Apple MacBook Air M4
Apple MacBook Air M4 : కొత్త ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2025 సందర్భంగా కొత్త ఆపిల్ మ్యాక్‌బుక్ అతి తక్కువ ధరకే (Apple MacBook Air M4) సొంతం చేసుకోవచ్చు. మీరు కూడా ఇలాంటి మ్యాక్‌బుక్ అప్‌గ్రేడ్ కోసం చూస్తుంటే ఈ అద్భుతమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.
ఆకర్షణీయమైన పర్ఫార్మెన్స్, డిజైన్ పరంగా ఆకట్టుకునేలా ఉంటుంది. ఆపిల్ లేటెస్ట్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ల్యాప్‌టాప్ కొనుగోలుపై అత్యుత్తమ డీల్స్ ఇదొకటి. అమెజాన్ ఇండిపెండెన్స్ సేల్ సందర్భంగా ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 కు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 డీల్ :
అమెజాన్ సేల్ సమయంలో 13-అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్ M4 (16GB ర్యామ్, 256GB SSD) ఇప్పుడు రూ. 90,900కు లిస్ట్ అయింది. అసలు లాంచ్ ధర రూ. 99,900 నుంచి తగ్గింపు పొందింది. మీరు SBI క్రెడిట్ కార్డ్ యూజర్ అయితే ఇన్‌స్టంట్‌గా రూ. 3వేలు డిస్కౌంట్ పొందవచ్చు.
తద్వారా ధర రూ. 87,900కి చేరుకుంటుంది. మొత్తం రూ. 12వేలు ఆదా అవుతుంది. ప్రస్తుతం మ్యాక్‌బుక్ ఎయిర్ M4 డీల్స్ ఒకటి. ప్రత్యేకించి ఇతర ప్లాట్‌ఫారమ్‌లు, ఆపిల్ అధికారిక సైట్లలో కన్నా తగ్గింపు ధరకే లభిస్తోంది.
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 స్పెసిఫికేషన్లు :
కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ఆపిల్ లేటెస్ట్ M4 చిప్‌తో పవర్ అందిస్తుంది. గత మోడల్ మ్యాక్‌బుక్ M3 కన్నా పర్ఫార్మెన్స్, పవర్ అప్‌గ్రేడ్ అందిస్తుంది. 16GB ర్యామ్ కలిగి ఉంది. భారతీయ యూజర్ల కోసం రూపొందించిన లేటెస్ట్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో (macOS Sequoia) రన్ అవుతుంది.