Tirumala : ఇక గంటలోపే దర్శనం..! తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఎలా అంటే..

ఇక ఏ సమయంలో ఏ సీజన్ లో ఎక్కువమంది భక్తులు వస్తున్నారు అనే సమాచారము టీటీడీకి వస్తుంది.

Tirumala : ఇక గంటలోపే దర్శనం..! తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఎలా అంటే..

Updated On : March 28, 2025 / 6:54 PM IST

Tirumala : తిరుమలకు వచ్చే భక్తులకు వేగంగా, సులభతరంగా ఆ దేవదేవుడి దర్శనం కల్పించేలా నూతన విధానాలకు టీటీడీ శ్రీకారం చుడుతోంది. ఇందుకు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతను ఎక్కువగా వినియోగించుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో దర్శనాలు, ఇతర సేవలు సులభతరం చేసే దిశగా అడుగులు వేయాలని సూచించారు.

దీంతో గూగుల్ సంస్థతో ఒప్పందానికి టీటీడీ సిద్ధమవుతోంది. ఏఐని ఉచితంగా అందించేందుకు గూగుల్ ముందుకొచ్చినట్లుగా సమాచారం. ఇక వారం పది రోజుల్లో టీటీడీ, గూగుల్ మధ్య అవగాహన ఒప్పందం కుదరబోతోంది.

గూగుల్ సంస్థకు చెందిన ప్రతినిధులు త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించి కసరత్తు పూర్తి చేస్తారు. ప్రయోగాత్మకంగా తిరుమలలో ఏఐని వాడతారు. ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేర్పులు చేస్తారు. ఇక ప్రస్తుతం కొన్ని దేవస్థానాలు ఏఐని వినియోగిస్తున్నా భక్తులకు సమాచారం అందించడానికి మాత్రమే పరిమితమయ్యాయి. టీటీడీ ఇందుకు భిన్నంగా దర్శనాలతో పాటు వసతి వివిధ సేవల కోసమూ గూగుల్ సాయం తీసుకోనుంది.

Also Read : వేణుస్వామి ఉగాది పంచాంగం.. ఈ ఏడాది వీళ్లకు పదవీగండం..

ఇక ఏ సమయంలో ఏ సీజన్ లో ఎక్కువమంది భక్తులు వస్తున్నారు అనే సమాచారము టీటీడీకి వస్తుంది. ఇక దానికి అనుగుణంగా భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేసుకోవచ్చు. దర్శన విధి విధానాలు, వస్త్రధారణ, స్థానికంగా అనుసరించాల్సిన నియమాల గురించి ఏఐ సాయంతో యాత్రికులు తెలుసుకోవచ్చు. దేశ, విదేశాల భక్తులకు వారి భాషల్లోనే సమాచారం అందించేలా ఈ సాంకేతికత ఉండనుంది. గూగుల్ మ్యాప్ ద్వారా దర్శన సమాచారం, రద్దీ తెలుసుకునే ఛాన్స్ ఉంది.

ఎప్పటికప్పుడు అద్దె గదులు, అన్నప్రసాదం, కల్యాణకట్ట గురించి సమాచారం తెలుసుకోవచ్చు. భక్తుల రద్దీ నియంత్రణకు వేగంగా చర్యలు చేపట్టేలా సాంకేతికత అభివృద్ధి చేయనున్నారు. అంతేకాదు భద్రత విషయంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకోనున్నారు. మొత్తంగా ఏఐతో తిరుమల దర్శనం సులభతరం చేసేలా చర్యలు ఉండనున్నాయి.