Ather Rizta Scooter : టీవీఎస్, ఓలా, బజాజ్, హీరోకు పోటీగా.. సరసమైన ధరకే కొత్త ఏథర్ రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్.. 160కి.మీ రేంజ్..!

Ather Rizta Scooter : ఏథర్ రెజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.9kWh, 3.7kWh బ్యాటరీ ఆప్షన్‌లతో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఏ వేరియంట్ ధర ఎంతంటే?

Ather Rizta Scooter : టీవీఎస్, ఓలా, బజాజ్, హీరోకు పోటీగా.. సరసమైన ధరకే కొత్త ఏథర్ రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్.. 160కి.మీ రేంజ్..!

Ather new affordable family electric scooter with 160km range

Ather Rizta Scooter : ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు ఏథర్ ఎనర్జీ కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ రిజ్టాను లాంచ్ చేసింది. భారత మార్కెట్లో రూ. 1.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ప్రవేశపెట్టింది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్‌తో 160కిమీల వరకు ప్రయాణించగలదు. అయితే, ఏథర్ రిజ్టా స్కూటర్.. ఓలా S1 ఎయిర్, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, హీరో విడా V1తో పోటీగా మార్కెట్లోకి వచ్చింది. ఏథర్ రెజ్టా ఈవీ స్కూటర్ మొత్తం 2 వేరియంట్‌లను కలిగి ఉంది.

అందులో S, Z, S 2.9kWh బ్యాటరీని కలిగి ఉన్నాయి. అయితే, Z వేరియంట్‌లో 2.9kWh, 3.7kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. 2.9kWh ట్రిమ్‌లు 123కిలోమీటర్ల ప్రయాణించే ఐడీసీ పరిధిని కలిగి ఉన్నాయి. 3.7kWh ట్రిమ్ ఒక్కసారి ఫుల్ఛార్జ్‌తో 160కిమీ వరకు దూసుకెళ్లగలదని కంపెనీ వెల్లడించింది.

Read Also : Apple iPhone 15 Pro : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15 ప్రోపై భారీగా తగ్గింపు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

గంటకు 80కిలోమీటర్ల టాప్ స్పీడ్ :
ఏథర్ ఎనర్జీ రిజ్టా అన్ని వేరియంట్‌లు గరిష్టంగా గంటకు 80కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. జిప్, స్మార్ట్‌ఎకో అనే రెండు రైడింగ్ మోడ్‌లతో వస్తాయి. అంతేకాకుండా, ఏథర్ 450 సిరీస్‌లో ఉన్న మ్యాజిక్‌ట్విస్ట్, ఆటోహోల్డ్, రివర్స్ మోడ్ వంటి రైడ్ అసిస్ట్ ఫీచర్‌లు కూడా అథర్ రిజ్టాతో అందుబాటులో ఉన్నాయి.

Ather new affordable family electric scooter with 160km range

Ather affordable scooter

ఏథర్ రిజ్టా S వేరియంట్ మూడు మోనోటోన్ కలర్ ఆప్షన్లలో అందిస్తుంది. రిజ్టా Z అనే వేరియంట్ 3 మోనోటోన్, 4 డ్యూల్టోన్‌తో సహా మొత్తం 7 కలర్ ఆప్షన్లను కలిగి ఉంది. కంపెనీ జూన్ 2024 నుంచి రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌లను కొనుగోలుదారులకు డెలివరీ చేయనుంది. వేరియంట్ వారీగా ఏథర్ రిజ్టా ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కింది విధంగా ఉన్నాయి.

  • రిజ్టా S 2.9kWh బ్యాటరీ – రూ. 1.10 లక్షలు
  • రిజ్టా Z 2.9kWh బ్యాటరీ – రూ. 1.25 లక్షలు
  • రిజ్టా Z 3.7kWh బ్యాటరీ – రూ. 1.45 లక్షలు

ఏథర్ ఐదేళ్ల బ్యాటరీ ప్రొటెక్ట్ ప్రొగ్రామ్ :
ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ప్రామాణిక ఐదేళ్ల వారంటీ ప్రోగ్రామ్ కింద ‘ఏథర్ బ్యాటరీ ప్రొటెక్ట్’ లభిస్తుంది. బ్యాటరీ వారంటీని 5 ఏళ్లు లేదా 60వేల కి.మీలకు పొడిగిస్తుంది. ఈ వారంటీ ప్రోగ్రామ్ బ్యాటరీ వైఫల్యాలను కవర్ చేయడమే కాకుండా 5 ఏళ్ల చివరిలో బ్యాటరీకి కనీసం 70శాతం హెల్త్ స్టేటస్ గ్యారంటీ ఇస్తుంది.

