ATM Fee : ఛార్జీల మోత.. ఏటీఎం నుంచి డబ్బులు తీస్తే బాదుడే.. మే నుంచి కొత్త రూల్..

గతంలో జూన్ 2021లో ఇంటర్‌చేంజ్ రుసుమును ఆర్బీఐ సవరించింది.

ATM Fee : ఏటీఎం కార్డు ఉంది కదా అని అదే పనిగా ఏటీఎంకి వెళ్లి డబ్బులు డ్రా చేస్తున్నారా? అయితే మీ జేబులు గుల్ల కావడం ఖాయం. అవును.. ఏటీఎం నుంచి డబ్బు విత్ డ్రా మరింత భారం కానుంది. ఛార్జీల మోత మోగనుంది. ఇకపై లిమిట్ దాటి డబ్బు విత్ డ్రా చేస్తే ఇంటర్ ఛేంజ్ ఛార్జీలు ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. ఏటీఎం లావాదేవీ ఛార్జీలను ఆర్బీఐ పెంచడమే ఇందుకు కారణం.

ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు పెంచుకునేందుకు బ్యాంకులకు ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చింది. దీంతో ఛార్జీలు పెరగనున్నాయి. ఏటీఎం లావాదేవీలు నిర్ణీత పరిమితి మించితే, ప్రతి లావాదేవీకి ఖాతాదారులు అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రీ లిమిట్ దాటాక ఒక్కో ట్రాన్సాక్షన్ పై రూ.23 చొప్పున వసూలు చేసుకునేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది ఆర్బీఐ. మే 1 నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి వస్తాయి.

సాధారణంగా కస్టమర్లకు ఒక నెలలో సొంత బ్యాంకు ఏటీఎం నుంచి 5 ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఫ్రీ. వేరే బ్యాంక్ ఏటీఎం ఉపయోగిస్తుంటే, మెట్రో నగరాల్లో నెలలో గరిష్టంగా 3 ఉచిత లావాదేవీలు, మెట్రోయేతర నగరాల్లో గరిష్టంగా 5 ఉచిత లావాదేవీలు చేయవచ్చు. ఉచిత లావాదేవీల పరిమితిని దాటాక ప్రతి లావాదేవీకి రూ.23 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఛార్జీ 21 రూపాయలుగా ఉంది.

Also Read : చూస్తే దిమ్మతిరిగిపోయేంత పసిడి.. భారత్‌లోని ఈ రాష్ట్రంలో బంగారం నిక్షేపాలు గుర్తింపు

అకౌంట్ ఉన్న సొంత బ్యాంకు ఏటీఎం కాకుండా ఇతర బ్యాంకు ఏటీఎంలు ఉపయోగిస్తే ఈ ఛార్జీలు వర్తిస్తాయి. పెంచిన ఛార్జీలను ఇంటర్ ఛేంజ్ ఛార్జీలు అంటారు. మే 1 నుండి కస్టమర్లు తమ ఖాతా ఉన్న బ్యాంక్ నెట్‌వర్క్ కాకుండా ఇతర బ్యాంక్ ఏటీఎం మెషిన్ నుండి లావాదేవీలు చేస్తే ఎక్కువ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. డబ్బు తీసుకోవడమే కాదు బ్యాలెన్స్ చెక్ చేసినా ఛార్జీ చెల్లించాలి. ప్రస్తుతం ఖాతా ఉన్న బ్యాంక్ ఏటీఎం కాకుండా ఇతర ఏటీఎంలను ఉపయోగిస్తే అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. మే 1 నుండి ఈ ఛార్జీ మరింత పెరగనుంది.

కస్టమర్లు తమ సొంత బ్యాంకు ATMల నుండి ప్రతి నెలా ఐదు ఉచిత లావాదేవీలకు (ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు) అర్హులని RBI తెలిపింది. ATM ఇంటర్‌చేంజ్ రుసుమును ATM నెట్‌వర్క్ నిర్ణయిస్తుందని బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ వెల్లడించింది.

Also Read : ఇక గంటలోపే దర్శనం..! తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఎలా అంటే..

”బ్యాంక్ కస్టమర్లు ఇతర బ్యాంకు ATMల నుండి ఉచిత లావాదేవీలకు (ఆర్థిక, ఆర్థికేతర) అర్హులు. అంటే మెట్రో కేంద్రాలలో మూడు లావాదేవీలు, నాన్ మెట్రో కేంద్రాలలో ఐదు లావాదేవీలు. “ఉచిత లావాదేవీలకు మించి, కస్టమర్‌కు ప్రతి లావాదేవీకి గరిష్టంగా 23 రూపాయల రుసుము వసూలు చేయవచ్చు. ఇది మే 1, 2025 నుండి అమల్లోకి వస్తుంది” అని RBI తెలిపింది. ATM ఇంటర్‌చేంజ్ ఫీజు అనేది ఒక బ్యాంకు కస్టమర్‌కు ATM సేవలను అందించడానికి మరొక బ్యాంకుకు చెల్లించే ఛార్జీ. గతంలో జూన్ 2021లో ఇంటర్‌చేంజ్ రుసుమును ఆర్బీఐ సవరించింది.