

Read Also : Apple First Store In India : ముంబైలో ఆపిల్ ఫిజికల్ రిటైల్ స్టోర్ ప్రారంభించిన టిమ్ కుక్.. కస్టమర్లకు గ్రాండ్ వెల్‌కమ్..!