Ather new affordable family electric scooter with 160km range

Ather family electric scooter

హోమ్ ఛార్జింగ్ విషయానికి వస్తే.. 2.9kWh బ్యాటరీతో రిజ్టా S, రిజ్టా Z వేరియంట్లు 350డబ్ల్యూ ఏథర్ పోర్టబుల్ ఛార్జర్‌తో వస్తాయి. 3.7kWh బ్యాటరీతో కూడిన టాప్-ఎండ్ రిజ్టా Z వేరియంట్ 700డబ్ల్యూ కొత్త ఏథర్ డ్యూయో ఛార్జర్‌ను అందిస్తుంది. రిజ్టా కొనగోలుదారులు 1,800+ ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్‌లతో ఏథర్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌కు కూడా యాక్సెస్‌ను పొందవచ్చు.

ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఛార్జ్ చేయొచ్చు :
ఏథర్ రిజ్టా అతిపెద్ద సీటును కలిగి ఉంది. 34-లీటర్ అండర్ సీట్ కెపాసిటీ, ఆప్షనల్ 22-లీటర్ ఫ్రంక్‌తో సహా 56 లీటర్ల స్టోరేజీ స్పేస్ ఆకట్టుకునేలా ఉంది. రిజ్టా Z వేరియంట్ మెరుగైన పిలియన్ సౌకర్యం కోసం బ్యాక్‌రెస్ట్‌ను కలిగి ఉంది. అండర్-సీట్ స్టోరేజ్‌ను 18డబ్ల్యూ పవర్ అవుట్‌పుట్‌తో ఆప్షనల్ మల్టీ బెనిఫిట్ ఛార్జర్‌తో కూడా అమర్చవచ్చు. మీ ఫోన్‌లు, టాబ్లెట్‌లు, పోర్టబుల్ స్పీకర్‌ల వంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌లను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.

ఆకర్షణీయమైన సెక్యూరిటీ ఫీచర్లు :
ఏథర్ రిజ్టాతో స్కిడ్‌కంట్రోల్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. కంకర, ఇసుక, నీరు లేదా నూనెతో కూడిన రహదారి పాచెస్ వంటి తక్కువ రాపిడి ఉపరితలాలపై వేగవంతంగా వెళ్లగలదు. మోటార్ టార్క్‌ను నియంత్రించే కంపెనీ యాజమాన్య ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంది. ఫాల్‌సేఫ్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, దొంగతనం, టో డిటెక్ట్, ఫైండ్ మై స్కూటర్ వంటి అదనపు భద్రతా ఫీచర్‌లు ఉన్నాయి. ఈ బెల్స్, విజిల్స్ ఏథర్ 450 సిరీస్‌తో కూడా అందుబాటులో ఉన్నాయి.

Ather new affordable family electric scooter with 160km range

family electric scooter

వాట్సాప్ డ్యాష్‌బోర్డ్ ఫీచర్ :
ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో వాట్సాప్ డ్యాష్‌బోర్డ్ ఫీచర్ కూడా ఉంది. స్కూటర్ ఆగిపోయినప్పుడు రైడర్‌లు డ్యాష్‌బోర్డ్‌లో వారి లేటెస్ట్ మెసేజ్‌లను చదవడానికి అనుమతిస్తుంది. కొత్త ‘పింగ్ మై స్కూటర్ ఫీచర్’ కొత్త ఏథర్ యాప్‌లో యాక్టివేట్ చేసుకోవచ్చు. తద్వారా ఆడియో, విజువల్ క్యూస్ సాయంతో తమ స్కూటర్‌ను కనుగొనే సామర్థ్యాన్ని ఏథర్ యజమానులకు అందిస్తుంది. ఏథర్‌స్టాక్ (AtherStack 6.0)లో మరో కొత్త ఫీచర్ అలెక్సా స్మార్ట్ అసిస్టెంట్ ఇంటిగ్రేషన్ కూడా కలిగి ఉంది. ఇంగ్లీష్, హిందీ రెండింటిలోనూ 50 ప్రాంప్ట్‌లతో అందుబాటులో ఉంది.

Read Also : Apple iPhone 13 : ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇంతకీ, ఈ ఐఫోన్ కొనాలా? వద్దా? పూర్తి వివరాలివే!