Apple iPhone 13 : ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇంతకీ, ఈ ఐఫోన్ కొనాలా? వద్దా? పూర్తి వివరాలివే!

Apple iPhone 13 : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 13పై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్ ఎందుకు కొనాలంటే?

Apple iPhone 13 : ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇంతకీ, ఈ ఐఫోన్ కొనాలా? వద్దా? పూర్తి వివరాలివే!

Apple iPhone 13 available at a discount on Amazon and Flipkart

Apple iPhone 13 : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. రెండు సంవత్సరాల క్రితమే ఈ ఐఫోన్ లాంచ్ కాగా.. ఐఫోన్ 12కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం, ఐఫోన్ 13 అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండింటిలోనూ తగ్గింపుతో అందుబాటులో ఉంది. మీరు ఐఫోన్ 13 తక్కువ ధరకే ఎలా కొనుగోలు చేయొచ్చు అనేది పూర్తివివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : iPhone 16 Pro Leak : ఆపిల్ లవర్స్‌కు ఇంట్రెస్టింగ్ న్యూస్.. ఐఫోన్ 16ప్రో కలర్ ఆప్షన్లు లీక్, క్యాప్చర్ బటన్ లొకేషన్ తెలిసిందోచ్!

ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ తర్వాత ఐఫోన్ 13 ధర రూ. 52,999కు పొందవచ్చు. అమెజాన్‌లో ఐఫోన్ పింక్ కలర్ ఆప్షన్ ధర రూ.52,990కు లభిస్తుంది. ఇప్పుడు, అమెజాన్ ఐఫోన్‌ను తక్కువ ధరకు విక్రయిస్తుంది. ఐఫోన్‌ 13 ఈఎంఐలో కొనుగోలు చేస్తుంటే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 6 నెలల నుంచి 9 నెలల కాలవ్యవధిపై రూ. 2,500 తగ్గింపును పొందవచ్చు.

మరోవైపు, మీ ఈఎంఐ లావాదేవీ వ్యవధి 12 నెలలు అయితే, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌పై రూ. 3,500 తగ్గింపు పొందవచ్చు. కొన్ని ఇతర ఆఫర్‌లు కూడా ఉన్నాయి. మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఏ ఆఫర్‌ను పొందలేకపోతే.. అమెజాన్‌లో ఇదే ఐఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. మీరు ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్‌కు మారాలనుకుంటే రూ. 1,200 తగ్గింపు పొందవచ్చు.

స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే.. ఐఫోన్ 13 మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2532 x 1170 పిక్సెల్‌ల రిజల్యూషన్, 460పీపీఐ పిక్సెల్ డెన్సిటీని అందిస్తోంది. హుడ్ కింద ఎ15 బయోనిక్ 5ఎన్ఎమ్ హెక్సా-కోర్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజీ ఆప్షన్లలో వస్తుంది.

బాక్స్ వెలుపల ఐఓఎస్ 15లో రన్ అవుతోంది. కెమెరా సెటప్‌లో 12ఎంపీ ప్రైమరీ కెమెరా, బ్యాక్ సైడ్ 12ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో వస్తుంది. అయితే సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఫ్రంట్ సైడ్ 12ఎంపీ లెన్స్ ఉంది. ఆపిల్ బ్యాటరీ ప్రత్యేకతలను వెల్లడించలేదు. 20డబ్ల్యూ వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 3240ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది.

Read Also : Apple iPhone 15 Pro : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15 ప్రోపై భారీగా తగ్గింపు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!